ఆయుష్మాన్ భారత్‌పై కేజ్రీవాల్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యా్న్ని అందించనున్నారు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వృద్ధులు క్షమించాలని కోరారు. రాజకీయ కారణాల చేత ఈ రెండు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఢిల్లీ హెల్త్‌కేర్ మోడల్ గొప్పదని తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ పథకంలో అనేక స్కామ్‌లు ఉన్నాయని చెప్పారు. ఇక డిల్లీ ప్రభుత్వం అందిస్తున్న హెల్త్ స్కీమ్‌లో ప్రతి చికిత్స ఉచితమని తెలిపారు. ఆప్ ప్రభుత్వం అందించే స్కీమ్ రూ. 5 లక్షలకే పరిమితం కాదన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో మోడీ తప్పుగా మాట్లాడడం సరికాదుని.. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్లక్ష్యం చేసింది..
విజయవాడలో మెప్మా స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పై శిక్షణ కార్యక్రమం. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ, మెప్మా ఎండీ తేజ్ భరత్, అన్ని జిల్లాల పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్వాక్రా, మెప్మా సభ్యులకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పుకొచ్చారు. వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అని పేర్కొన్నారు. SHG సభ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా చేరువ కావాలంటే డేటా ప్రొఫైలింగ్ ఎంతో అవసరం.. సభ్యుల డేటా ఆధారంగా ఎవరెవరికి ఎలాంటి పథకాలు, చేయూత అందించాలనే దానిపై స్పష్టత వస్తుంది అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
గ్రూప్ -3 అభ్యర్థులకు అలర్ట్.. వచ్చే నెలలో హాల్‌టికెట్లు
తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వచ్చే నెల 10 నుండి గ్రూప్ 3 హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, TSPSC గ్రూప్-3 మోడల్ ఆన్సర్ బుక్‌లెట్‌లు అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే, TSPSC గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదలైంది. తరువాత అదనంగా 13 పోస్టులు చేరడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది.
ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలకీ ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైంది..
ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలందరికీ ఈ దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైనది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి, అరాచక పాలనతో ఏర్పడిన చీకట్లను తొలగించి నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వెలుగులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.. గ్రామాల్లో తిరిగి ప్రారంభమైన అభివృద్ధి పనులతో.. రాష్ట్రానికి వస్తున్న నూతన ప్రాజెక్టులు, సమగ్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో నిజమైన దీపావళి పండుగ వాతావరణం ఏర్పడింది అని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేద వాడి ఇంటా పండుగ జరగాలనే తలంపుతో ఈ దీపావళి పండుగ కానుకగా దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.. ఇక, దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శుభం కలుగచేయాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రభుత్వ వైద్య కళాశాలకు యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టండి
ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సబ్బారావు స్వస్థలం భీమవరం.. చదువుకున్నది రాజమహేంద్రవరం కావున – కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని ఆయన కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు రాశారు.
పాడి కౌశిక్ రెడ్డిపై బల్మూరి వెంకట్ ఫైర్
బీఆర్‌ఎస్ కి చెందిన ఓ ఆంబోతు ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ ఎమ్మె్ల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. కొకైన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరు.? పార్టీలో ఏం జరిగింది అనేది పక్కదారి పట్టిస్తున్నారని, 10 యేళ్ల నుండి కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడుతుంటారు కాబట్టి.. ఆయనకు కూడా అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. విజయ్ మద్దూరు చానా దగ్గర వ్యక్తులు అని కేటీఆర్ అంటున్నాడని, నీ సన్నిహితులు కొకైన్ తీసుకుంటే దాని మీద మాట్లాడకుండా.. దారి తప్పిస్తున్నాడంటూ బల్మూరి వెంకట్ ఆరోపించారు. పాడి కౌశిక్ ది..నా స్థాయి కూడా కాదని, నా మీద 88 కేసులు ఉన్నాయి.. దొరలపై కొట్లాడితే కేసులు పెట్టారన్నారు, పాడి కౌశిక్ చరిత్ర ఏముంది..? ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడిగా పరిచయం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మోసం చేసి.. బీఆర్‌ఎస్‌లో చేరావని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచం మొత్తం పోలవరం వైపు చూస్తోంది..
మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం.. 45.72 మీటర్లకు నీరు నిలపగలిగితేనే నదుల అనుసంధానం కుదురుతుంది.. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాసినపుడు వ్యతిరేకించామన్నారు. 41.15కు తగ్గిస్తే ప్రాజెక్టు కాస్తా బ్యారేజీగా మారిపోతుందని మేం అన్నాము.. 2014 – 2019 మధ్యలో మేం ఎప్పుడూ ఎత్తు తగ్గించాలని అడగలేదు.. 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందింది పోలవరం ప్రాజెక్టు.. ప్రభుత్వం మారడంతోటే పోలవరానికి గ్రహణం, గండం పట్టాయి.. స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఆదిత్యదాస్ రాసిన లెటర్ లో చాలా క్లియర్ గా ఫేజ్ 1, ఫేజ్ 2ల గురించి చెప్పారని మత్రి నిమ్మల వెల్లడించారు.
బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం
బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాల పరిస్థితిని తెలుసుకున్నారు. ముందుగా అధికారులు ప్రభుత్వం సహాయంపై సీఎంకి వివరించారు. మొత్తం 4,21,698 మందికి రూ.625 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కేవలం 70 మందికి మాత్రమే ఇంకా పరిహారం అందలేదని.. అది కూడా వారి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వల్లనే సమస్య వచ్చిందన్నారు.
బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు ధాటికి ఇద్దరు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపావళి పండగ వేళ నిడదవోలు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలి దగ్గరకు అధికార యంత్రాంగాన్ని పంపించిన మంత్రి.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.
అయోధ్యలో 25 లక్షలకు పైగా దీపాల అద్భుత దృశ్యం.. రెండు గిన్నిస్ రికార్డులు
అయోధ్య దీపోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. 1121 మంది అర్చకులు కలిసి సరయు మహా హారతి చేశారు. దీంతో 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించారు. రాంలాలా సన్నిధిలో జరిగే తొలి దీపోత్సవంలో ఈసారి యోగి ప్రభుత్వం అద్వితీయమైన చొరవ తీసుకుంది. తొలిసారిగా 1121 మంది వేదాచార్యులు కలిసి సరయూ మయ హారతి నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం సాయంత్రం అవిరల్ సరయూ తీరే బనే ఘాట్‌లో అమ్మవారి హారతి నిర్వహించారు. 1121 వేదాచార్య, అదే రంగు దుస్తులు ధరించి.. ఏక స్వరంతో సరయు మైయ యొక్క హారతి చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ అపూర్వమైన సంఘటన ప్రజల మనస్సులో యోగి ప్రభుత్వం ప్రతిష్ఠతను మరింత పెంచుతుంది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ప్రకటించింది.