NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి.

రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి:
క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో ఉన్న తాగునీరు, పార్కులు, వీధి వ్యాపారుల సమస్యలు, పార్కింగ్ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. అనధికార నిర్మాణాలు, లే అవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది.. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది.. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది.. ఏ పని చేయాలన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా దారుణంగా చేసిందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు:
కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే ఎనమిది రోజులు విజయవంతంగా ముగిసాయి. ఎనమిది రోజుల్లో విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోగా.. నేడు 9వ రోజు మరిన్ని కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్ధం అవుతోంది. కార్తీక ఆదివారం వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో చూద్దాం. నేడు శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై ప్రసిద్ధక్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన జరగనుంది. భక్తులచే అమ్మవారి విగ్రహాలకు కోటి కుంకుమార్చన చేయిస్తారు. రోజు మాదిరే పల్లకీ వాహన సేవ ఉంటుంది.

రెండో రోజుకు చేరిన బీజేపీ నేతల మూసీ నిద్ర:
బీజేపీ నేతల మూసీ నిద్ర రెండో రోజుకు చేరింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ మూసీ నిద్ర మొదలైంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ముగియనుంది. నిన్న మూసి పరివాహక ప్రాంతాల్లో చేరుకున్న బీజేపీ నేతలు బస్తీల్లో పర్యటించారు. బస్తీ వాసుల ఇళ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్ర చేశారు. మూసీ ప్రక్షాళన చేయండి… పేద ప్రజల ఇల్లు కూల్చకండి అనే డిమాండ్ తో.. సీఎం సవాల్ కు స్పందనగా బీజేపీ నేతలు మూసీ నిద్ర చేపట్టారు. మూసీ నిద్రలో భాగంగా వివిధ 20 బస్తీల్లో 20మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. అంబర్‌ పేట తులసిరామ్‌ నగర్‌ లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మలక్‌పేట్‌ శాలివాహన నగర్‌ లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీనగర్‌ లో ఈటల, రాజేంద్ర నగర్‌ హైదర్‌ షా కోట్‌ లో కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి నిద్ర చేశారు. అక్కడవున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. ఇవాళ అల్పహారం సేకరించిన అనంతరం ఈ కార్యక్రమం ముగియనుంది.

పేడ కుప్పలో నోట్ల కట్టలు:
హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు శనివారం బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో దాడి చేశాయి. ఈ దాడి అధికారులు సైతం ఆశ్చర్య పరిచింది. ఇక్కడ ఆవు పేడ కుప్ప నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. కమ్రాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో ఈ రికవరీ చేసినట్లు తెలిపారు. వాస్తవానికి, హైదరాబాద్, ఒడిశా నుంచి పోలీసు అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది.

సీఎం ఇంటిపై దాడి:
మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిరసనకారులు రాష్ట్ర మంత్రులు సపమ్ రంజన్, ఎల్ సుసీంద్రో సింగ్, వై ఖేమ్‌చంద్ ఇళ్లను ముట్టడించారు. ముగ్గురు మంత్రులు, ఆరుగురి ఎమ్మెల్యేల ఇళ్లపై దాడిచేసి నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోడీ:
3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలుత నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. నైజీరియాలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారత ప్రధాని వారికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్​ టినుబుతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.

టీమిండియాకు బ్యాడ్ న్యూస్:
ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మ‌న్ గిల్‌ కూడా గాయపడ్డాడు. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ వేలికి గాయమైంది. అతని వేలుకు బంతి బలంగా తాకడంతో .. వెంటనే మ్యాచ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత స్కానింగ్ తీయగా గిల్ వేలికి చీలిక వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తొలి టెస్టుకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఆలోపు అతడు కోలుకునే ఛాన్స్ తక్కువగా ఉందని బీసీసీఐ చెప్పుకొచ్చింది.

ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్:
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరిగుతోంది. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉండగానే మరో సినిమా షూట్ లో పాల్గొన్నాడు నితిన్. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు నితిన్. రాబిన్ హుడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల కానుండగా తమ్ముడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

చారిత్రాత్మక వీరుడి కథలో ‘పుష్పరాజ్’:
బన్నీ, త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం కావచ్చఅని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. పైగా త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా. అందుకే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ లో మైథలాజికల్ టచ్ ఇచ్చారు. అలాగే, సినిమాలో హిస్టారికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా చారిత్రాత్మక వీరుడైన చెంఘీజ్ ఖాన్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

 

Show comments