NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్‌:
శ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు మాఫీ కోసం పోలీసులు వాటాలు పంచుకున్నారు. వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్‌లో ఆకుల మారుతి రావుకు గేదెల ఫామ్ ఉంది. ఇటీవల ఫామ్‌లో రెండు గేదెలను ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. ఈ విషయం గురించి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో మారుతి రావు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించిన ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు మాఫీకి 12 లక్షల రూపాయలకు దొంగలతో పోలీసులు డీల్ కుదుర్చుకున్నారు. గేదెలు పోగొట్టుకున్న బాధితుడు మారుతి రావుకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి.. మిగతా సొమ్మును పోలీసులు జేబుల్లో వేసుకున్నారు. దొంగల నుంచి పోలీసులు డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం:
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, హీరో నారా రోహిత్ సహా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.

ఒట్టేసి చెబుతున్నా:
ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాం నగర్ లో గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇండ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు. కోటిమంది డ్రైనేజీ నీళ్లు.. మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయాలన్నారు. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ? అని ప్రశ్నించారు. మూసీ DPR ఎప్పుడు పూర్తి అవుతుంది? కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? అని మండిపడ్డారు. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు ? రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యిందన్నారు. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుందన్నారు.

మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ:
మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుందని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. ఉదయం కార్యకర్తలతో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు. కాదని పేదలతో చెలగాటం ఆడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు.

కేజ్రీవాల్‌కు భారీ షాక్:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తన రాజీనామాలో… యమునాను శుభ్రపరచడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు.

మోడీపై ఖర్గే ఫైర్:
తాజాగా మణిపూర్‌లో చెలరేగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్‌ భద్రంగా లేదని ఆయన అన్నారు. మే 2023 నుంచి పెరుగుతున్న హింస మణిపూర్ ప్రజల భవిష్యత్తును పాడు చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జుగుప్సాకరమైన విభజన రాజకీయాలు చేస్తున్నందోని విమర్శించారు. మణిపూర్‌లో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొడుతోందని కాల్చివేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు:
బోర్డర్-గవాస్కర్ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో జట్టుకు కెప్టెన్ అవసరం ఉంటుందని, రోహిత్ శర్మ త్వరగా ఆస్ట్రేలియా వెళ్లి తొలి టెస్టు ఆడితే బాగుంటుందని సౌరవ్ గంగూలీ అన్నారు. రెవ్‌ స్పోర్ట్స్‌తో దాదా మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ సతీమణి రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చారు. హిట్‌మ్యాన్ పెర్త్‌ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలొస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ లాంటి పెద్ద సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా కెప్టెన్‌ వదిలేయకూడదు. టెస్ట్ సిరీస్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. రోహిత్ ఆస్ట్రేలియాకు త్వరగా వెళ్లాలి. అతడు పెర్త్ టెస్టు ఆడితే బాగుంటుంది. ఒకవేళ నేను రోహిత్ స్థానంలో ఉంటే.. కచ్చితంగా ఆసీస్ వెళ్లి ఆడేవాడిని. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ప్రారంభానికి మంచి నాయకత్వం అవసరం. గతంలోరోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ తీసుకోవాలని చాలాసార్లు మాట్లాడి ఒప్పించా. టెస్టులకు కెప్టెన్సీ చేయకుండా కెరీర్‌ ముగించవద్దని చెప్పా’ అని తెలిపారు.

‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్‌పై క్లారిటీ:
హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్‌పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది అధికారికంగా ధృవీకరించబడింది. అతిథులకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్‌ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జ్యోతిక వార్నింగ్ పోస్ట్:
‘నేను ఈ నోట్‌ని సూర్య భార్యగా కాకుండా జ్యోతికగా సినీ ప్రేమికురాలిగా మాత్రేమే రాస్తున్నాను. కంగువ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహస వంతమైన సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు అందుకు నేను అంగీకరిస్తాను, BGM కూడా చాలా లౌడ్‌గా, ఇరిటేటింగ్ గా అనిపించింది. మన ఇండియాన్ సినిమాలలో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇంతటి భారీ సినిమాల్లో చిన్న చిన్న పొరపాట్లు చాలా కామన్. మరోసారి చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు. కానీ కొందరు మీడియా వారు , పలువురు సినీ ప్రముఖుల కంగువపై నెగిటివ్ రివ్యూస్ రాయడం చూసి ఆశ్చర్యం కలిగింది’ అని జ్యోతిక పోస్ట్ చేశారు.