NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్‌చార్జ్‌ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్‌ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్న రాహుల్‌గాంధీ..

రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్‌, రాయబరేలి స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో.. ఏ స్థానంలో ఉండాలి.. ఏ స్థానాన్ని వదులేసుకోవాలనే దానిపై సందిగ్థత ఉండేది. తాజాగా.. వయనాడ్ స్థానాన్ని వదిలేసి రాయబరేలి కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. మరోవైపు.. వదిలేసిన వయనాడ్ ఉపఎన్నికలో తన ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ,పోలీస్ ,వాటర్ వర్క్స్, విద్యుత్ , డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎవరు నిరక్ష్యంగా ఉండకూడదని అందరూ విధుల్లో ఉండాలని తెలిపారు..తక్కువ సమయంలో ఒకేసారి భారీ వర్షం నమోదైందని ముఖ్యంగా శేరిలింగంపల్లి , చార్మినార్ ,ఎల్బి నగర్, గోల్కొండ , ఆసిఫ్ నగర్ , షేక్ పెట్ ప్రాంతాల్లో వర్షం నమోదైందని అధికారులు తెలిపారు. 141 వాటర్ లాకింగ్ పాయింట్స్ లలో ప్రత్యేక సిబ్బందిని ఉంచి నీళ్ళు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో నామ మాత్రపు వర్షం పడిందని పెద్దగా ఇబ్బందులు లేవని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.. చెట్లు పడిన ప్రాంతాల్లో వెంటనే వాటిని తొలగించాలని సూచించారు.. మరో గంటలో మరోసారి వర్షం పడనుందనే వాతావరణ శాఖ సూచనలతో కమాండ్ కంట్రోల్ నుండి మానిటరింగ్ చేయాలని హైదరాబాద్ సీపీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. టెలి కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ ఇంచార్జి కమిషనర్ ,డైరెక్టర్ ఈవిడిఏం ,జోనల్ కమిషనర్లు, హైదరాబాద్ కలెక్టర్ ,హైదరాబాద్ కలెక్టర్ , హైదరాబాద్ సీపీ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

రెండు ట్రక్కులు ఢీ.. వాహనాలు పూర్తిగా దగ్ధం

హర్యానాలోని ఝజ్జర్‌లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని బీరి-ఝజ్జర్ ఎస్‌హెచ్‌వో అమిత్ కుమార్ తెలిపారు. ఒకదానికొకటి ఢీకొనగానే మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రమాదం జరగగానే డ్రైవర్లు వాహనం నుంచి దిగేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంటలు కారణంగా సమీప ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అంతేకాకుండా ఇరువైపులా వాహనాలు కూడా భారీగా నిలిచిపోయాయి. మంటలను అదుపులోకి తీసికొచ్చాక.. వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు.

అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పాడేరులో ఓ ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్‌ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.

వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన మాజీ మంత్రి

ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపారు. ఇదిలా ఉండగా.. శిద్దా రాఘవరావు ఇప్పటివరకు తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. శిద్దా రాఘవ రావు వ్యాపారవేత్తగానూ రాణించారు, 2014లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్దా రాఘవ రావుకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో ఆయన అటవీ శాఖతో పాటు పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా చేశారు. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

జూన్ 20 తర్వాతే తెలంగాణలో రుతుపవనాలు..!

వాతావరణ మార్పులకు అనుగుణంగా రుతుపవనాలు మారుతున్నాయని 10 ఏళ్ల ఇండో-జర్మన్ అధ్యయనం ప్రకారం, ఈ సంవత్సరం రుతుపవనాల ప్రారంభం కూడా తెలంగాణలో ఆలస్యం అవుతుందని పేర్కొంది. రైతులు తమ పంటలను నాటడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడానికి సహాయపడే సూచనలపై కూడా అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రత్యేకమైన రుతుపవనాల ప్రారంభ సూచన, వ్యూహాత్మక ప్రణాళిక , విపత్తు ప్రతిస్పందన కోసం ప్రభుత్వం ఉపయోగించగల విలువైన అంతర్దృష్టులను అందించగలదని అది జతచేస్తుంది.

భాగ్యనగరంలో భారీ వర్షం.. రాత్రి మరోసారి వర్ష సూచన

వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన కొన్ని గంటల తర్వాత, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది . కొండాపూర్, హైటెక్ సిటీ, గుడిమల్కాపూర్, అత్తాపూర్, హైదర్‌గూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల వాసులు కుండపోత వర్షం కురిసిందని సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్‌ ఏరియాల్లో వర్షం కురిసింది. దక్షిణ హైదరాబాద్‌లో ప్రారంభమైన వర్షం పడమటి వైపు విస్తరించింది.