NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి:
విశాఖపట్నం తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం (జనవరి 4) జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా.. అధికారులు గురువారం పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో.. గాలి అనుకూలించకపోవడంతో రెండు ప్యారాచూట్ల ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పట్టుకోల్పోయిన ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే విశాఖ సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది.. ఇద్దరు నావికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నావికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జేసీ సంచలన వ్యాఖ్యలు:
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి నేను నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ నాయకులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు.

తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై సమావేశం:
నేడు తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై భాగస్వాములతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోవడానికి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల.. తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల నుండి 2027-28లో 20,968 మెగావాట్లకు.. 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్ యూనిట్ల నుండి 2027-28లో 1,15,347 మిలియన్ యూనిట్లకు.. 2034-35లో 1,50,040 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం:
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు. అయితే.. విద్యార్థినులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలికగా గుర్తించారు. ఈ ముగ్గురు విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అమ్మాయిల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు.. అమ్మాయిల మిస్సింగ్‌తో వారి కుటంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చనిపోయాడని తీసుకెళ్తుండగా:
మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుండి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పాండురంగ్ తాత్యా ఉల్పే అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. వృద్ధుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దారిలో అంబులెన్స్ పెద్ద గుంత గుండా వెళ్లింది. దీంతో అంబులెన్స్‌లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చనిపోయినట్లు ప్రకటించిన పాండురంగ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. వెంటనే పాండురంగ్‌ను మళ్లీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంత అద్భుతం ఎలా జరిగిందో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

నేటి నుంచి ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ప్రచారం:
కాంగ్రెస్ పార్టీ జనవరి 3, 2025 నుండి “జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ప్రచారం జనవరి 26, 2025న మధ్యప్రదేశ్‌లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా పార్టీ జనవరి 3కు ఈ ప్రచారాన్ని వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్‌కు గౌరవంగా పార్టీ అన్ని కార్యక్రమాలను వారం రోజుల పాటు నిలిపివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రచారంలో నియోజిక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్:
నూతన సంవత్సరం వేళ జొమాటోకు చెందిన బ్లింకిట్ మరో కొత్త సేవను ప్రారంభించింది. గురుగ్రామ్‌లో బ్లింకిట్ అంబులెన్స్ సేవలను ప్రారంభించినట్లు సీఈవో అల్బిందర్ ధిండ్సా‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్ సేవలు అందుతాయని పేర్కొన్నారు. గురువారం ఐదు అంబులెన్స్ సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. సిబ్బందితో కూడిన ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇప్పటి వరకు బ్లింకిట్ రోజువారీ నిత్యవసర వస్తువులను సరఫరా చేసేది. బ్యూటీ ప్రొడక్ట్స్, పెంపుడు జంతువుల సంరక్షణ, పిల్లల సంరక్షణ వస్తువులు, ఆహారాన్ని అందించేది. తాజాగా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. 10 నిమిషాల్లో రోగి ఇంటికి చేరుకునే అంబులెన్స్ సేవలను ప్రారంభించింది.

అల్లు అర్జున్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ:
పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

హీరోయిన్ మాధవీలత ప్రాస్టిట్యూట్:
జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కీలక మలుపులు తిరుగుతోంది. బస్సు దగ్ధమైన ఘటన ప్తె ఒకవైపు పోలీసుల విచారణ చేస్తుండగా, అసలు ఘటనపై ఫిర్యాదు చేయనని జెసి చెబుతున్నారు. బస్సు దగ్ధం ఘటనప్తె సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలంటున్నారు. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదని ఇప్పుడు ఎందుకు భాదపడతానన్నారు ఆయన మరో వ్తెపు తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకులను నిర్వహణ ప్తె లేనిపోని ఆరోపణలు చేశారని బీజేపీ నేతల ప్తె తీవ్రస్థాయిలో జెసి ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హీరోయిన్, బీజేపీ నాయ‌కురాలు మాధవి లత పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధ‌వి ల‌త‌ను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నేతలు.. మాధవి లతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్‌ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. అయితే అంతకు ముందు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జెసి పార్క్ వైపు మహిళలు ఎవరు వెళ్లకూడదు అని మాధవి లత సూచనలు చేశారు. అక్కడ అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆమె వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. మాధవి లత వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని… జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని అన్నారు.

రోహిత్‌ శర్మపై వేటు:
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్‌మన్‌ గిల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్‌ ఆడుతున్నారు.

Show comments