Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు…పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని దొరబాబుకు వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ సినిమా స్టార్, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి పదవుల కోసం ప్రశ్నించడానికే వచ్చానని చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. పవన్‌ను ఓడించేందుకు అందరూ కలిసి మెలిసి ఉండేలా, అసమ్మతి లేకుండా వైసీపీ ప్రయత్నిస్తోంది. బుధవారం కూడా వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిశారు. కొంత మంది ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి దొరబాబును ఆహ్వానించలేదు. ఈ క్రమంలోనే ఆయన కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

ప్రజలు ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాలి.. డబ్బు ఇస్తే తీసుకోండి..

ఎన్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు. రూ.2 లక్షల అరవై వేల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందజేశామన్నారు. ఎవ్వరి వద్దా తలవంచకుండా పథకాలు ఇచ్చి కొత్త ఒరవడిని సృష్టించామన్నారు.

వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటాం

వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్ళి రైతు వారీగా సర్వే చేస్తున్నారని, ఆ నివేదిక రాగానే రైతుల ఖాతాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ అప్పులు 60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది… దీనికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.

కస్సుమనే చూపులతో శ్రియా రెడ్డి స్టన్నింగ్ స్టిల్స్…

శ్రియా రెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించింది.. అయితే ఆ సినిమాలు అంతగా ఫేమ్ ను అందివ్వలేక పోయాయి.. గత ఏడాదిలో రిలీజ్ అయిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు క్రేజ్ తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ తో ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తమిళ నటిగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. తెలుగులో కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది.. ప్రభాస్ తో నటించిన సలార్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యింది.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలో అమ్మడు తన లేటెస్ట్ లుక్స్ తో నెట్టింట హంగామా చేస్తోంది. స్టన్నింగ్ గా మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లకు షాకిస్తోంది.. కస్సుమనే చూపులతో ఉన్న ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

‘నిజం గెలవాలి’ కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు

నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్‌ నారాయణ మూర్తి కలిశారు.

నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత నారాయణ మూర్తి ఆరోపించారు. రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. భువనేశ్వరి, పంచుమర్తి అనురాధ, రాంప్రసాదరెడ్డిలపై చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసుల అదుపులో గుప్త నిధుల తవ్వకాల మఠా

శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో కొంత కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పది మంది ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న మల్లూరుకు చెందిన వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పది మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం కొంత కాలంగా తవ్వకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వారిపై నిఘా పెట్టి గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఈ దాడుల్లో గుప్తనిధుల ముఠాకు నాయకత్వం వహించిన ఫారెస్ట్ అధికారితో పాటు తాడ్వాయి మండలం కాటాపురంకు చెందిన వ్యక్తి మరో 6 గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. వారితో పాటు ఫారెస్ట్ అధికారి బైక్ మరో 6 బైక్ లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసు అధికారులను ఫోన్ లో సంప్రదించగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బనగానపల్లెలో ఆగని వలసలు.. ఈసారి బీసీజేఆర్ గెలుపు పక్కా..?

నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు. నంద్యాల జిల్లా రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన బీసీ మాస్టర్ స్కెచ్‌కు గతంలో ఎన్నడూ లేనంతగా ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డిదే

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి యువత స్థితి గతులను మార్చి మాట తప్పని ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3నెలల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అన్ని మతాల ప్రజలను కలుపుకొని 17కార్పోరేషన్ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ లో సమసమాజం స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని బండి రమేష్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం సీఎం నివాసంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి.. పదేళ్లలో ఒక్క జాబ్ అయినా ఇచ్చారా

జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి పదేళ్లలో ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ అని ఆయన అన్నారు. ఓటు కోసం వస్తే.. బీజేపీ నేతలను నిలదీయాలని, 15లక్షలు వస్తే బీజేపీకి , రాకపోతే కాంగ్రెస్ కు ఓటయ్యాలన్నారు. రైతు బంధు వచ్చిన వాళ్ళే మాకు ఓటు వేయ్యండని, ఏడాదికి 15000 చొప్పున రైతు భరోసా ఇప్పించే బాధ్యత నాదని ఆయన అన్నారు.

 

Exit mobile version