NTV Telugu Site icon

Top Headlinews @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తమిళనాడులో భారీ పేలుడు..

తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విడుదల నగర్ జిల్లా శివకాశిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు పంపడానికి మూడు లారీల్లో టపాసులు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మూడు లారీల్లో ఒకదానికొకటి వెనువెంటనే మంటలు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో పేలుడు శబ్దాలతో దట్టమైన పోగా కమ్ముకున్నాయి. గోడౌన్ లో లారీని ఎక్కించే టటువంటి కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరకున్న ఐదు ఫైరింజలతో మంట ఆర్పుతున్నారు.

కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)

కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శన‌పై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!

పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్ రెండు పతకాలు సాధించింది. చిన్న వయసులో రెండు పతకాలు సాధించడంపై భారతీయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పారిస్ నుంచి భారత్‌కు వచ్చాక.. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి పతకాలు చూపించింది. అంతేకాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పలు ప్రైవేటు సంస్థలు ఆహ్వానించి సన్మానం చేశాయి. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలను అందరికీ చూపించింది. తాజాగా దీనిపై ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ప్రైవేట్ ఈవెంట్లలో మను భాకర్ పతకాలు ప్రదర్శించడాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తు్న్నారు. ఆమె తీరును తప్పుపట్టారు. ప్రైవేటు ఈవెంట్లలో పతకాలు ఎలా చూపిస్తారంటూ నిలదీశారు. తాజాగా ఇదే అంశంపై మను భాకర్ స్పందించింది. నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఈవెంట్లలో పతకాలు చూపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఒక్కరికి పతకాలు చూడాలనే కోరిక ఉంటుంది. ఎవరైనా అడిగితే చూపిస్తుంటానని వివరించారు. అంతేకాకుండా నిర్వాహకులు కూడా పతకాలు వెంట తీసుకుని రావాలని కోరతారన్నారు. వారి అభ్యర్థన మేరకు తీసుకెళ్తున్నట్లు మను భాకర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా చూపించమంటే గర్వంగా చూపిస్తానన్నారు.

అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..

కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. అలా అని పథకాలను ఆపడం లేద మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాలంటీర్లు లేరని.. సచివాలయ ఉద్యోగులతోనే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అర్హత లేని వారు అనేక మంది పథకాలు పొందుతున్నారని, వారిని కట్టడి చేస్తామని చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇస్తామన్నారు. బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మత్స్యకారులకు ఐదేళ్లలో ఒక్క వల ఇవ్వలేదని, ఒక్క బోటు ఇవ్వలేదని.. డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదని మంత్రి తెలిపారు.

కల్తీ నెయ్యి నిజం, అపచారం జరిగిందనేది నిజం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుమల వ్యవహరం జగన్‌కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి నిజం.. లడ్డూల్లో వినియోగించింది నిజమని.. అపచారం జరిగిందనేది నిజమని ఆయన తెలిపారు. గతంలో ఉన్న లడ్డు నాణ్యతకు.. ఇప్పుడున్న లడ్డు నాణ్యత ఏంటని భక్తులని అడగండి.. వాస్తవాలు తేలుతాయన్నారు.

పాలకుడు మారాడు.. అందుకే తిరుమలలో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా.. చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారన్నారు. వెంకన్న మీద జగనుకు నమ్మకం ఉన్నది నిజమైతే డిక్లరేషన్ మీద సంతకం చేయాలన్నారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది చాలన్నారు. కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తాడు.. టీటీడీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధికి వెన్నెముక

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కీలక సదస్సుతో మౌలిక వసతుల రంగంలో వృద్ధి, నూతన పెట్టుబడుల అన్వేషణకు, పెట్టుబడుల్లో భాగస్వామ్యానికి మంచి అవకాశం లభించినట్లైందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ఆర్ధికాభివృద్ధికి వెన్నెముకగా నిలబడుతోందన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా 5 ట్రిలియన్ ఎకానమీ సాధించడం జరుగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో త్వరితగతిన వృద్ధి, అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడి ముందుకు సాగుతూ జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ కీలక పెట్టుబడులు సాధించేందుకు, ఒక మోడల్ స్టేట్ గా నిలిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.. ముఖ్యంగా ఎయిర్ పోర్టులు, రోడ్లు, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు మరియు గ్రీన్ పోర్టుల అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనే రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తోందన్నారు.

రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్

అత్యాచారం ఆరోపణల కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబును సిట్‌ బృందం అరెస్టు చేసింది. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇడవేల బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబు అమ్మ(మలయాళ నటీనటుల సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లానని, అప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ అత్యాచారం కేసులో నటుడు ఇడవేల బాబు అరెస్ట్ అయ్యారు. విచారణ అనంతరం ఇడవేల బాబును అరెస్టు చేశారు.

మణిపూర్‌లో శివాలయంపై దుండగుల దాడి..

గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పటించారు. దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. రెండు వారాల వ్యవధిలో ఆలయంపై రెండోదాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆలయం మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

రేపు ఢిల్లీకి మంత్రి సీత‌క్క

రేపు ఢిల్లీకి మంత్రి సీతక్క వెళ్లనున్నున్నారు. పెసా చ‌ట్టంపై జ‌రిగే జాతీయ స‌ద‌స్సుల్లో మంత్రి సీత‌క్క పాల్గొననున్నారు. పెసా చ‌ట్టంపై గురువారం నాడు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స‌ద‌స్సు జరుగనుంది. న్యూ ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ లో పెసా చ‌ట్టం అమ‌లు, ఎదుర‌వుతున్న స‌వాళ్లపై చ‌ర్చ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల మంత్రులు, ఉన్న‌తాధికారులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున స‌ద‌స్సుకు పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క హ‌జ‌ర‌వుతున్నారు. ఆదివాసీ, గిరిజ‌నుల అభివృద్ది, పెసా చ‌ట్ట అమ‌ల్లో ఎదుర‌వుతున్న ఇబ్బందులు, ప‌రిష్కార మార్గాల‌పై ప్ర‌సంగించ‌నున్నారు మంత్రి సీత‌క్క. పంచాయతీల నిబంధనల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 PESA చట్టంగా సంక్షిప్తీకరించబడింది. భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం . షెడ్యూల్డ్ ప్రాంతాలు భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ద్వారా గుర్తించబడిన ప్రాంతాలు. షెడ్యూల్డ్ ప్రాంతాలు భారతదేశంలోని పది రాష్ట్రాల్లో గిరిజన సంఘాలు అధికంగా ఉన్నాయి.