NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

జగన్నాథ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మరియు మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని” తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి రోడ్ షో నిర్వహించారు.

రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!

బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. నటుడు శ్రీకాంత్ కూడా పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా దానికి శ్రీకాంత్ ఏకంగా ఒక వీడియో రికార్డు చేసి క్లారిటీ ఇచ్చారు. తాను తన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కూడా బెంగళూరు రేవ్ పార్టీ భగ్నం చేస్తున్న సమయంలో పోలీసులు షూట్ చేసిన వీడియోలో కనిపించాడు. దీంతో అది జానీ మాస్టర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడులు.. కౌంటింగ్ లోపు మరో సిట్ నివేదిక

అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పరివేక్షణ ఇకపై కూడా చేయనునుంది. కేసుల పరివేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ సిద్దం చేయనుంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మరణాలకు దారి తీసే స్థాయిలో రాల్ల దాడికి తెగబడ్డారని తెలిపింది. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు ర్యాలీలు, కర్రలతో తెగబడ్డారని స్పష్టం చేసింది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పరివేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్ లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు. అరెస్టులు చేయటంతో పాటు తర్వాత చార్జీ షీట్లు దాఖలు చేయాలని ఆదేశం అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తెలినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్ట్ కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు.

ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు

దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68  శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆరో విడత మే 25న జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఓటేశారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, తమన్నా, షారూఖ్‌ఖాన్ కుటుంబ సభ్యులు, సల్మాన్‌ఖాన్, సారా అలీ ఖాన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇక సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఐశ్వర్యరాయ్‌ చేతికి ఏదో గాయం అయినట్లుగా కనిపించింది. ఆమె బాండేజ్  వేసుకుని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు.

అధిక వడ్డీ ఆశ చూపి.. 200 కోట్లు దండుకొని పారిపోయిన జంట..

దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే.. అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో చెప్పనక్కర్లేదు. మధ్య తరగతి కుటుంబాలకు ఆఫర్‌ వచ్చిందంటే వస్తువులు కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే.. ఆ బ్యాంకులోనే సేవింగ్స్‌ చేసుకుంటారు. అలాంటి ఏకంగా ఎక్కడ లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాం ఎత్తివేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్. వందలు.. వేలు కాదు.. ఏకంగా.. రెండు వందల కోట్లు దండుకొని పారిపోయింది జంట.. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాని బాల పరారీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..అబిడ్స్‌ లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ తమ వద్ద పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి 517 మంది బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది.

అధ్యక్షుడు రైసీ మృతిపై 5 రోజుల జాతీయ సంతాపం ప్రకటన

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి సంతాపంగా ఐదు రోజుల పాటు జాతీయ సంతాపం దినాలుగా సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. గత రాత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ మరణించారు. ఇరానియన్-అజర్‌బైజానీ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ ప్రారంభోత్సవం తర్వాత ఇరాన్ నగరమైన తబ్రిజ్‌కు వెళుతుండగా ఉన్నతాధికారులతో కూడిన విమానం పర్వత భూభాగాన్ని దాటుతుండగా కూలిపోయింది.

ఇదిలా ఉంటే ఇబ్రహీం రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు స్వీకరించారు. మొఖ్బర్‌కు సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యక్తిగా పేరుగాంచారు. పాలనలో గణనీయమైన ప్రభావం చూపిన చరిత్ర ఉంది. మొహమ్మద్ మొఖ్బర్ సెప్టెంబరు 1, 1995లో జన్మించారు.. ఇరాన్ రాజకీయ, ఆర్థిక రంగాల్లో బలమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2021 ఎన్నికల్లో రైసీ విజయం సాధించడంతో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

సార్ నా భ్యార్య నన్ను రోజూ కొడుతోంది.. డ్రాయర్‌ మీద ఠాణాకు వచ్చిన బాధితుడు

కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు. గృహహింస, వరకట్న వేధింపుల చట్టం లాంటి కేసులు వారికి రక్షణగా నిలుస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు కూడా ఉందండోయ్. ప్రస్తుతం భార్యలు కూడా చేతులకు పనిచెబుతున్నారు. నాలుగు గోడల మధ్య ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య రోజూ కొడుతోందంటూ.. ఓ భర్త కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మామూలుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే తన బాధ అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో.. ఒంటి మీద బట్టలు లేకుండా.. డ్రాయర్ తో స్టేషన్ కు చేరుకున్నాడు. పోలీసులతో తన బాధను చెప్పుకున్నాడు.

భారతీయ విద్యార్థులు క్షేమం..

కిర్గిజిస్తాన్ లోని బిష్‌కెక్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మరియు తెలంగాణ విద్యార్థులకు అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతీయ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థులకు మరియు ఈజిప్టు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తరువాత, బిష్కెక్‌లో హింస చెలరేగడంతో భారతీయ విద్యార్థులపై స్థానికులు దాడులకు దారితీసింది. ఈ దాడులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కిర్గిజ్‌స్థాన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. అటువంటి పరిస్థితి ఉన్న చోట జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల విభాగం అధికారులకు నివేదించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వేగంతో మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడ సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు వచ్చిన కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులు జవాబుదారీగా ఉండాలని కేబినెట్‌ పేర్కొంది.

అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు..

ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.