NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం

రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష పెద్ద నగదు కాకపోయినా.. కొంతైనా ఉపశమనం కలగాలని మా ప్రయత్నమన్నారు భట్టి విక్రమార్క. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేస్తున్నామని, ఐదు వేల కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం 3 వేల కోట్లు ఖర్చు చేస్తే..మేము ఐదు వేల కోట్లు పెడుతున్నామని, విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీ తో యువతకు ఉపాధి కల్పన కి కృషి చేస్తున్నామన్నారు.

ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా..

గత ప్రభుత్వంపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్ళ పాలనలో చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. రూ.13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసినా.. ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఒకొక్క హామీని నెరవేరుస్తామని చెప్పారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్లలో పేద వారికి అన్నం పెట్టడానికి కుడా ఇష్టం లేకుండా అన్న క్యాంటీన్లు తీసివేశారని వ్యాఖ్యానించారు. గతంలో కట్టిన భవనాల్లో సాంఘీక కార్యక్రమాలు చేపట్టారని.. రాష్ట్రంలో మరో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి అంచనా వేశామని పేర్కొన్నారు.

“సూపర్ స్టార్ రజనీకాంత్ వాస్తవాలు చెప్పారు”.. స్టాలిన్ పై అన్నామలై సంచలన విమర్శలు

తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలపై సూపర్ స్టార్ కుండబద్ధలు గొట్టారన్నారు. అసలేం జరిగిందంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిపై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్‌ మాట్లాడారు. కరుణానిధి మరణానంతరం స్టాలిన్ పార్టీని చాతుర్యంతో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు కొత్త విద్యార్థిని దారిలో పెట్టడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ సీనిర్ విద్యార్థులను(సీనియర్ నాయకులు) దారిలో పెట్టడం కష్టంగా మారుతుంది. ఆ పాత విద్యార్థులు మామూలు వారు కాదు కదా.. మంచి ఫలితాలు సాధించిన వారు. దురై మురుగన్ వంటి పెద్దలున్న ఈ పార్టీని స్టాలిన్‌ బాగా సమన్వయం చేస్తున్నారు. హ్యాట్సాప్ స్టాలిన్‌ గారు అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , అన్నామలై స్టాలిన్ పై విరుచుకుపడ్డారు.

ఇంకో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం

రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నామని, సివిల్స్ విద్యార్థులకు అతస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొందరికి లక్ష ఎక్కువ కావచ్చు అని, కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం మాది అని, చాలా కాలం సచివాలయం లేదని, సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేదన్నారు. అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించామని, ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని స‌త్కరించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా చిరంజీవి పుట్టిన రోజున ఓ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన విషయం విదితమే. ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈశ్వర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి, ఈశ్వరయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారికి కుటుంబానికి పట్టు బ‌ట్టలు పెట్టి స‌త్కరించటం విశేషం. ఈ సంద‌ర్భంగా ఈశ్వర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు.

సీజనల్ వ్యాధులపై హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన డేటా ప్రకారం. జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు 5372 కేసులు నమోదయ్యాయి. అయితే.. హై రిస్క్ డెంగ్యూ కేసులు హైద్రాబాద్ లో 1,852 నమోదు కాగా.. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ 110 డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చికెన్ గునియా 152 కేసులు నమోదు కాగా.. మలేరియా 191 కేసులు నమోదైనట్లు డేటా విడుదల చేశారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే లో ఒక కోటి 42 లక్షల 78వేల 723 ఇల్లు సందర్శించారు.. అందులో 2లక్షల 65వేల 324 జ్వరాలు అన్నట్టు గుర్తించారు..

రాష్ట్రం భవిష్యత్‌లో క్రీడా రంగంలో నంబర్ 1గా ఉండాలి..

ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 29న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్, లోగో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచన అని ఆయన తెలిపారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత అని, తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి తెలంగాణ లో ప్రజా పాలన లో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చివిధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని ఆయన తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ

రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ రేపటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 27న యాదాద్రి ఆలయం దర్శించుకోనున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు చేరుకుంటారు..ములుగు జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు. రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు., గవర్నర్ పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్ల చేశారు.

కొండచిలువతో యువకుల ఫీట్లు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ కొందరు అరుదైన ఫీట్లు సాధిస్తున్నారు. మరి కొందరు ఒళ్లు గగ్గురుపుడిచే విన్యాసాలు చేస్తున్నారు. తాము పెట్టే పోస్టులకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ కోసం అన్నింటికీ తెగిస్తున్నారు. అయితే ఈ కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలా మంది ఫేమస్ అవుతున్నారు. వారు చేసే చిన్న చిన్న పనులు, డ్యాన్స్, పాటలతో వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలో.. తాము కూడా ఫేమస్ అవ్వాలని యువత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను తెగ వాడేసుకుంటుంది. ఇందుకోసం ఎంతటి ప్రమాదాలు వచ్చినా పట్టించుకోవడం లేదు. లైకులు, కామెంట్ల కోసం దేనికీ వెనుకాడటం లేదు. ఇలాంటి వీడియోలో నెట్టింట్లో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.