వీడు అస్సలు మనిషేనా? వీడియో తీస్తూ ఆనందం పొందుతున్న యజమాని..
పాము పేరు వినగానే చాలా మందికి భయం.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా ఓ గేదెను పాము వణికించింది. ఆ సమయంలో గేదెను కాపాడాల్సిన యజమాని ఆ పని మానేసి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదె ను చెట్టుకు కట్టేసి ఉంది. ఆ సమయంలో ఓ పాము వేగంగా గేదె వైపు వెళుతోంది. గేదె దగ్గరకు వెళ్లిన తర్వాత పాము బుసలు కొట్టింది.. పామును చూసి గేదె బెదిరిపోయింది. అయితే కట్టేసి ఉండడం వల్ల ఆ గేదె తప్పించుకోలేక పోయింది. ఆ గేదెను కాపాడాల్సిన యజమాని మాత్రం నాకెందుకే అని వీడియో చేస్తూ ఉండిపోయాడు. చివరకు ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధిలో ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అలాగే, 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవం.. 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని కూడా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
“పదే పదే భారత వ్యవహారాల్లో జోక్యం”.. 41 మంది కెనడా దౌత్యవేత్తల తొలగింపుపై జైశంకర్..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం చెలరేగింది. పలు సందర్భాల్లో కెనడా, భారత దేశాన్ని కావాలనే కవ్విస్తోంది. ఇటీవల కూడా భారత్ లో కెనడా ప్రజలు భద్రంగా లేరని చెబుతూ వారికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్ లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను కోరింది. ఒకవేళ గడువులోగా ఉపసంహరించుకోకపోతే వారికి అందించే డిప్లమాటిక్ రక్షణల్ని తీసేస్తామని చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడియన్ సిబ్బంది న్యూఢిల్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, కెనడియన్ దౌత్యపరమైన ఉనికిని తగ్గించడానికి, దౌత్యపరమైన సమానత్వం కోసమే 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కోరామని జైశంకర్ అన్నారు. కెనడియన్ సిబ్బంది మా వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకోవడం మాకు ఆందోళన కలిగిస్తోందని, అందుకే మేం ఇరు దేశాల దౌత్యవ్యవహారాల్లో సమానత్వం ప్రారంభించామని వెల్లడించారు. వియన్నా కన్వెన్షన్ నిబంధనలు దౌత్యపరమైన సమానత్వాన్ని అందించిందని స్పష్టం చేశారు. భారతదేశానికి కెనడియన్ రాజకీయాలలోని కొన్ని విభాగాలతో సమస్యలు ఉన్నాయని తెలిపారు.
సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు. తండ్రి మృతితో హరి ఇంట విషాదం నెలకొంది. ఇక గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని జిల్లాలోని వారి స్వగృహమైన కాచనవెల్లిలో అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకువెళుతున్నారు. విఏ గోపాలకృష్ణన్ కు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమిజ్ అనే చిత్రం ద్వారా హరి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తరువాత సామీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇదే సినిమాను తెలుగులో నందమూరి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ పేరుతో రీమేక్ చేశాడు.
బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు
బీజేపీ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 11 మంది మాజీ ఎమ్మేల్యేలు, ముగ్గురు మాజీ ఎంపీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు 3 ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. దసరా తరవాత రెండో జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 27 అమిత్ షా వస్తున్నారని, ఈ నెలాఖరున యోగి ఆదిత్య నాథ్ వస్తారని ఆయన తెలిపారు. దసరా తరవాత ప్రచారం ఉదృతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత ను బీజేపీ కి అనుకూలంగా మార్చుకుంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ లకి వ్యతిరేకంగా బీజేపీ నీ ఆశీర్వదించాలని ప్రజల్లో కి వెళ్తామన్నారు. ఇంటింటి కి వెళ్ళాలని ప్రతి ఓటర్ నీ కలవాలని డిసైడ్ చేసామన్నారు. అన్ని నియోజక వర్గాల్లో బీజేపీ సభలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పాలక పార్టీ బెదిరింపులకు భయపడవద్దు… నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసింది… ఆయనను హృదయ పూర్వకంగా స్వాగతం తెలిపారు. మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవడం పార్టీ అంతర్గత విషయమని కిషన్ రెడ్డి అన్నారు. జనసేన తో పొత్తు ప్రాథమికంగా ఒక సారి కలిశామని, నిర్ణయం తీసుకుంటే చెబుతామన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఇంజనీరింగ్ తప్పిదం..
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్‌లో కొంత భాగం స్వల్పంగా మునిగిపోయే సూచనలు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాత్రి బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు అప్రమత్తమై అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజ్‌లోని 15 నుంచి 20 వరకు ఉన్న పిల్లర్ల మధ్య ఉన్న ఆరో నుంచి ఎనిమిదో బ్లాక్‌లు మునిగిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ దగ్గరకు వెళ్లకుండా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరిగ్గా ఏమి జరిగిందో తనిఖీ చేయడానికి మాకు అనుమతి ఇవ్వడం లేదని, నీటిని పూర్తిగా విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు
జడ్చర్ల మున్సిపల్ పరిధి లోని 17వ వార్డు కు చెందిన యూత్ కాంగ్రెస్ సభ్యులు శ్రీమతిన్ తో పాటు 60 మంది మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు గౌరవం దక్కిందని, మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించి వేల మంది మైనారిటీ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తున్నారని అన్నారు. పేద ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా అదుకునేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ వైపే మేము ఉంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుండి లబ్ది చేకురిందని అన్నారు.
చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు అంటూ సెటైర్ వేశారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి నేను వెళ్లటం లేదు.. మీ పేరిట టీడీపీయే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి.. ఆ ఉత్తరం చదివిన తరవాత నేను మీకు బహిరంగ లేఖ రాస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు లేవనెత్తుతున్నాను. అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
బాలయ్య.. కొడుకు గురించి ప్రతి ఏడాది ఇదే అంటున్నావ్
టాలీవుడ్ స్టార్ హీరోల వారసులందరూ వచ్చేసారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్.. వెంకటేష్ వారసుడుగా రానా దగ్గుబాటి.. మోహన్ బాబు వారసులు.. విష్ణు, మనోజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమదైన స్థాయిలో అలరిస్తున్నారు. ఇక అందరూ చూపు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ వారసుడుపైనే ఉంది. ఎన్నో ఏళ్లుగా నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించింది లేదు. ఈ ఏడాది, వచ్చే ఏడాది.. ఆపై వచ్చే ఏడాది అంటూ గత ఐదేళ్లుగా నందమూరి బాలకృష్ణ సైతం ఇంటర్వ్యూస్ లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. కానీ, అది అమల్లోకి వచ్చింది లేదు. ఇక దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో కొంతమంది మోక్షజ్ఞ కు హీరో అవ్వాలని లేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ హీరో మెటీరియల్ కాదు కాబట్టి హీరోగా మారడానికి కొంత టైమ్ పడుతుంది అని చెప్పుకొచ్చారు. అప్పట్లో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఫిట్ గా తయారయ్యి హీరోగా మారాడు. అంతేకాకుండా ఈ మధ్య మీడియా ముందుకు కూడా బాగానే వస్తున్నాడు. భగవంత్ కేసరి సెట్ లో మోక్షజ్ఞ చాలా సార్లు మెరిశాడు.
అధికారం కోసం మేము అడ్డగోలుగా వాగ్దానాలు చేయం
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది. ఆయా పార్టీల నేతలు ప్రజలను తమవైపుకు ఆకర్షించేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి నేడు వనపర్తి తెలంగాణ భవన్‌లో మీడియా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీఆర్‌ఎస్ హయాంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. అధికారం కోసం మేము అడ్డగోలుగా వాగ్దానాలు చేయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీ లు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు నిరంజన్ రెడ్డి. మరోసారి తెలంగాణ లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. కర్ణాటకలో గ్యారంటీల ఫీజులు ఎగిరి పోతున్నాయన్నారు. ఎవరు సర్వేలు చేసిన బీఆర్‌ఎస్‌దే అధికారం అని చెబుతున్నారన్నారు.
గాజువాకలో కిడ్నాప్ కలకలం.. నలుగురు అరెస్ట్
విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో లో కిడ్నాప్ కలకలం రేపుతుంది. యాజమాన్యంలో ఉన్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు. మారికవలసలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ హెడ్ గా రమేష్ ను తోటి ఉద్యోగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన దుండగులు శరత్ చంద్రనీ నగ్నంగా చేసి వీడియో రికార్డ్ చేశారు. అయితే, డయిల్ 100కు బాధితుడి భార్య ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కైరాన్ కళాత్మిక (ఎంకె కాంక్రీట్ ) లో బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్న రమేష్ ను కిడ్నప్ చేశారు. నిన్న (శనివారం) సాయంత్రం షీలానగర్ లో రమేష్ కారులో కిడ్నాప్ చేసి.. మారికవలస గెస్ట్ హౌస్ లో మౌనిక, శశికాంత్, వంశీకృష్ణ, రాములు అనే నలుగురు బందించారు. రూంలో మూడు గంటల పాటు దాడి చేసినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, గాజువాక పోలీసులు స్పందించి విచారణ ప్రారంభించి నిందితుల ఫోన్ లు ట్రేస్ చేశారు.
స్కూల్‌లో విద్యార్థుల నమాజ్.. ప్రిన్సిపాల్ సస్పెండ్..
విద్యార్థులు స్కూల్‌లో నమాజ్ చేయడం ఉత్తర్ ప్రదేశ్ లో వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, హిందూ సంఘాలు దీనికి అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. లక్నోలోని స్కూల్ లో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరో ఇద్దరు ఉపాధ్యాయుల్ని హెచ్చరించి వదిలేసింది.
లక్నోలోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కొందరు విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో ప్రిన్సిపాల్‌ని సస్పెండ్ చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం కొన్ని హిందూ సంఘాలు పాఠశాల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ప్రాణం మీదికి తెచ్చిన హిజాబ్.. మరో యువతికి మహ్సా అమిని పరిస్థితి..
ఇరాన్ దేశం పూర్తిగా మతాచారాలపై ఆధారపడిన రాజ్యం. అక్కడ అందరు విధిగా మత చట్టాను పాటించాల్సిందే. ముఖ్యంగా మహిళ హిజాబ్ అంశంపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గతేడాది హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ.. కుర్దిష్ మహిళ మహ్సా అమినిని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించింది. అమిని మరణం ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో మహిళ మహ్సా అమిని లాగే చావుకు దగ్గరైంది. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మత అధికారులు దాడులు చేయడంతో మరో టీజేజర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం నివేదించింది. 16 ఏళ్ల అర్మితా గెరావాండ్‌ను హిజాబ్ ధరించనునందుకు అధికారులు కొట్టారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది, ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయింది.
చివరిసారిగా గెరావాండ్ ఆస్పత్రిలో చేరడాన్ని కుర్దిష్-ఇరానియన్ హెంగావ్ వంటి హక్కుల సంఘాలు మొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చాయి. 16 ఏళ్ల బాలిక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సమయంలో ఆమె లైఫ్ సపోర్టుతో, తలకు కట్టుతో కనిపించింది. గెరావండ్ ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె బ్రెయిన్ డెడ్ కావడం ఖాయమని తెలుస్తోందని ఆ దేశ మీడియా తెలిపింది.
