NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

బీసీలకు మరోసారి పెద్దపీట:
సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు ఘనతే అని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం పదవీవిరమణ చేయనుండగా.. ఆ స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు చేపడతారు.

2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం:
2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం అని డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్‌ను కూడా మరో 2,3 మాసాల్లో ప్రయోగిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని కూడా నింగిలోకి పంపనున్నామని సోమనాథ్‌ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి రాత్రి 10:05కి నింగిలోకి దూసుకెళ్లనుంది.

సంతాప దినాల్లో.. రాహుల్‌ న్యూయర్‌ వేడుకలా:
తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం అనంతరం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాటలకు కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పీవీ నరహింహా రావుకి భారత రత్న ఇచ్చింది పీఎం మోడీ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం నిర్వహించిన అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా కుటుంబం పీవీ మీద కక్ష పెట్టుకున్నారన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి భారత రత్న ఇవ్వకపోతే బీజేపీ ఇచ్చిందన్నారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్డినెన్సు కాపీలను చించి వేసింది రాహుల్ గాంధీ .. మన్మోహన్ సింగ్ ను అవమానించారన్నారు. మన్మోహన్ సింగ్ కు దేశం సంతాపం తెలుపుతున్న వేళ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్ళారట..! అని అన్నారు. మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో చెబుతున్నా అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్సు తెస్తే చించి అవమాణించినది రాహుల్ గాంధీ అని అసెంబ్లీలో తెలిపారు. సంతాపంలో ఆయన కీర్తితో పాటు అవమానాలు కూడా చెప్తున్న రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా..? లేదా..? అని అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్:
పీవీ నరహింహా రావుకి భారత రత్న ఇచ్చింది పీఎం మోడీ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం నిర్వహించిన అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్సు తెస్తే చించి అవమాణించినది రాహుల్ గాంధీ అని అసెంబ్లీలో తెలిపారు. సంతాపంలో ఆయన కీర్తితో పాటు అవమానాలు కూడా చెప్తున్న రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వెళ్ళారా..? లేదా..? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భక్తి శివుడి మీద… చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని అన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజలు మర్చిపోరన్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారన్నారు. స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. డిల్లీలో స్థలాన్ని కేటాయిస్తామని అయన కుటుంబ సభ్యులకు అధికారులు వెళ్లి చెప్పారన్నారు.

యువతపై డబుల్ దాడులు:
బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ వేలాదిమంది అభ్యర్థులు ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించింది. డబుల్ ఇంజిన్‌ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొనింది. ఈ చలిలో విద్యార్థులపై జల ఫిరంగులు ఉపయోగించడం, లాఠీఛార్జ్ చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు స్టూడెంట్స్ పై దాడులకు దిగిందని మండిపడ్డారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం నితీష్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ యత్నిస్తుందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.

పంజాబ్‌లో ఉద్రిక్తతలకు దారి తీసిన రైతుల బంద్:
ఈరోజు పంజాబ్‌ రైతులు చేపట్టిన బంద్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చాలా చోట్ల రహదారులను బంద్ చేసి రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు నిరసనకారులను అడ్డుకుంటున్నారు. అయితే, రైతుల న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బంద్ కొనసాగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఇక, పటియాల-చండీగఢ్‌ జాతీయ రహదారిపై టోల్‌ ప్లాజాల దగ్గర రైతులు ధర్నాకు దిగడంతో ఆ రూట్ లో భారీగా వాహనాలు ఆగిపోయాయి. అమృత్‌సర్‌ గోల్డెన్‌ గేట్‌ దగ్గర రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. బటిండాలోని రాంపుర్‌లో ప్రవేశ పాయింట్ల వద్ద రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో పట్టణంలోకి రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

వంట గదులకి కిటికీలు పెట్టొద్దు:
అఫ్గానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటి వారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అయితే, వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల దగ్గరకు వచ్చిన మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలి అని తాలిబర్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని తక్షణమే మూసివేయాలి అని అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి.. కొత్త రూల్స్ అమలును పర్యవేక్షించనున్నారు.

మెల్‌బోర్న్‌ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం:
మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టెస్టులో 184 ప‌రుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్టులోని రెండో ఇన్సింగ్స్ లో భారత్ తరపున యశస్వి జైస్వాల్ (84)తో పాటు రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేయగా.. భారత్ 369 రన్స్ చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది.

జీ తెలుగు డబుల్ బొనాంజా:
అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతిని జనవరి 1న(బుధవారం) ప్రతిరోజు రాత్రి8:30 గంటలకు ప్రసారం కానుంది.

Show comments