Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రామ్ నాథ్ కోవింద్‌తో అమిత్ షా సమావేశం

ఢిల్లీలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ గురించి చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. గత శనివారం (సెప్టెంబర్ 2) కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏ అజెండాతో ముందుకెళ్లాలనే దానిపై న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు చర్చించినట్లు సమాచారం. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఎన్‌కే సింగ్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీలో ఉండేందుకు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి నిరాకరించారు.

చట్టాలకు చంద్రబాబు అతీతుడు కాదు..

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు. అందుకే గుమ్మడి కాయ దొంగలా భుజాలు తడుముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలకు చంద్రబాబు అతీతుడు కాదని.. చేసిన అవినీతికి చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. సానుభూతి కోసమే అరెస్టు అంటున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముడుపులు ఎటు నుంచి ఎలా వెళ్ళిందో 46 పేజీల నోటీసుల్లో ఆధారాలతో సహా బయటపడిందన్నారు. చంద్రబాబు పాపం పండిందని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చేసే ఉద్దేశం అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు అయి ఉండే వాడని ఆయన అన్నారు. ఇప్పటికే ఈడీ వంటి ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండాల్సిందన్నారు.

మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మిల్లీమీటర్లు కాగా… ఇప్పటివరకు 723.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు.. పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం

ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎత్తిపోతలకు సిద్ధమైంది. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్.. అదే రోజు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న గ్రామ సర్పంచులు, ప్రజలు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల లోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.

స్టాంప్ పేపర్ల అక్రమార్కుల గుట్టురట్టు

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం. అయితే కొంత మంది వ్యక్తులు ఈ స్తావేజులతో అక్రమ దందా చేస్తున్నారు. పాత స్టాంప్ పేపర్లను కొత్త ధరలతో విక్రయిస్తున్నారు. ఇటీవల ఆన్లైన్ స్టాంప్ పేపర్ల విక్రయాలపై రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాత స్టాంప్ పేపర్లపై భూ అక్రమాణదారులు దృష్టి పెట్టడంతో గిరాకీ పెరిగింది. అయితే.. ఇలాంటి ఓ స్టాంప్‌ పేపర్ల ముఠా కట్టించారు పోలీసులు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్) బృందం హుస్సేనియాలం పోలీసులతో కలిసి స్టాంప్ పేపర్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

గెలిచినా, ఓడిన నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండేవాడు స్థానిక నాయకుడు

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. గెలిచినా, ఓడిన నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండేవాడు స్థానిక నాయకుడని అన్నారు. అంతేకాకుండా.. మంజూరైన పనులను మళ్లీ మేము మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జనవరి 17వ తారీఖు వరకు నేనే ఎమ్మెల్యేను , 17వ తారీఖు నా ఎమ్మెల్యే పదవికి ఆఖరి రోజు అని ఆయన అన్నారు. మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్తున్నారని, ఈ మధ్యలో ఆటోల్లూ ఇటు, ఇటోళ్లు అటు కావచ్చు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేపు రిలీజ్ పెట్టుకొని బాయ్ కాట్ ఏంటిరా.. ?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జవాన్. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే క్యామియో లో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే జవాన్ కోసం షారుఖ్.. ఎప్పుడు చేయని ప్రమోషన్స్ చేశాడు. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈలోపే ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. జవాన్ బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది. అందుకు కారణం.. నటుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. అతనికి, జవాన్ కు సంబంధం ఏంటి అంటే.. ఉదయనిధి స్టాలిన్ కు రెడ్ జైయింట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ప్రొడక్షన్ లో మంచి హిట్ సినిమాలను అందించాడు.

బీజేపీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు గుడ్‌బై..

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు. అతను పార్టీకి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను తెలియజేశారు. అతని రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు. జాతీయవాద నేత అయిన నేతాజీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ తనకు సహకరించలేదని రాజీనామా లేఖలో చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్ధాపించి కుల మ‌తాల‌కు అతీతంగా నేతాజీ ఆలోచ‌న‌ల మేర‌కు అన్ని వ‌ర్గాల‌ను భార‌తీయులుగా ఏకం చేయాల‌ని అనుకున్నామ‌ని లేఖ‌లో తెలిపారు.

పార్లమెంటు పనితీరును రాజకీయం చేస్తున్నారు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అజెండాను ప్రకటించకుండ పార్లమెంట్ ను ప్రత్యేకంగా ప్రభుత్వం సమావేశపరుస్తోందని సోనియాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును రాజకీయం చేయడం, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు 85వ అధికరణం ప్రకారం రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా క్రమం తప్పకుండా జరుగుతాయని తెలిపారు.

 

 

Exit mobile version