డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక..
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యల్లో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. #రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేడని, ఒక ఏబుల్, స్టేబుల్, డెడికేషన్ ఉన్న లీడర్ షిప్ ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచేదుందా. సచ్చేదుందా.? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పోవాలనుకుని కాంగ్రెస్ కి ఓటేశారని, కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ ని గెలిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు సీట్లు రాకున్నా, BRS కు ఒక్క సీట్ రాకపోయిన ఏం కాదని, మోడీ చేసిన ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు ఓటేస్తారన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జాతీయ నేతలు సభల్లో పాల్గొంటారని, నేను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రచారం స్టార్ట్ చేస్తానని ఆయన తెలిపారు.
మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందంటున్న పీఎం మోడీ..!
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే..
ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించాయి. దాంతో సదురు అభ్యర్థులు వారి నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తూ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రచారంలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధించారు. మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాకర్ల సమక్షంలో టీడీపీలోకి చేరిన 100 కుటుంబాలు..
రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలిస్తుందని రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండలం లోని కాటేపల్లి, రావిపాడు పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు.
చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు.. నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి
వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు. సేవ కోసం పని చేసే వాలంటీర్లు.. చంద్రబాబు గాలానికి పడరు.. బూటకపు మాటలు.. నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు గాలెం వెయ్యడం.. వారిని వాడుకొని వదిలేయడం అయిపోయింది.. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు పది వేల జీతం పెంచుతామని కొత్త ఎర వేస్తున్నాడు.. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నాడన్నారు. మూడు పదులు నిండని వాలంటీర్లపై.. చంద్రబాబు అండ్ కో చాలా దారుణంగా మాట్లాడారు అని పేర్నినాని ఆరోపించారు.
చిలుకూరు బాలాజీ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ షురూ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎంతోగానో ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం నుంచి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్‌ను మంగళవారం(ఏప్రిల్ 9వ తేదీ నుంచి) షురూ చేశారు. తమ ఇంటి దేవుడు(ఇలవేల్పు) శ్రీ వెంకటేశ్వరుడికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఆయన కుటుంబీకులు సైతం పాల్గొననున్నారు.
చిలుకూరు బాలాజీ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ షురూ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎంతోగానో ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం నుంచి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్‌ను మంగళవారం(ఏప్రిల్ 9వ తేదీ నుంచి) షురూ చేశారు. తమ ఇంటి దేవుడు(ఇలవేల్పు) శ్రీ వెంకటేశ్వరుడికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఆయన కుటుంబీకులు సైతం పాల్గొననున్నారు.
రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు రేపటితో.. అంటే ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు.
రేపటి బండి సంజయ్ “దీక్ష” వాయిదా…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో రేపు జరప తలపెట్టిన ‘నేతన్నకు అండగా భరోసా దీక్ష’ కు ప్రభుత్వం దిగివచ్చిందని, ఇది బండి సంజయ్ కుమార్ పోరాటే ఫలితమేనని , నేత కార్మికుల సమస్యలు, డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపినందున, దీక్షా కార్యక్రమాన్ని ఎంపీ బండి సంజయ్ వాయిదా వేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నేతన్నల ప్రధాన డిమాండ్లైన బతుకమ్మ చీరెల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతోపాటు సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కొత్త ఆర్డర్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ దీక్షను వాయిదా వేశారని తెలిపారు. నేతన్నల ఇతర డిమాండ్లను సైతం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. నేతన్నలకు, ఆసాములకు మద్దతుగా బండి సంజయ్ వివిధ రూపాల్లో చేసిన పోరాటాలతోపాటు నేతన్నల ఐక్య పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తే పోరాటాల ద్వారానే వాటికి పరిష్కార మార్గాలు సాధ్యమనే విషయం నేతన్న పోరాటాలతో మరోమారు రుజువైందన్నారు. ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ అసాములకు, నేత కార్మికులను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలుతెలుపుతున్నామన్నారు.భవిష్యత్తులోనూ నేతన్నలకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు.
కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు..
తన నియోజకవర్గం నుంచి మరొకరికి తెలుగు దేశం పార్టీ టికెట్ ఇస్తుందనే ప్రచారంతో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (ఏప్రిల్9) కార్యకర్తల ఆత్మీయ సమావేశం తర్వాత రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుంటాను అని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. వారు చెప్పినట్టుగానే చెస్తాను.. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు.
