NTV Telugu Site icon

26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్‌ సన్నిహితుడి మృతి

Terror Attacks

Terror Attacks

26/11 Attack: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు అబ్దుల్ సలామ్ భుట్టావీ పాకిస్థాన్ జైలులో మరణించాడు. అబ్దుల్ సలామ్ భుట్టావీ 2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. టెర్రిరిస్టుల ఫండింగ్ కోసం ప్రయత్నించిన కేసులో పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2012లో అబ్దుల్ సలామ్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. చాలా సంవత్సరాల తరువాత భుట్టావీని ఉగ్రవాద నిధుల ఆరోపణలపై పాకిస్తాన్ అరెస్టు చేసింది. సుమారు మూడేళ్ల క్రితం లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రెహ్మాన్ మక్కీతో పాటు ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా నిర్ధారణ జరిగింది. భుట్టవీకి ఆగస్టు 2020లో పదహారున్నరేళ్ల శిక్ష విధించబడింది.

Read Also:Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..

లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను 2002 , 2008లో పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎల్‌ఇటి తాత్కాలిక అధిపతిగా పనిచేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జైలులో అబ్దుల్ సలామ్ గుండెపోటుతో మరణించినట్లు సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. 78 ఏళ్ల తీవ్రవాది భుత్తావి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను కూడా ఓ సంస్థ విడుదల చేసింది. భుత్తావీ అంత్యక్రియలు మంగళవారం ఉదయం లాహోర్ సమీపంలోని మురిడ్కేలోని ఉగ్రవాద సంస్థ మర్కజ సెంటర్‌లో జరిగాయి.

Read Also:Vizag Job Scam: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

భారత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉగ్రవాది భుట్టావి మరణాన్ని ధృవీకరించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదని చెప్పారు. నవంబర్ 2008లో, 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని అనేక ప్రదేశాలలో తీవ్రవాద దాడులకు పాల్పడ్డారు. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ వంటి అనేక దేశాల పౌరులతో సహా మొత్తం 166 మంది మరణించారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. తరువాత పాకిస్తాన్ కూడా దాడులకు పాల్పడినందుకు ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీతో సహా లష్కరే తోయిబాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో పురోగతి లేదు.