స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి స్పీకర్‌పై బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవి లత కంప్లైంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలువడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్పీకర్ పాల్గొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలువడానికి అన్ని అబద్దపు ప్రచారాలను చేస్తుందని ఆయన అన్నారు. గ్యారెంటీల ముసుగులో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఇచ్చిన ఏ గ్యారెంటీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని, బీఆర్ఎస్ తన పదేళ్ల హయాంలో ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు నరేంద్ర మోడీ మరోసారి గెలవాలని కోరుకుంటున్నారని, ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ స్పీకర్ ను కూడా వాడుకుంటుందన్నారు.
రాష్ట్రాన్ని బాగుచేయడానికే ఈ ఎన్నికలు
రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రాను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. మే 13కు ప్రజలు సిద్దంగా ఉండాలని.. రాష్ట్రాన్ని బాగుచేయడం కోసం ఈ ఎన్నికలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయన్నారు. పట్టాదారు పాసుపుస్తకం పై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ బీజేపి ఒక్కటే.. మోడీని చూస్తే రేవంత్ కి భయం
రేవంత్ రెడ్డి రెండు నాలుకల సిద్దాంతం బయట పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ది రెండు కళ్ళ సిద్దాంతం.. ఆయన లోపల బీజేపీ, బయట కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అప్పుడు బడే భాయ్ అన్నావు ఇప్పుడు మోడీ ని తిట్టారని, కాంగ్రెస్ బీజేపి ఒక్కటే. మోడి ని చూస్తే రేవంత్ కి భయమని, నీకే అభద్రతా భావం తో ఉన్నావని జోగు రామన్న ఫైర్ అయ్యారు. మీ ప్రభుత్వాన్ని మీ వాళ్ళే కూల్చు తారని, రైతు బంధు ను రైతు భరోసా అన్నావు.. ఎందుకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కారణం ఏంటి.. కళ్యాణ లక్ష్మీ తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఆనాడు ఆరు గ్యారంటీ లు అమలు చేస్తాం అన్నారు.. మరి ఇప్పుడు ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపొతే నష్ట పోతారు అని ఓటర్లను భయపెట్టారన్నారు. ఎన్నికల ఉల్లంఘన కాదా. దాని పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతి కి చిరునామా రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మీద జనం కు నమ్మకం సన్న గిల్లుతుంది అది నిన్నటి సభ తో రేవంత్ రెడ్డి కి తెలిసి పోయిందన్నారు. ఆదివాసీలు అంటే రేవంత్ కు అలుసా అని ఆయన మండిపడ్డారు. ఆదివాసి అభ్యర్థిని, ఆదివాసీలను అవమాన పరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ఏప్రిల్ 26న రాష్ట్రానికి వస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను తగిన విధంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి మంగళవారం అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆమె అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరిశీలించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసు, ప్రొటోకాల్ విభాగం సమన్వయంతో వైద్య సహాయం, అన్ని వేదికల వద్ద సరిపడా వైద్య సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను కోరారు.
రేవంత్‌రెడ్డి ఎన్నికల వాగ్దానాలు రాజకీయ స్టంట్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల వాగ్దానాలు రాజకీయ స్టంట్‌గా మారాయని, రైతులను ఆదుకోవాలని బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ‘‘ఆగస్టులోగా సీఎం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని రైతులు ఆశించకూడదు. అది జరగదు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ ప్రజల ఓట్లను పొందేందుకు మాత్రమేనని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశంలో మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు హైదరాబాద్‌లో మత ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు.
ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు..
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా.. మద్యం, డబ్బు, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై ఈసీ భారీ ఎత్తున కొరడా ఝులిపిస్తుంది. ఈ క్రమంలో.. ఈసీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కూటమి రాకకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
కూటమి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల జనాలు అనారోగ్య పాలౌతున్నారన్నారు. అమ్మ ఒడి నాల్గు ఏళ్ళుగా ఎవరికి వచ్చింది..? అని ప్రశ్నించారు. బటన్ నొక్కి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగునంపుతారన్నారు. చిలకలూరిపేట టీడీపీ నాయకుల తోలు తీస్తానని వైసీపీ అభ్యర్థి అంటున్నారని.. చిలకలూరిపేటలో ఎటు చూసిన తన బ్రాండే కనిపిస్తుందన్నారు. ఐదేళ్ళలో మంత్రి రజని చేసిన దోపిడీపై సమాధానం చెప్పాలని అడిగారు. వారు ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా తాను స్పందించనన్నారు. తన గెలుపును ప్రజలు ఎప్పుడో నిర్ణయించారన్నారు. మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజాగళం సభ ద్వారా తన సత్తా ప్రధాని, చంద్రబాబు గుర్తించారన్నారు. రాష్ట్రంలో టీడీపీ మెజార్టీ స్థానాలలో ఉందన్నారు. టాప్ టెన్ లో చిలకలూరిపేట ఉంటుందని చెప్పారు.
ఈ వారంలో అందరికీ రైతు బంధు అందబోతోంది
ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెమటోడ్చితే మూడు రంగుల జెండా అధికారులకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మాట్లాడుతూ.. అధికారాన్ని సుస్థిరం కోసం భారతదేశ మొత్తం భారత్ జోడయాత్ర రాహుల్ చేపట్టడం జరిగిందని, అందర్నీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతుతో బీఆర్ఎస్, మత బీజేపీని ఓడించామన్నారు. జరగబోయే ఎన్నికల్లో వారి మద్దతు డిప్యూటీ సీఎం మల్లు భట్టి కోరడం జరిగిందని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తుళ్లూరు బ్రహ్మయ్య, అయోధ్య పాయం వెంకటేశ్వర్లు ,సమిష్టిగా పని చేసి పార్టీని గెలిపించుకోవాలన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. శుభప్రదమైన ఆంజనేయ స్వామి జయంతి రోజున.. తాను తన మొదటి సెట్ నామినేషన్ వేయడం ఆ భగవంతుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి.. చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఇంఛార్జీలు భీం భరత్, కస్తూరి నరేందర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అలా చేయండి.. మమతా బెనర్జీ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తాం..
కేంద్రమంత్రి అమిత్ షా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా, మమతా బెనర్జీ వైఫల్యాలను ఎండగట్టారు. సీఏఏ చట్టం ప్రకారం హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన చెప్పారు. రాయ్‌గంజ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న కార్తీక్ పాల్‌కి మద్దతు ఇచ్చేందుకు ఆయన బెంగాల్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 019లో రాయ్‌గంజ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఉత్తర బెంగాల్ స్థానం నుంచి తృణమూల్ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణిని పోటీకి దింపింది.
