NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు, బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది, తలైవా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మౌని రాయ్, మోహన్ లాల్ వంటి వారికి కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

శ్రీధర్‌రెడ్డి హత్య నిందితులను అరెస్ట్‌ చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ డీజీపీని బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. ఇటీవల వనపర్తి జిల్లా లక్ష్మిపల్లిలో హత్యకు గురైన శ్రీధర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డిలు డీజేపీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హత్య కు గురైన శ్రీధర్ రెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ కి ఫిర్యాదు చేసామన్నారు. హత్య జరిగి నాలుగు రోజులు అవుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు ఏ కేసులో ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాన నిందితుడు జూపల్లి కృష్ణా రావు ఇంట్లో ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాడని, ముఖ్యమంత్రి ఈ రాష్టానికి హోమ్ మంత్రి గా ఉన్నాడని, శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీ ని కోరామన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. వారం రోజుల్లో ఈ కేసు లో పై న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు బిడ్డ..

అమెరికాలోని ఫ్లోరిడాలోని బోకా రాటన్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యను ఫ్లోరిడాలో ఆదివారం నాడు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది, దీంతో.. ఆమె వెంటనే అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆమె కుటుంబ సభ్యులు ప్రకారం, సౌమ్య తన ఇరవై ఐదవ పుట్టినరోజును మే 11 న జరుపుకుంది. సౌమ్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం కోసం సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, ఆమె కుటుంబ సభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు.

పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన కోర్టు

తనపై నమోదైన కేసుల్లో ముందస్తు మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు EVM ధ్వంసం ఘటనలో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పల్నాడు పోలీసులు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే వరుస FIR లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. జూన్ 6 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులు అమలు చేయడం లేదన్నారు.

నాపై దాడి జరిగింది.. పులివర్తి నాని వీడియో ప్రజంటేషన్

చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు. దాడి నాపైనే జరిగింది.. నన్ను చంపాలని చూశారన్నారు. నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారని ఆరోపించారు. ఆ రోజు తన కోడలుపై దాడి చేయాలని చూశారన్నారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఉన్నది ఒక్క క్వారీ మాత్రమే అని.. దానికి 50 కోట్ల రూపాయల ఫైన్ వేయించి నన్ను ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. నీలాగా నేను ఎర్రచందనం వ్యాపారం చేయలేదని చెప్పారు. వ్యక్తిగతంగా నేను, మా కుటుంబం చెవిరెడ్డి ని దూషించలేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరని విమర్శించారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

రెమల్ తుఫాను ఎఫెక్ట్.. 14 విమానాలు రద్దు

పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.

మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?

దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు వచ్చే చేశారా..? అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఎవరైనా పీసీసీ పదవి అడగొచ్చు.. ఈ స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదని, జవహర్ లాల్ నెహ్రు 40 కోట్ల దేశ జనాభాకు తినడానికి తిండి లేని రోజులు.. ఒక్కపూట తిని.. ఇంకో పూట పస్థులు ఉండే పరిస్థితి.. 40 కోట్ల జనాభా కి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారన్నారు. నెహ్రు ప్రధాని అయినప్పుడు దేశంలో కరెంట్ లేదు.. ప్రాజెక్టు లు లేవని, నెహ్రు ప్రాజెక్టు లు కట్టే పని పెట్టుకున్నారన్నారు. మన దగ్గర శ్రీశైలం.. నాగార్జున సాగర్ కట్టారని, కరెంట్ ఉత్పత్తి కూడా మొదలుపెట్టారన్నారు. నెహ్రు దూరపు చూపు తో ప్రాజెక్టులు.. విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారని, Fci ఏర్పాటు చేసింది నెహ్రు.. ధాన్యం నిల్వలకు ఆయనే నాంది పలికారన్నారు.

అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సి.ఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, పరేడ్ గ్రౌండ్ లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనితో పాటు, శిక్షణ పొందుతున్న 5000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్ తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు.

భారీ వర్షాలతో చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సాయం

హఫీజ్‌పేటలో ఆస్‌బెస్టాస్‌ షీట్‌ పైకప్పు పడిపోవడంతో మూడేళ్ల బాలుడి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆదివారం రాత్రి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఆదివారం రాత్రి హఫీజ్‌పేటలో ఓ ఇంటి గోడ కూలి ఇటుకలు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై పడ్డాయి. ఆస్బెస్టాస్‌ షీట్‌ పైకప్పు చిన్నారి సమద్‌పై పడడంతో వెంటనే మృతి చెందాడు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా 13 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామారావు సోమవారం ఇంటిని సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు.