NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్ లు.. 70మందికి గాయాలు

రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇంకా ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) 6:12 గంటలకు ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి అత్యవసర సేవలను పంపినట్లు రష్యన్ రైల్వే టెలిగ్రామ్‌లో తెలిపింది. ప్రయాణికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్ కే అద్వానీ.. ఆందోళనలో అభిమానులు

దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతడిని ప్రైవేట్ వార్డులో చేర్చారు. ఎయిమ్స్ యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తనను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన క్షేమంగా ఉన్నారు. 96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అతని వయస్సు సంబంధిత సమస్యల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.ఇటీవల, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీని కలిశారు. ఈ సమావేశాల్లో అద్వానీ సోఫాలో కూర్చొని కనిపించారు.

ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్..

ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్‌ జరగగా, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో ఆనాటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే) ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా.. ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ఈ సంఘటనను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చాలా తీవ్రంగా పరిగణించింది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తదుపరి ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. దింతో అప్పటి మాచర్ల మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నమోదైన కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేయగా.. దానిని ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో తెలిపింది. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. జూన్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది జూన్ 27 , 28 తేదీలలో నగరంలో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురు గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రెండు రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. వాతావరణ ఔత్సాహికుడు T. బాలాజీ ప్రకారం, తన ఖచ్చితమైన అంచనాలకు ప్రసిద్ధి చెందాడు, జూన్ 26-29 చురుకైన వర్షాలకు అనుకూలంగా ఉంటుంది.

ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే… అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్​ విస్తరణ, నామినేటెడ్​ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్​ హైకమాండ్​తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్​విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్​ హైకమాండ్​తో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం ఆరు కేబినెట్ ​బెర్త్​లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టిపెట్టారు. హైకమాండ్​కు ​నలుగురి పేర్లతో సీఎం రేవంత్​లిస్టు ఇవ్వగా.. మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రపోజ్​ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురి పేర్లతో రావాలని హైకమాండ్​ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేడు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు.

‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే.. అస్సలు ఊహించని పేర్లు!

పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, లోకనాయకుడు కమల్‌హాసన్‌ కీలక పాత్రలు చేశారు. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని, సౌత్ సీనియర్ నటి శోభన, మలయాళ నటి అన్నా బెన్ ఉన్నట్లు సినిమా రిలీజ్ ముందే పోస్టర్స్ ద్వారా చెప్పేశారు. నేడు కల్కి రిలీజ్ కాగా.. ఎందరో స్టార్స్ సినిమాలో కనిపించారు.

కల్కి 2898 ఏడీ చిత్రంలో చాలా మంది నటులు గెస్ట్ రోల్స్ పోషించారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లాలు కల్కిలో ఉన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కిలో గెస్ట్ రోల్ చేసారు. జక్కన్న స్రీన్ మీద కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. కల్కి 2898 ఏడీలో తెలుగు హీరోలు రానా దగ్గుబాటి, నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది నిమిషాల్లో క్లారిటీ రానుంది. ఒక్కో స్టార్ రివీల్ అవుతున్న సమయంలో థియేటర్లో ఈలలు, కేకలు వేస్తూ ఫాన్స్ సందడి చేస్తున్నారు.


సీత రామ మోటార్ల ట్రైల్ రన్ సక్సెస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామల చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రైయిల్ రన్ గటగా రాత్రి సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది .సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17 వేల కోట్ల రూపాయలు అంచనా తో పది లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు కోసం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు .ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆటుపోటులను ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో ఏడు వేల కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం వ్యయం చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది .ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధం అయినప్పటికీ ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూర్ నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు.