NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

లేడీ అఘోరీపై కేసు..! వశీకరణంతో నా కూతుర్ని తీసుకెళ్లి..!

తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్‌ చల్‌ చేస్తోంది.. కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి… తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య.. మృతుడి చివరి ఫోన్ కాల్ లో ఏముందంటే?

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ క్రికెట్ బెట్టింగ్ లో రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన సోమేష్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి చివరి ఫోన్ కాల్ వెలుగులోకి వచ్చింది. సోమేష్ చివరి సంభాషణ ఆవేదన కలిగిస్తోంది.

జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువు పొడిగించిన కేంద్రం

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.

ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు.. అలాచేస్తే రెట్టింపు టోల్ చార్జీలు వసూలు

ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆ పిటిషన్ దాఖలైంది. అయితే, హైకోర్టు ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంలో పిటిషనర్ వాదన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే వాహనాలపై రెట్టింపు టోల్ విధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాదు, టోల్ ప్లాజాలలో పూర్తిగా ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించకపోవడం కూడా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు..

క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

గతంలో ఒక్కటే కాలేజీ ఉంటే.. ఇప్పుడు అవి 100కు పెరిగాయి

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 26 వేల మందిని మాత్రమే రిక్రూట్ చేసిందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. “అంతమందిని రిక్రూట్ చేశారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ పెరగడం ఏమిటి? గతంలో ఒక్కటే కాలేజీ ఉండేది. ఇప్పుడు 100కు పెరిగాయి. కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలు ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందలేదని” ఆయన అన్నారు.

మారని సైబర్ మోసగాళ్ల తీరు.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తూ..

సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.

సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లో కొంత మంది లింక్‌ను జత చేస్తూ, “ఇక్కడ క్లిక్ చేసి తక్షణమే బిల్లు చెల్లించండి” అంటూ చెప్పిన లింక్‌ను క్లిక్ చేయమంటున్నారు.

పరిశ్రమలో విషాదం.. స్టార్ డైరెక్టర్ కుమారుడు మృతి

తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశారన్న వార్త అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మనోజ్, తన స్వంత గుర్తింపును సృష్టించుకున్న నటుడు , పలు చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన అకాల మరణం సినీ లోకాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. మనోజ్ భారతీరాజా, దర్శకుడు భారతీరాజా కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తనదైన నటనా శైలి మరియు దర్శకత్వ ప్రతిభతో గుర్తింపు పొందారు. 1990లలో “తాజ్‌మహల్” చిత్రంతో నటుడిగా తొలి అడుగు వేసిన మనోజ్, ఆ తర్వాత “కిళిప్పీట్టు” వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. ఆయన చిత్రాలు సామాజిక అంశాలను స్పృశిస్తూ, భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌ నగరంలో సంచలనం రేపిన న్యాయవాది ఇజ్రాయిల్‌ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిగా వాచ్ మెన్ దస్తగిరిని అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చంపపేటలో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న కాంతారావు, దస్తగిరిలలో గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదానికి కారణం కాంతారావు భార్య కళ్యాణి. దస్తగిరి మరియు కళ్యాణి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే, ఈ వ్యవహారాన్ని అడ్వకేట్ ఇజ్రాయిల్ గమనించి కళ్యాణిని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తెలంగాణ పర్యాటక అభివృద్ధిపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖపై చర్చ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఈ ప్రభుత్వం దిశానిర్దేశంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.