NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నారా లోకేష్ వంద శాతం అర్హులు:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే డిమాండ్‌ను వినిపించారు. ప్రస్తుతం సోమిరెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి:
ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడని నోవాటెల్‌ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు.‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలకు అమిత్‌ షా అభినందనలు తెలిపారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల పైన కూడా బీజేపీ సమావేశంలో చర్చ జరిగింది.

మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు:
ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ దేవాలయాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారి జాతర దగ్గర మెట్లు, ఇతర మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.. పేద ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా ప్రభుత్వంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆయన తెలిపారు. గూడులేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు నీడనిచ్చేలా కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ఆత్మీయ భరోసాకి ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం:
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త పథకాన్ని స్వాగతిస్తున్నాం.. ఉపాధి హామీ కూలీలను ప్రామాణికంగా తీసుకోవడం ఒకే.. కానీ, వ్యవసాయ కూలీలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. ఆత్మీయ భరోసాకు ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. ప్రభుత్వ ఆంక్షలతో 10 శాతం మందికి మాత్రమే భరోసా.. 90 శాతం పథకానికి దూరం అవుతారు అని పేర్కొన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లు అందరు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా అమలు చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.

మోదీ ‘మన్ కీ బాత్’ ముఖ్యమైన అంశాలు:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్. ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నెలలో చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. కానీ ఈసారి చివరి ఆదివారం జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. కాబట్టి ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు.

మను భాకర్ ఇంట విషాదం:
భారత స్టార్ షూటర్ మను భాకర్ గృహంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న మను భాకర్‌కి ఈ విషాద సంఘటన బాధ కలిగించింది. రెండు రోజుల క్రితం ఆమె మామ, అమ్మమ్మ మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు మను భాకర్ మామ యుధ్వీర్ సింగ్, అమ్మమలు మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న సమయంలో.. ఒక బ్రెజ్జా కారు రోడ్డుపై స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చర్కీ దాద్రీలో ఈ సంఘటన జరిగిన వెంటనే యాక్సిడెంట్ కు కారకుడైన వాహనం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించి నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు.

మారిన ట్రంప్ ప్రమాణ స్వీకార షెడ్యూల్:
అమెరికాలో చాలా చలిగా ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మార్చారు. వాతావరణ శాస్త్రవేత్తలు శీతాకాలపు చలిని అంచనా వేసినందున జనవరి 20న జరగాల్సిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడింది. ఇది కాపిటల్ రోటుండా లోపల జరుగుతుంది. ఈ ప్రదేశం పూర్తిగా మూసివేయబడింది, ఇక్కడ చల్లని గాలుల వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఇక్కడికి వచ్చే ప్రజలు అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. రాబోయే రోజుల్లో ఇక్కడ మంచు కురుస్తుంది. చలిగాలులు వీచే అవకాశం ఉంది. దీనిలో ఉత్తర మైదానాలలో ఎముకలు కొరికేంత గాలులు వీచే అవకాశం ఉందని..గల్ఫ్ తీర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ మంచు కురుస్తుందని అంచనా వేయబడింది.

టిక్‌టాక్‌ సేవలు బంద్‌:
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ విషయాన్ని సందేశాల ద్వారా తెలియజేస్తోంది. జనవరి 19 నుండి టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుండటంతో, మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘జనవరి 19 నుంచి అమెరికాలో టిక్‌టాక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని టిక్‌టాక్ యూజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. 2017లో ప్రారంభమైన ఈ షార్ట్ వీడియో యాప్‌పై ఇప్పటివరకు అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇందులో భారతదేశం సహా పలు దేశాలు టిక్‌టాక్‌పై ఆంక్షలు అమలు చేశాయి. ఈ మధ్య కాలంలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా టిక్‌టాక్ వినియోగంపై ఆంక్షలు విధించాయి.

జోరుమీదున్న వెంకీ మామ:
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ ఆయన మొదటి రోజు నుంచే భారీ హిట్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే వసూలను రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాల నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలయ్యి ఐదు రోజుల కలెక్షన్లకు సంబంధించి చిత్ర బృందం వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఐదు రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా మూవీ యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సౌత్ దర్శకుడు షాహిద్ కు హిట్టు ఇస్తాడా:
కబీర్ సింగ్ ఇచ్చిన ఐడెంటీటీతో వెంటనే మరో టాలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు షాహీద్ కపూర్. జెర్సీ బెడిసి కొట్టడంతో కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి సౌతిండియన్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపాడు. ఈ సారి మాలీవుడ్ డైరెక్టర్ ఆండ్రూస్‌కు దేవా సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో షాహీద్ రూత్ లెస్ పోలీసాఫీర్ పాత్రలో కనిపించాడు. జనవరి 31న థియేటర్లలోకి వస్తున్న దేవాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. పావేల్ గులాటి హీరోయిన్. బిగ్ బి అమితాబచ్చన్ క్లాసిక్ మూవీ దేవాకు ఇన్సిపిరేషన్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రిలీజైన ట్రైలర్‌లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఫక్తు కమర్షియల్ బొమ్మగా కనిపించబోతుంది. రూ. 85 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాతో షాహీద్‌కు రోషన్ అండ్రూస్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడా కబీర్ సింగ్ రికార్డులు తిరగరాయిస్తాడా అనేది చూడాలి.