కెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం:
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మావోయిస్టుల కరపత్రం:
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో నారాయణపూర్ ఎన్కౌంటర్ బూటకమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లు పిచ్చి డివిజనల్ కమిటీ పేరుతో కరపత్రం విడుదల చేశారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో నారాయణపూర్ జిల్లాలోని కుమ్మంలోని లకేవేద వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ అబద్ధం! అని కరపత్రంలో తెలిపారు. 7 గురు మృతుల్లో 5 మంది గ్రామస్థులే అని వెల్లడించారు. డిసెంబరు 10 నుండి 13వ తేదీ వరకు, నారాయణపూర్ జిల్లా, మాద్ డివిజన్‌లోని ఇంద్రావతి ప్రాంతంలో కాగర్ దామన్ అభియాన్ కింద, సుమారు 4000 మంది పోలీసులు పారా మిలటరి సిబ్బందితో దాడి చేశారు. 11వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో లకేవేద పెండలో వ్యవసాయం చేస్తున్న వారిని పోలీసులు చుట్టుముట్టి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
తాజ్‌మహాల్ కట్టిన కూలీల చేతులు నరికేశారు:
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.
అదానీ లంచం ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన అమిత్ షా:
అదానీ లంచం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తొలిసారిగా స్పందించారు. మీడియా కథనాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదని, డాక్యుమెంట్ల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదానీ కేసుపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటిర్య్వూలో అమిత్ షా మాట్లాడారు. “అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలను భారత హోం మంత్రిత్వ శాఖ ఎలా చూస్తుంది?” అని జర్నలిస్టు షా ను ప్రశ్నించారు. ‘‘వేరే దేశంలోని కోర్టులో ఆరోపణలు ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆరోపణలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఏ ప్రభుత్వమూ వ్యవహరించదు.. అక్కడ ఆరోపణలు రుజువైన తర్వాత పత్రాలు మనదేశానికి వస్తాయి. వాటిని పరిశీలించిన చర్యలు తీసుకుంటాం.” అని షా స్పష్టం చేశారు.
శృంగారానికి నిరాకరించినందుకు:
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు. తనతో శృంగారానికి నిరాకరించినందుకు మహిళను హత్య చేశాడు. కోల్‌కతా పోలీసులు దక్షిణ 24 పరగణాస్‌లోని డైమండ్ హార్బర్‌లోని అతని స్వగ్రామం బసుల్దంగాలో అరెస్టు చేశారు.
త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి:
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రభావం నుండి విముక్తి పొందాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
ఆస్ట్రేలియా స్కోరు 104/3:
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు తొలి సెషన్ పూర్తయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 103 రన్స్ చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (24), ట్రావిస్ హెడ్ (20) ఉన్నారు. ఓవర్‌నైట్ 28/0 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కంగారో జట్టుకు షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం స్టీవ్ స్మిత్‌తో కలిసిన మార్నస్ లబుషేన్ (12) క్రీజ్‌లో పాతుకుపోయాడు. అయితే నితీశ్ రెడ్డి వేసిన ఆఫ్‌సైడ్ బంతికి లబుషేన్ దొరికిపోయాడు.