Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్ న్యూస్

మా ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి తన్నారు.. ఇది న్యాయమేనా..?

విశాఖలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు.

కాగా.. ఆ వీడియోపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి బూటు కాలుతో తన్నారంటూ మండిపడ్డారు. ఇది న్యాయమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ సిద్ధం సభలో వైసీపీ శ్రేణులు దుర్మార్గంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఫొటో పెట్టి అలాగే చేస్తే పోలీసులు అనుమతిస్తారా అంటూ చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో సైకో పాలన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు చెప్పారు. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు.

1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్‌ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారు

బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్‌పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కిషన్‌ రెడ్డి. ఈ సంఘాలకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వమన్నారు. బ్యాంకులు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా ‌సమయంలో ఆర్థిక సాయం పై మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కిషన్‌ రెడ్డి. ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే వారికి 20లక్షల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని, రుణాల పై 7శాతం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. కాని ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ వడ్డీ చెల్లించలేదని ఆయన మండిపడ్డారు. స్వయం సహాయక సంఘాల ఉంటే ఆ ప్రాంతంలో సమస్యలపై మాట్లాడుతారు.. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, స్వయం సహాయక సంఘాల ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు కిషన్‌ రెడ్డి. స్వయం సహాయక సంఘాలు ఒక పెద్ద శక్తి అని, ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాల పై దృష్టి సారించాలన్నారు.

బిక్షగాళ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సరికొత్త ప్లాన్..

బిక్షగాళ్ల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందేకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, చారిత్రిక ప్రదేశాల్లో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులు యాచిస్తుంటారు. ఇంకొందరు ఆయా కారణాల చేత ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. మరికొందరైతే ఈ వృత్తిని అడ్డంపెట్టుకుని ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద మాఫీయాలు కూడా తయారయ్యాయి. కొంత మంది పిల్లల్ని, మహిళలను అడ్డంపెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని బిక్షగాళ్ల రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్‌పుట్‌ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్‌ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.

ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ల్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి వారికి మంత్రి వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని అంగీకరించిన ఫిలిప్ గ్రీన్…. రాష్ట్రానికి తమ దేశం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడానికి చొరువ తీసుకుంటామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు మటన్‌, చికెన్‌ బంద్‌

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, రిటైల్ మాంసం, గొడ్డు మాంసం దుకాణాలను జనవరి 30న మూసివేయనున్నారు. ఈ క్రమంలో, ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ GHMC పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్‌లను అభ్యర్థించారు.

ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు..

ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే చివరి రోజు అవుతుందని మండిపడ్డారు. బట్టలు విప్పి నడి రోడ్డు పై నిలపెడతానని ఫైర్ అయ్యారు.

నాపై మాట్లాడినా వారందరూ కాలగర్భంలో కలసిపోయారు..

పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్‌ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.

 

Exit mobile version