NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్:
ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా సాయం అందుతోంది. ఆ నిర్ణయాలు ప్రజల్లో సానుకూలత పెంచుతుండగా.. ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో బీజేపీ పైన గతం కంటే రాష్ట్ర ప్రజల్లో సానుకూలత పెరిగింది. వీటి అన్నిటిపై నోవాటేల్లో ఈరోజు ఉదయం 8 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు.

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు:
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈరోజటితో ముగియనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది.

ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేరు:
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా ఉంది.. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ఐదేళ్లు లోక్ సభలో పసుపు బోర్డు కోసం కోట్లాడాను అన్నారు. దీని కోసం 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాసి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాను అని పేర్కొన్నారు. ఇప్పుడు, ప్రోటోకాల్ పాటించకుండా బోర్డు ప్రకటించారు అని ఆరోపించింది. పసుపు బోర్డు రావడంతో సంపూర్ణం కాదు.. రైతులను కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు రావాలి అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2014 నుంచి పసుపు దిగుమతులు మన దేశంలోకి పెరిగాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి.. అలాగే, దిగుమతులు నియంత్రించాలన్నారు. అలాగే, పసుపు ప్రాంతాల్లో ఉంటే ప్రజా ప్రతినిధులకు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేర్చాలని డిమాండ్ చేసింది. ఇక, మేము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయాల్లో లేరు అని ఎద్దేవా చేసింది.

అదృశ్యమైన ఏడు నెలలకు వెలుగులోకి హత్య విషయం:
నిజామాబాద్ జిల్లా మోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే, రోడ్‌ బుచ్చన్నతో దగ్గర లక్ష రూపాయల చిట్టీ వేసింది జంగం విజయ. అయితే, చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేకపోవడంతో అతడిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. పైసల కోసం నా పరువు తీస్తుందేమో అనే కారణంతో బుచ్చన్న తన పాలేరు నగేష్‌తో కలిసి సదరు మహిళను హత్య చేసి పూడ్చి పెట్టారు. ఇక, మద్యం మత్తుతో నీ తల్లి చనిపోయిందని రోడ్ బుచ్చన్న చెప్పడంతో జంగం విజయ కుమారుడు మనోహర్ పోలీసులను ఆశ్రయించాడు. అదృశ్యమైన 7 నెలలకు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు మహిళను చంపి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశాన్ని జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఏడు నెలలు కావడంతో ఎముకలు, చీర మాత్రమే తవ్వకాల్లో బయట పడ్డాయి. కాగా, ఆ చీర జంగం విజయదే అని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడే పోస్టుమార్టం చేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

భారత ప్రభుత్వం సాయం కోరిన సీమా హైదర్ మొదటి భర్త:
సీమా హైదర్ ఈ పేరు గత కొన్నాళ్లుగా పాక్, భారత్ రెండు దేశాల్లో మార్మోగిపోతుంది. 2023లో తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా మొదటి భర్త, తన పిల్లలను కలవడానికి, వారిని తన వద్ద ఉంచుకోవడానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. సీమ ఆన్‌లైన్‌లో పరిచయమైన తన ప్రియుడితో కలిసి జీవించడానికి భారతదేశానికి వచ్చింది. సీమా మొదటి భర్త గులాం హైదర్ ఇటీవలి వీడియో సందేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ పాకిస్తాన్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ సహాయంతో 2023 చివరి నుండి తన పిల్లల కస్టడీని పొందడానికి ప్రయత్నిస్తున్నానని హైదర్ పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో వింత వ్యాధి:
జమ్మూ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో జరిగిన ఒక మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ బృందం ప్రభావిత గ్రామాన్ని సందర్శించి మరణాలకు గల కారణాలను కనుగొంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖ నుండి నిపుణులు ఉంటారు.

డిగ్రీ లేకున్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్:
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేసి, “ఎవ్రీథింగ్ యాప్” కోసం టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియలో డిగ్రీల అవసరం, గత అనుభవం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కు వెళ్లారో కూడా తెలపాల్సిన అవసరం లేదని.. కేవలం మీ కోడ్ చూపిస్తే చాలని మస్క్ తెలిపారు. మాములుగా, మస్క్ ప్రతిభకు పెద్ద పీట వేయడం కొత్తేమీ కాదు. 2014లోనే టెస్లాలో ఉద్యోగం పొందడానికి యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాలను చూపిస్తే చాలు, ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం లేదని మస్క్ నమ్ముతారు.

నైజీరియాలో ఘోర ప్రమాదం:
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి కనీసం 70 మంది మరణించారు. నైజర్ ప్రావిన్స్‌లోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కుకు గ్యాసోలిన్‌ను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఇంధన బదిలీ జరుగుతుండగా పేలుడు సంభవించిందని, గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నవారు.. పక్కనే ఉన్నవారు మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి చెందిన హుస్సేని ఇసా తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తను తెలిపారు.

20 నిమిషాల వైల్డ్ ఫైర్:
ప్రజంట్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జక్కన్న సినిమా అంటే మామూలుగా ఉండదు, అందులోను సూపర్ స్టార్‌తో అంటే ఫ్యాన్స్ ఏక్స్‌పెక్టెషన్స్ పీక్స్ లో ఉంటాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటూ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే చేయించబోతున్నాడట జక్కన్న.

పెళ్లిపై మొట్టమొదటి సారిగా రియాక్ట్ అయిన టబు:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మ్యరెజ్ పై తన ఒపీనియన్ ని క్లియర్ గా చెప్పేసింది.. ‘తోడు లేకుండా ప్రస్తుతం బాగానే ఉన్నాను. మగాడి అవసరం కేవలం పడక గదిలో మాత్రమే ఉంటుంది. ఒక మగాడు బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటాడు.. కానీ లైఫ్ లో కాదు. అందుకే నాకు పెళ్లి పై ఎలాంటి ఆసక్తి లేదు.’ అంటూ వెల్లడించింది. టబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన మాటలపై కొంతమంది పాజిటివ్‌గా స్పందించగా మరికొంతమంది ఈమెను విమర్శిస్తున్నారు. ‘53 ఏళ్లు అయినా తన అందంతో మగాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికి తరగని అందాన్ని మెయింటైన్ చేస్తుంది’ టబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ‘తోడు ఉండాలి మీకంటూ ఒక పర్యావరణ ఉంటే బాగుంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టబు మాటలు వింటుంటే సింగిల్ గానే ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

ధనాధన్ ఇన్నింగ్స్‭లకు వేళాయే:
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 22 నుండి ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్‌కు సంబంధించిన ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా.. ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇక సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. ఇకపోతే, భారత్ జట్టు ఇంగ్లండ్ పై టీ20 రికార్డుల కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 24 టీ20 మ్యాచ్‌లు జరిగగా, అందులో 13 మ్యాచ్ లలో భారత్ విజయాలను అందుకోగా, 11లో ఇంగ్లండ్ విజయం సాధించి.