NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..

చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. చిన్నపాటి విషయాలకు మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఇనుప తాళాలు మింగిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో జరిగింది. తనకు బైక్ కావాలని ఇంట్లో వాళ్లతో గొడవపడి నాలుగు తాళాలను మింగేశాడు. తాళాలు మింగిన యువకుడు భవాని ప్రసాద్‌కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాప్రోస్కోపీ విధానంతో ఎలాంటి సర్జరీ లేకుండా కడుపులో ఉన్న నాలుగు తాలాలను అత్యంత చాకచక్యంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..

ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్‌వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.

‘‘నాలుగేళ్ల చిన్నారి తల్లికి దూరంగా ఉంచడం కూడా మానసిక వేధింపులతో సమానం. అది తల్లి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఇది కూరత్వానికి సమానం’’ అని పేర్కొంది. అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వమే అని చెప్పింది. మానసిక వేధింపులు రోజు రోజుకు కొనసాగుతున్నాయని ఇది తప్పు అని ధర్మాసనం పేర్కొంది. అత్తమామలపై ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయలేమని చెప్పింది.

పని ఉందని తీసుకెళ్లి.. ఓ మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారం

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బిబి అనే మహిళ ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.

‘వన్‌ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు.. ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తు

డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు నిరంతర అభివృద్ధి కోసం ఆకాంక్షించే భారతదేశం తరపున ఒక ప్రధాన ప్రకటన అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతకుమించి, మన దేశం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాలను జరుపుకుంటున్నప్పుడు ఈ నిర్ణయం, ఈ చారిత్రాత్మక బిల్లు ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తుగా నిలుస్తుందన్నారు. భారతదేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని ధైర్యానికి ఈ బిల్లు నిదర్శనమన్నారు.

మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం

మంచు మోహన్ బాబు మీడియా దాడి చేసి ఓ జర్నలిస్ట్ ను దాని చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు మోహన్ బాబు తాను గాయపడగా ఆసుపత్రిలో చేరారు. నేడు మొహన్ బాబు ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయ్యారు. మీడియాపై దాడి చేసిన నేపథ్యంలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తుండడంతో మీడియాకు ఆడియో సందేశం అందించారు. ‘ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలి. ఇలా మీడియాపై దాడి చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పత్రికా సోదరుల అలా గేట్లు తోసుకుని లోపలి రావడం ఎంత వరకు సమంజసం. ఆ రోజూ బయటకు వెళ్తూ వారికి నమస్కారం చేసి   మా ఫ్యామిలీ మ్యాటర్ నేను తేల్చుకుంటా దీన్ని వివాదం చేయద్దు అని చెప్పాను. రాత్రుళ్ళు గేట్లు తోసుకుని రావడం ఎంత వరకు కరెక్ట్. నేను ఏకాగ్రత కోల్పోయి దాడి చేశాను.

మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి

గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని.. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటి సారి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇసుకపై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదన్నారు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూటే దొరుకుతుందన్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక వెళ్ళే చోట సీసీ కెమెరాలు పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుదామని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ వేలు పెట్టడానికి వీల్లేదని.. కలెక్టర్లకు ఇసుకపై పూర్తి కంట్రోల్ ఉంటుందన్నారు.

చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరిలో అవార్డు దక్కడం గర్వకారణం

పెద్దపల్లి జిల్లా మంథని అయ్యప్పస్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళ సంఘ అధ్యక్షురాలును శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశస్థాయిలో మహిళలు గౌరవించే విధంగా మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరిలో అవార్డు దక్కడం గర్వకారణం అని అన్నారు.

ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలి

ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి…. ప్రత్యేక నిధులు కేటాయింపు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలని, సంక్రాంతి లోపల vro వ్యవస్థ ను తీసుకొని వస్తాము. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి వెనక్కి వచ్చే వాళ్ళను తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. తప్పు చేసిన అధికారులను కఠిన చర్యలు ఉంటాయని, ఈ అసెంబ్లీ లో ror చట్టం అమలు చేస్తాం…ror చట్టం వచ్చిన మేడ్చల్ రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను ఆధారాలతో బయట పెడుతామన్నారు. 1971లో ఉన్న మంచిని తీసుకుంటామన్నారు.

వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలి.. సీఎం ఆదేశాలు

సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు. సీసీ కెమెరాల డేటా విషయంలో కాస్ట్ అఫెక్టివ్‌గా ప్లాన్ సిద్దం చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాలు అన్నిచోట్లా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ డేటా అంతా ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీసీ టీవీల డేటా అనలైజ్ చేసి డ్రోన్‌లతో పని చేస్తారని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డ్రైవర్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్లు కూడా ఎస్పీలతో కలిసి క్రైమ్ కంట్రోల్‌లో కౌన్సిలింగ్ సెషన్స్‌లో వినియోగించాలన్నారు. జిల్లాలో త్రీ మెంబర్, ఫైవ్ మెంబర్ కమిటీలు వేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సమర్ధవంతంగా పని చేయాలన్నారు. మనం అసమర్ధులం అయితే నేరస్థులు బలవంతులు అవుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

కిలో టమాటా 75 పైసలే.. లబోదిబోమంటున్న రైతులు

ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జత బాక్సులు 40 రూపాయలకు కూడా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర కాదు కదా.. కోత ధరలు కూడా రావడం లేదంటున్నారు రైతులు. మార్కెట్‌ బయటే పంటను పారబోశారు అన్నదాతలు. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ బయట రోడ్డుపై అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి.

 

Show comments