గుడ్ న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్స్ విడుదలకు డేట్ ఫిక్స్
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ కార్యదర్శి జైషా ఢిల్లీలో.. మ్యాచ్‌లు జరుగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో గురువారం మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయంపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్ టికెట్లు తీసుకెళ్లాలని.. ఆన్‌లైన్ టికెట్లకు పర్మిషన్ లేదని పేర్కొన్నారు.
బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ”బేబీ” జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిసూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి అందమైన సినిమా నిర్మించిన సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తూ ఈ సినిమా అనునిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయినా ఈ సినిమా కూడా ఇంకా కొన్ని థియేటర్స్ లో రన్ కొనసాగిస్తూనే ఉందంటే ఎంతలా సినిమాను ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రశంసలు కురిపించగా అల్లు అర్జున్ అయితే ఒక అప్రిసియేషన్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా బేబీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి బేబీ సినిమాను చూసి నన్ను, నిర్మాత ఎస్కేఎన్ ను అభినందించారు. ఈ హ్యాపీ మూమెంట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాని అన్నారు.అయన మాట్లాడుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెబుతూ ఒక ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా మారిందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏటపాక, చింతూరు, వర రామచంద్రపురం, కూనవరం మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనమయ్యాయని ఆయన తెలిపారు. ఆయా మండలాల ప్రజలు ప్రతి ఏటా గోదావరి వరద బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సీపీఐ రామకృష్ణ అన్నారు.
గోదావరి పెరిగింది.. జాతీయ రహదారి స్తంభించింది
గోదావరి పరివాహక ప్రాంతం వరదలతో ఆందోళనకరంగా తయారైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తుంది. అయితే ఇది మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం వున్న గోదావరి 58 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అంచనా వేస్తున్నామని అయితే 60 అడుగులు దాటి లో వచ్చినప్పటికీ ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని , ప్రజలకు భరోసా గా ఉన్నామని అంటున్నారు భద్రాచలం ఏఎస్పీ పరితోష్. గోదావరి వరద ఉద్రతి పెరగడంతో గోదావరి ఎగువ భాగంలో జాతీయ రహదారి స్తంభించిపోయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు సమీపంలో ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలో హైదరాబాదు, వరంగల్ నుంచి చత్తీస్ గడ్, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ,ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారిపై నీళ్లు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చిన లారీలు అన్నీ కూడా రోడ్లమీద చిక్కుకొని పోయాయి భద్రాచలం నుంచి చెట్టు వరకు మధ్య మధ్యలో లారీలన్నీ నిలిచిపోవడంతో గోదావరి ఇంకా పెరుగుదల కనిపిస్తుండతో ఆ లారీలు అన్నిటిని కూడా తిరిగి భద్రాచలం వైపు మళ్ళిస్తున్నారు.
స్టీవ్ స్మిత్ రనౌట్ పై వివాదం.. ఏంటి సర్ అది నాటౌట్ హా..
యాషెస్ సిరీస్‌లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టులో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా దొరుకుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 54.4 ఓవర్లలో 283 పరుగులకి ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేయగా బెన్ డక్లెట్ 41, క్రిస్ వోక్స్ 36, మొయిన్ ఆలీ 34, మార్క్ వుడ్ 28 పరుగులు చేయగా.. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా జోష్ హజల్‌వుడ్, టాడ్ ముర్ఫీలు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 103.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 295 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ 24 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 47 రన్స్ చేశాడు.
అయితే, ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆసీస్ టీమ్ ఆధిక్యంలో ఉండగా.. ఈ టెస్టును డ్రా చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మార్నస్ లబుషేన్ తన జిడ్డు బ్యాటింగ్ తో ఇంగ్లీష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 82 బంతులు ఆడిన లబుషేన్ కేవలం 9 రన్స్ మాత్రమే చేసి.. తన బ్యాటింగ్ స్ట్రైయిక్ రేటు 10.98 మాత్రమే ఉంది. ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ 16, అలెక్స్ క్యారీ 10, మిచెల్ స్టార్క్ 7 రన్స్ చేశారు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ 36, టాడ్ ముర్ఫీ 34 పరుగులు చేయగా జోష్ హజల్‌వుడ్ 6రన్స్ చేశాడు.
కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
2020లో ప్రపంచాన్నే దడదడలాడించిన కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మేలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీ నుండి కరోనా వైరస్‌ను తొలగించింది. అప్పటినుంచి కోవిడ్ ముగిసిందని ప్రపంచం మొత్తం అనుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు వైరస్‌కు సంబంధించిన కొత్త సమాచారం తెలుస్తోంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక వ్యక్తి నుండి వేరియంట్ ను కనుగొన్నారు. దానిని డెల్టా యొక్క 113 రెట్లు ఉత్పరివర్తన రూపాంతరంగా కనుగొన్నారు. ఇది ఓమిక్రాన్ కంటే డేంజర్ అని.. అంటువ్యాధి అని అంటున్నారు. ఈ వైరస్ కు ఇంకా పేరు పెట్టలేదు. ఆ వైరస్ ఎంత ఎక్కువ మ్యూటెంట్ చెందితే.. అదే స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఉత్పరివర్తన వల్ల కలిగే ప్రమాదం గురించి వైద్య ప్రపంచంలో అంత స్పష్టత లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం. నక్సలైట్లు గాయపడిన లేదా మరణించిన వారిని వెంటనే అడవుల్లోకి లాగగలిగారని అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చింతగుఫా, కిస్టారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోటలో ఉన్న ఛోటేకెడ్వాల్ గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మోరంచపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగడంతో ఆ ఊరు మొత్తం వరదలో మునిగిపోయింది. వరద గుప్పిట్లో భయంతో బతికిన మోరంచ పల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. బురదమయమైనటువంటి ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్నారు. వండుకునే స్థితి లేకపోవడంతో బంధువులు తీసుకొచ్చిన భోజనం తినడము లేక అధికారులు ఏర్పాటు చేసిన భోజనం తినే స్థితిలోనే ఇంకా మొరంచపల్లి ఉంది. నలుగురు గల్లంతయితే ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు. ఆలీపోర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. 79 ఏళ్ల భట్టాచార్య గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఊపిరి ఆడాలంటే నెబ్యులైజర్ సపోర్టు తప్పని సరి, అయితే గత కొన్ని రోజులుగా నెబ్యులైజర్ ఉపయోగించినా ఊపిరి ఆడటం చాలా కష్టంగా మారినట్లు సమాచారం. ‘
బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యాయ్ ప్రమాణ స్వీకారం
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ జస్టిస్ ఉపాధ్యాయ్‌తో ప్రమాణం చేయించారు. దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ)గా పదోన్నతి పొందక ముందు అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు.
మే 30న సీజే ఆర్డీ ధనుక పదవీ విరమణ చేయడంతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. ఆ తర్వాత జస్టిస్ నితిన్ జామ్దార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం సీజేగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ నియామకమయ్యారు. జూన్ 16, 1965లో జన్మించిన దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ 1991లో లక్నో విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టి రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. బౌలర్ అమీర్ జజాయ్ వేసిన ప్రతి బంతిని సిక్సర్ కొట్టాడు. కాబూల్ ప్రీమియర్ లీగ్ లో షాహీన్ హంటర్స్ మరియు అబాసిన్ డిఫెండర్స్ జట్టు పోటీపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన షాహీన్ హంటర్స్.. కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అటల్.. చివరి వరకు క్రీజులో ఉండి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే 19వ ఓవర్‌లో దుమారం రేపాడు.
జజాయ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి అటల్ సిక్సర్ కొట్టాడు. తర్వాతి బంతిని వైడ్ వేశాడు జజాయ్. ఆ తర్వాత.. 6 బంతులను ఎదుర్కొని.. సిక్సర్ల మోత మోగించాడు. దీంతో జజాయ్ 19వ ఓవర్‌లో మొత్తం 48 పరుగులు చేశాడు. మరోవైపు ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాది భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సమం చేశాడు. గైక్వాడ్ గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 7 సిక్సర్లు కొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.
ముందు గత వరదలకు మీరు ప్రకటించిన 1000 కోట్లు ఇవ్వండి
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో.. ఖమ్మం జిల్లా బొక్కల గడ్డలో ముంపు వాసులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ముందు గత వరదలకు మీరు ప్రకటించిన 1000 కోట్లు ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. 35 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు మళ్లీ ఇపుడు వచ్చాయని, ఒక్క కుటుంబం, రైతు ఇబ్బంది పడకుండా కరకట్ట ఇస్తా అన్నారని, ముంపుకు గురికాకుండా మరోచోట ఇళ్ళు కట్టిస్తాం అన్నారని ఆయన గుర్తు చేశారు. 9 ఏళ్ళు పాలించిన వారిని ప్రశ్నిస్తున్నానని, మున్నేరు ఇవ్వాల్టిది కాదు కదా మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. 9 ఏళ్లలో చేయని అభివృద్ధి ఈ మూడు నెలల్లో చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లింది
వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారులు ఎమ్మెల్యేలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని, 154 ప్రాంతాలు నీటమునిగాయన్నారు. రెండు జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లిందని, గ్రేటర్ వరంగల్ పరిధిలో 177 కోట్లు నష్టం జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. విద్యుత్ కు కోటిన్నర నష్టం వాటిల్లిందని, 480 పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 43 కిమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, భద్రకాళి చెరువు కట్ట గండి పడగా వెంటనే పూడ్చివేశామన్నారు మంత్రి ఎర్రబెల్లి. భద్రకాళి బండ్ కు 150 కోట్లతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, వడ్డేపల్లి చెరువు కట్ట మరమ్మతులు చేయనున్నామన్నారు.
రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతంలో ముంపుబాధితులను కలుస్తారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రంగంపేట, భద్రకాళి చెరువు కట్టను తదితర ప్రాంతాలలో వరద నీటి బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కాశీబుగ్గ ప్రాంతంలోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు కొలంబో మెడికల్ కాలేజ్ ప్రాంతంలోని బి ఆర్ నగర్ వివిధ ప్రాంతాలలో వరద నీటిలో మునిగిన, నష్టపోయిన ప్రాంతాలను పర్యటిస్తారు. వివిధ ప్రాంతాలలో నష్టపోయిన వారిని పరామర్శించడం, వరద నష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులకు అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు.
