NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రతన్ టాటా కన్నుమూత:
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. సోమవారం టాటా ఆస్పత్రికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన రతన్‌ టాటా.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రెండ్రోజులకే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు:
కొలాబాలోని రతన్‌ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది.

పాతబస్తీలో యువకుడు దారుణ హత్య:
బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టేపల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో కత్తులతో దాడి చేసి హత్య చేసాడు సిద్దిక్ అనే వ్యక్తి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హత్యకి పాత కక్షలే కారణం అని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం:
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

గత ప్రభుత్వం హయంలో నాకంటే బాధితుడు ఎవరున్నారు:
బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా బాధపడ్డది తానేనని.. గత ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. జైలులో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ప్రచారం కూడా జరిగిందన్నారు. జైలు మీదుగా డ్రోన్లు కూడా ఎగరేశారని, జైలులో తన గదిలో నిఘా కెమెరాలు పెట్టారని, వాటిని చూసి తానే తొలిగించామన్నాని చెప్పనట్లు తెలిపారు. జైలులో ఉన్న సమయంలో తనకు కనీసం వేడి నీళ్లు కూడా ఇవ్వలేదని, తనను చిత్రహింసలకు గురిచేయడాని చల్లటి నీరు ఇచ్చేవారని సీఎం చెప్పారు. దోమలు కుడితే కనీసం దోమతెర కూడా ఇవ్వలేదని బాధపడ్డారు.

మాచో స్టార్ మీడియా ముచ్చట్లు:
విశ్వం విడుదల సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు. ‘శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా కాలం క్రితం అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత విశ్వం కథ లైన్ గా చెప్పారు. పాయింట్ చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని సిద్ధం చేశారు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు.. యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి’ అని అన్నారు.

మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ టాక్:
సుధీర్ బాబు నటించిన తాజా సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. సినిమా చూసిన ఫాన్స్ ఎక్స్ వేదికగా తమ్ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడని ట్వీట్స్ చేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని, కానీ కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందఅంటున్నారు. తెరపై భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడట. ఇక కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ అట. ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చని పబ్లిక్ టాక్.