Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఏపీలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచారు. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

దృష్టి మరల్చి బంగారు దుకాణాల్లో చోరీ

బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్(21) బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. బంగారం దుకాణంలోకి కస్టమర్ లాగా ప్రవేశించి పలు చైన్లను చూపించమని సేల్స్ పర్సన్ కు చెప్పి, వారు తమ పనిలో నిమగ్నం అయ్యి ఉండగా అదను చూసుకొని చైన్ చోరీ చేస్తాడు.

ఎన్నికల బరిలోకి హేమంత్ సోరెన్ సతీమణి.. ఎక్కడ్నుంచంటే..!

సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు తెర వెనుక రాజకీయాలు నడిపించిన ఆమె.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. జార్ఖండ్‌లో గాండే అసెంబ్లీ నియోజకర్గం ఖాళీ అయింది. ఈ అసెంబ్లీ స్థానానికి మే 20న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అధికార జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్‌ పేరును ఆ పార్టీ ప్రకటించింది. దీంతో ఆమె బైపోల్ ఎన్నిక ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.

గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. డిసెంబర్ 31, 2023 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. తాజాగా దీనికి బైపోల్ ఎలక్షన్ కోసం ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. జేఎంఎం నుంచి కల్పనా సోరెన్ బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి దిలీప్ కుమార్ వర్మ పోటీ చేస్తున్నారు. మే 20న ఇక్కడ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.

ఇందిరమ్మ పాల‌న‌లో వెలుగుల ప్రస్థానం

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబ‌ర్ 7న ప్ర‌మాణా స్వీకారం చేసి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క యాదాద్రి, భ‌ద్రాద్రి ప‌వ‌ర్ ప్లాంటు నిర్మాణాల‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు. గ‌త పాల‌కుల వైఫ‌ల్యాల వ‌ల్ల నిలిచిపోయిన ప‌నుల గురించి తెలుసుకొని యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఆప‌నులు పూర్తి చేయ‌డానికి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించారు. నేరుగా పవర్ ప్లాంట్ ను సందర్శించి అధికారుల‌తో సమీక్షించారు. గత మూడు నెలల కాలంలో పలలుమార్లు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షలు జ‌రిపి ప‌నుల్లో వేగం పెంచిన‌ ఫలితంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న పర్యావరణలు అనుమతులు మంజూరయ్యాయి. భ‌ట్టి విక్ర‌మార్క చొర‌వ‌తో సాధించిన అనుమ‌తుల వ‌ల్ల ఇందిర‌మ్మ పాల‌న‌లో వెలుగుల ప్ర‌స్థానం మొద‌లైంది.

“ఇందిరాగాంధీ మరణించినప్పుడు, రాజీవ్ గాంధీ..’’ వారసత్వపన్నుపై మోడీ తాజా ఆరోపణలు..

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకులు విమర్శల తీవ్రత పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన ‘‘ సంపద పునర్విభజన’’, శామ్ పిట్రోడా చేసిన ‘‘వారతస్వ పన్ను’’ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ఎన్నికల ర్యాలీల్లో ఈ ప్రస్తావననే ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా మరోసారి వారసత్వ పన్నుపై ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ మొరెనాలోని ఎన్నికల ర్యాలీలో ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1984లో మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ, మరణానంతరం ఆమె సందప ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు వారసత్వ పన్నును రద్దు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ ఆ పన్నుని తీసుకురావాలని భావిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ మతప్రాతిపదికన విభజనకు అంగీకరించి దేశాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి తమ డబ్బు వెళ్లకుండా రాజీవ్ గాంధీ వారసత్వ పన్నుని రద్దు చేశారని అన్నారు.

హాల్‌సేల్‌గా దేశాన్ని ముస్లింలకు అప్పగిస్తామంటోంది కాంగ్రెస్

నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో భారతీయులను అభద్రతకు గురి చేసేలా ఉందని, హాల్ సెల్ గా దేశాన్ని ముస్లిం లకు అప్పగిస్తాం అంటోంది కాంగ్రెస్ అని వెల్లడించారు. ముస్లిం ల రిజర్వేషన్లు తీసి ఎస్సి ఎస్టీలకు ఇస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. ముస్లిం లకు రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆరు గ్యారంటీ ల గురించి చెప్పమంటే… రేవంత్ రెడ్డి తేదీలు చెప్పుతూ వెళ్తున్నారన్నారు.

కెన్యాను ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి..

తాజాగా కెన్యా దేశాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకు 38 మంది మృతువాత పొందారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

నదులలో నీరంతా నివాస ప్రాంతంలోకి వస్తుందడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా నది ప్రవాహక ప్రాంతాలలో అనేక ఇల్లు నీట మునగడంతో లక్షలాదిమంది నిరాశ్రులాయరని అక్కడ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన గుండు సుధారాణి

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హస్తం కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులుగా ఆమె పార్టీ వీడనుందన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. పర్యటన సందర్భంగా కేటీఆర్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫొటో కనిపించలేదు. సభకు సైతం హాజరుకాలేదు. గత కొన్ని రోజుల ముందు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి మాట్లాడారు. ఇక ఈ పరిణామాలన్నీ ఆమె కాంగ్రెస్ బాట పడుతున్నారు అన్న అంశాన్ని బలపరిచాయి.

ప్రధాని మోడీకి ఖర్గే 2 పేజీల లేఖ.. దేనికోసమంటే..!

దేశంలో ఎండలు మండుతున్నట్లుగానే.. రాజకీయ నాయకుల మాటలు కూడా మండితున్నాయి. ప్రచారంలో నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. పోలింగ్ సమయాలు దగ్గర పడే కొద్దీ ప్రసంగాలు కూడా హీటెక్కుతున్నాయి. ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ గరంగరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ‘న్యాయ్ పాత్ర’ పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోను వ్యక్తిగతంగా వివరించడానికి సమయం కావాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మీ సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అర్థమవుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ న్యాయ్ పాత్ర పథకం.. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, అన్ని కులాలు, వర్గాలలో అట్టడుగున ఉన్న ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఖర్గే పేర్కొ్న్నారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడంటే.?

దేశంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులో ఉన్న మూడు బోగీలు బోల్తా పడ్డాయి. కొత్తవలస- భీరందుల్ నుంచి ఇనుప ఖనిజంలోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి వెళ్లాల్సి ఉంది. కొరాపుట్- అరకు మార్గంలో ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలు పాడువా వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version