NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు:
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదని, బాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు.

ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి కాదు:
దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందని, వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును తాము మౌనంగా భరిస్తున్నాం అని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని కానీ.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, అక్రమ వసూళ్లు చేయడానికి కాదని సజ్జల విమర్శించారు.

రైతులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదు:
కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27 నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గం వారీగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చెయ్యాలని కార్యకర్తలను కోరారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉందని, రైతులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.

అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి:
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంబేద్కర్ మీద కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే భారత దేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్వాతంత్య్ర భారత దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు.

సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్‌:
సంధ్యా థియేటర్‌ తొక్కిస లాట ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్‌ స్టేట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేసి ఇవాళ రెండోసారి ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ విచారణ గంటన్నర పాటుగా కొనసాగుతుంది. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ తోపాటు… ఎస్సై లతో కలిపి విచారణ కొనసాగుతుంది. ఈనేపథ్యంలో అడ్వకేట్ వర్మ మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే నోటీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నోటీలసు ఇచ్చిన తరువాత దీనికి సంబంధించిన స్టేట్‌ మెంట్‌ ఉంటుందని తెలిపారు. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరాలు సేకరిస్తారని తెలిపారు. పోలీసులకు అల్లు అర్జున్‌ తెలిపిన వివరాలు తరువాత కూడా.. ఆశించనంతగా సమాధానం రాకపోతే సంధ్య థియేటర్‌ వద్దకు వెళ్లి పోలీసులు సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారని అన్నారు. సంధ్యా థియేటర్‌ వద్ద అసలు జరిగింది ఏమిటి ? అని పోలీసులు సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేస్తారన్నారు.

బన్నీపై ప్రశ్నల వర్షం:
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం విచారణకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్టేషన్ కు వెళ్లారు. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృతంలో అల్లు అర్జున్‌ విచారణ కొనసాగుతుంది. డీసీపీ సెంట్రల్ జోన్ నేతృతంలోని బృందం అల్లు అర్జున్ విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిపి విచారణ చేపట్టారు. సుమారు 50 పైగా ప్రశ్నల్ని అధికారులు అల్లు అర్జున్ ముందు ఉంచారు. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 9:30 గంటల నుంచి బయటికి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై అల్లు అర్జున్‌ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని ప్రశ్నిస్తున్న అధికారులు. తొక్కిసలాట సంఘటనలో చనిపోయిన విషయం తెలుసా? లేదా? అని అల్లు అర్జున్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందని అల్లు అర్జున్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు:
బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్ మాట్లాడినట్లు పేర్కొనింది. మానవ హక్కులను రక్షించడంలో ఇద్దరు నేతలు తమ నిబ్ధతను తెలియజేశారు. కష్టకాలంలో బంగ్లాకు నాయకత్వం వహిస్తున్న యూనస్‌ను అగ్రరాజ్యం భద్రతా సలహాదారు అభినందించారు. బంగ్లాదేశ్‌ సంపన్నమైన, స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి అమెరికా మద్దుతుగా ఉంటామని సలివన్ హామీ ఇచ్చారు.

కుర్‌కురే ప్యాకెట్‌ కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ:
కేవలం 20 రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌ కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ దాడుల్లో 10 మందికి పైగా గాయపడగా, పలువురు పరారీలో ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో నెలకొంది. వివరాల్లోకి వెళితే.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణం షాపులో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు ఓ కుర్‌కురే ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే, గడువు మీరిన కుర్‌కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి కిరాణం షాప్ యజమాని అతీపుల్లాను ప్రశ్నించారు.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను చంపింది మేమే:
హమాస్ అధినేత ఇస్మాయిల్‌ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్‌ తాజాగా ధ్రువీకరించింది. టెల్‌అవీవ్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ఈ విషయాన్ని తెలిపారు. అయితే, ఇటీవల కాలంలో హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులతో దాడి చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన మెస్సేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం.. హమాస్‌, హెజ్‌బొల్లాలను ఓడించాం.. ఇరాన్‌ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశామని చెప్పుకొచ్చారు. సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ను అధికారానికి దూరం చేశాం.. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియే, యహ్వా సిన్వర్, నస్రల్లాలను చంపేశామన్నారు. యెమెన్‌లోని హౌతీలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్‌ హెచ్చరించారు.

ప్రభాస్‌ను ఫాలో అవుతోన్న సూర్య:
ఆడియన్స్ విపరీతంగా బజ్ వచ్చేస్తుందనుకున్న కంగువా స్ట్రాటజీ వర్క్ కాకపోవడంతో సూర్య ప్లాన్ మార్చాడు. తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను ఫాలో అవుతున్నాడు. అదేంటంటే ఇక ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని, వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టాయాలని పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ కోసం ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ లో ఇన్నర్ టాక్. అందుకే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను షురూ చేస్తున్నాడు. అందుకోసం క్రేజీ డైరెక్టర్లతో సినిమాలను వర్కౌట్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 సెట్స్ పై ఉండగానే ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో సూర్య 45ని పట్టాలెక్కించాడు. రీసెంట్లీ సెట్స్ పైకి వెళ్లింది ఈ ప్రాజెక్ట్. నెక్ట్స్ ఇయర్ ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నాడు. ఇవే కాదు మలయాళ డైరెక్టర్ అమల్ నీరద్, ఇటు వెంకీ అట్లూరీ చెప్పిన స్టోరీస్ విన్నట్లు సమాచారం.

సంక్రాంతి హీరోలు ప్రోమో సూపర్బ్:
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ లో నవ్వులు పువ్వులు పూయించారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీ అన్ స్టాపబుల్ సెట్స్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి హాజరయ్యాడు.