ఏపీలో ‘డైకిన్’ పెట్టుబడులు:
జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది.
నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్:
మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం (డిసెంబర్ 18) కర్నూలుకు రానున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.55 గంటలకు కర్నూలు ఏపీఎస్‌పీ గ్రౌండ్స్ హెలిపాడ్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు నగర శివారులో ఉన్న జీఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు.
రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం సిద్ధం చేశారు.
చావు నాటకం బట్టబయలు:
మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడారు. ఈ కుంభకోణానికి మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేష్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. 2021లో శ్రీను చనిపోయినట్లు, 2023లో మల్లేశం చనిపోయినట్లు అధికారులను నమ్మించి గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం:
సరిహద్దు వివాదంపై భారత్- చైనాల మధ్య దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి. ఈక్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలనే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యాలు చేశారాయన. కాగా, రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోడీతో చైనా అధినేత జిన్‌పింగ్ ఇరు దేశాల మధ్య సంబంధాల బలపడటానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వాంగ్ యీ పేర్కొన్నారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందేందుకు ఢిల్లీతో కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వెల్లడించారు.
48 గంటల డెడ్‌లైన్:
లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై మంగళవారం ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ వచ్చింది. జమిలి ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ సవరణ బిల్లులు.. దానికి ఆమోదం పొందాలంటే తప్పకుండా 3/2 మెజారిటీ అవసరం. దీంతో సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఇక, జేపీసీ ఏర్పాటు ప్రక్రియను స్టార్ట్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సభకు చెప్పుకొచ్చారు.
ఫైనల్ షెడ్యూల్ లో ‘విదాముయార్చి’:
విదాముయార్చి సినిమాకు సంభందించి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ను షేర్ చేసింది నిర్మాణ సంస్థ లైకా. ఈ సినిమా చివరి షూట్ అజిత్ అడుగుపెట్టాడు అని త్రిష, అజిత్ ల ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో ఆట ఆరంభం తర్వాత మరోసారి అజిత్, త్రిష జోడి కడుతున్న సినిమా ‘విదాముయార్చి’. జేమ్స్ బాండ్ లుక్ లో అజిత్ కుమార్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అజిత్ చేయి పట్టుకుని నడుస్తున్న త్రిష లుక్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరోసారి ఈ జోడి ఎదో మ్యాజిక్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఇస్తుందనే చెప్పాలి. ఇటీవల హీరో అజిత్ ఈ సినిమా డబ్బింగ్ కూడా ఫినిష్ చేసాడు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఫ్యాన్స్ కు పూనకాలే:
గేమ్ చేంజర్ సినిమాలోని ఓ రెండు బ్లాకుల గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న గేమ్ ఛేంజర్ లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ స్టైలిష్ యాక్షన్ ను థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ షాక్ అవడం పక్కా అని ఈ రెండు ఎపిపోడ్స్ ను సినియాను ఓ రేంజ్ లో నిలబెడతాయని గట్టిగా వినిపిస్తుంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఇదిలా ఉండగా ‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
టీమిండియాను కాపాడిన వరణుడు:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మొదటి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంబించాల్సి ఉంది. చివరి రోజు ఆటలో వర్షం కారణంగా ఇప్పటికే గంటకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఆటకు మరింత ఆలస్యం కానుంది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోయే మ్యాచులో టీమిండియాను వరణుడు కాపాడాడు అనే చెప్పాలి.