NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి స్నానఘట్టాలు:
కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిపోయాయి. స్నానాలు ఆచరించిన మహిళలు గోదావరి నదిలో 30 ఒత్తులతో (కార్తీక మాసంలోని ఒక్కో రోజుకు ఒక్కో దీపం) కార్తీక దీపాలు వదులుతున్నారు. భక్తుల శివ నామస్మరణతో ఘాట్లు మార్మోగిపోతున్నాయి.

టోకెన్స్ జారీ చేసిన టీటీడీ:
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ చేశారు.

తెలంగాణకు వర్ష సూచన:
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత బాగా తగ్గిపోయింది. హైదరాబాద్‌లో రెండ్రోజుల క్రితం 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ప్రస్తుతం 21డిగ్రీల వరకు పెరిగింది. మరో రెండ్రోజులు ఇదే వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

నేటి నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు:
తెలంగాణ-ఛత్తీ్‌స్ గఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. నేటి నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్‌ కోసం గాలిస్తున్నారు. మండలాల్లో.. సరిహద్దులకు దారి తీసే మార్గాల్లో భారీగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నాకా బందీ నిర్వహిస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ముందు జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయించి.. హిట్‌ లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

తుఫాను బీభత్సం:
ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విలుపురం, కళ్లకురిచ్చిలో రెడ్ అలెర్ట్, తమిళనాడులో ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. తిరుచ్చి విల్లుపురం హైవేపై వరద నీరు భారీగా చేరింది. పుదుచ్చేరిలోని కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో అధికారులు వరద సహాయక చర్యలు వేగవంతం చేశారు.

మహారాష్ట్ర సీఎం పేరు నేడు ఖరారు?:
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది. తన ఆరోగ్యం బాగోలేదని అందుకే గ్రామానికి వచ్చానని షిండే చెప్పారు. జ్వరం నుంచి కోలుకుంటున్న ఆయన ఆదివారం సాయంత్రం స్వగ్రామం నుంచి ముంబైకి చేరుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి తాను సంపూర్ణ మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిసున్న చిత్రం పుష్ప 2. నేడు హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈవెంట్ మొదలుకానుంది. మూడేళ్ళ తర్వాత బన్నీ రిలీజ్ కానుండడంతో ఈవెంట్ కు భారీగా రానున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. ఈ నేపథ్యంలో యూసుఫ్ గూడలోని కేవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక దర్శకుడు సుక్కు మరియు చిత్ర బృందం హాజరుకానుంది. డిసెంబర్ 5 వ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా.

డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ కొరియోగ్రాఫర్:
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్క సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు. కొందరు మద్యం సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి ఉన్నారు. ఆయనతో పాటు ప్రముఖ ఆర్కిటెక్టర్ ప్రియాంక రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కోహ్లీ తాగే బ్లాక్‌వాటర్ గురించి తెలుసా?:
టీమిండియాలో అందరికెల్లా విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి అత్యంత ప్రాధాన్యమిస్తారు. అతడు చేసే వర్కౌట్‌ వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటాం. విరాట్ డైట్ చాలా ప్రత్యేకమని చెబుతుంటారు. ఆ డైట్ కేవలం ఆహారానికే వర్తించదు.. విరాట్ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మినరల్‌ వాటర్‌ కి బదులు ‘బ్లాక్‌ వాటర్‌’ని తాగుతాడట. సాధారణ మినరల్ వాటర్ బాటిల్ ధర లీటరుకు రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర సుమారు రూ.600 నుంచి రూ.3000 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుందట. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడు కోహ్లీ.