NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చెట్టును ఢీకొన్న ఆర్డీసీ బస్సు.. 25 మందికి గాయాలు

మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్‌పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్‌పూర్ (షోలాపూర్ జిల్లా) నుంచి ముంబై వైపు బస్సు వెళ్తుండగా యావత్ గ్రామంలోని సహజ్‌పూర్ ఫాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ముగ్గురు నుంచి నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు యావత్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ప్రమాదం వెనుక కారణం తెలియాల్సి ఉంది.

కొట్టుకుపోయిన వంతెన.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్‌

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం అందెవెల్లి గ్రామం వద్ద ఆదివారం కురిసిన వర్షానికి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో దహెగాం, భీమిని, కాగజ్‌నగర్ మండలాల్లోని 40 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడింది. 2022లో మూడు మండలాల్లోని వాహనదారులు హరీష్‌ ప్రజల సౌకర్యార్థం కాలువకు అడ్డంగా కంకర హరీష్‌ హ్యూమ్ పైపులను ఉపయోగించి తాత్కాలిక వంతెన నిర్మించబడింది. పెద్దవాగు మీదుగా ఉన్న హైలెవల్ బ్రిడ్జిలో కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా పునరుద్ధరించడానికి దీనిని నిర్మించారు. అదే సంవత్సరం భారీ వర్షాల కారణంగా. అంతర్గత దహెగావ్ మండలంలో కనీసం 11 గ్రామాలు హరీష్‌ భీమిని హరీష్‌ కాగజ్‌నగర్ మండలాల్లోని 31 గ్రామాలు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రధాన స్రవంతి నుండి డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. వాటిలో కొన్ని, దహెగావ్ మండలంలోని గిరివెల్లి, కర్జి, మేథెం, రాంపూర్, మొట్లగూడ, లోహ, తేపర్‌గావ్, శంకరరావుపేట, రావులపల్లి గ్రామాలు, భీమిని మండలంలోని ఇటిక్యాల్, బోర్లకుంట, రాళ్లగూడ గ్రామాలు, కాగజ్‌నగర్ మండలాల్లోని బోడేపల్లి, జగన్నాథపూర్ గ్రామాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం

మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. అంతేకాకుండా.. అత్యాచారం వీడియో తీసినట్లు బాధితురాలు చెబుతోంది. నిందితుడు తనకు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అతని వేధింపుల వల్ల ఏడాదిన్నరలో మూడు ఇళ్లను మార్చింది. అయితే నిందితుడిపై ఆగడాలు తట్టుకోలేక హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. అత్యాచారం, దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ రాష్ట్రాలకు అత్యధిక వర్ష సూచన

రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి. వచ్చే ఐదు రోజులు అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీ, యానాం, తమిళనాడులో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?

తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.

ఇంతపెద్ద సంఘటన జరిగినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 200 మందికి పైగా ప్రజల పరిస్థితి విషమంగా ఉంది. 56 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నారు. ‘టాస్మాక్’ అని పేరుతో ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల నుంచి లైసెన్సులు పొందిన మద్యం దుకాణాల మందుతాగి వారు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది..’’ అని ఆమె అన్నారు.

ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

యూపీలోని ఆగ్రాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వేధింపులతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపధాను గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏసీపీ డా.సుకన్య శర్మ, బర్హాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రూప్‌ధానుకు చెందిన సంజయ్‌సింగ్‌ కొద్దిరోజుల క్రితం హత్రాస్‌లోని సదాబాద్‌కు చెందిన మైనర్‌ బాలికను కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ కేసులో అతడిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. జూన్ 9న పోలీసులు తన ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టారు. జూన్ 22లోగా బాలికను తీసుకురావాలని చెప్పారు. అయితే.. ఆ భయంతో ఈరోజు ఉదయం సంజయ్ పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

‘‘నా దు:ఖాన్ని మీరంతా చూసే ఉంటారు’’.. రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత తొలిసారిగా ఆ ప్రాంత ప్రజలకు లేఖ రాశారు. జూన్ 18న కేరళలోని ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన వయనాడ్‌కి రాజీనామా చేసి, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు మొగ్గు చూపారు. జూన్ 17న తాను చేసిన ప్రకటనను చూపుతూ రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ నేను మీడియా ముందు నిలబడి నా నిర్ణయం గురించి చెప్పినప్పుడు మీరు నా కళ్లలో దుఃఖాన్ని చూసి ఉంటారు’’ అని లేఖలో పేర్కొన్నారు. వయనాడ్ ప్రజలు తనకు అనంతమైన ప్రేమ, అప్యాయతను పంచారని, ఐదేళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిశానని, ఆ సమయంలో తాను మీకు అపరిచితుడని, అయినా మీరు నన్ను నమ్మి నాకు మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. మీరు నాకు ఆశ్రయం, నా ఇల్లు, నా కుటుంబం అని అన్నారు. నేను వేధింపులకు గురైనప్పు మీ ప్రేమ నన్ను రక్షించిందని చెప్పారు.

రేపు తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు (జూన్ 24న) విడుదల కానున్నాయి. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలన సైతం పూర్తవ్వడంతో సోమవారం మధ్యహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు.

రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!

ఈ మధ్య యువతకు రీల్స్ పచ్చి మరింత ముదిరింది. ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పాడుపడ్డ భవనం పైకి యువతీయువకులు ఎక్కారు. ఒకరు కెమెరా పట్టుకోగా.. మరొకరు భవనంపై నిటారుగా పడుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి స్టంట్ చేయడం ప్రారంభించింది. పై నుంచి మెల్లిగా కిందకి దిగింది. ఆ సమయంలో యువకుడు అమ్మాయి చేయి పట్టుకొని ఉన్నాడు. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి చేరి వారిని అరెస్ట్ చేశారు.