ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్
దసరా పండగ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ నేడు ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను పోల్చి.. ఏది కావాలో ఎంచుకోవాలన్నారు.
జై కేసీఆర్ –జై కాలేరు:
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమంయం మాత్రమే ఉండడంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2018) విక్టరీ కొట్టిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభలతో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రచారం ఆరంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన ప్రచార పాదయాత్రలో జోరు పెంచారు. నింబోలి అడ్డాలో మొదలైన ప్రచార పాదయాత్ర మౌలానా ఆజాద్ నగర్, సూరజ్ నగర్ వరకు ఘనంగా సాగింది. జై కేసీఆర్ –జై కాలేరు నినాదాల మధ్య ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలా కొనసాగింది.
అర్నియా సెక్టార్‌లో కాల్పులు:
జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పోస్ట్‌పై గురువారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. దీంతో భారత సైనికులు వారికి తగిన సమాధానం ఇస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని బీఎస్ఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో BSF పోస్ట్‌పై మోర్టార్ దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. జమ్మూలోని 5 భారత పోస్టులపై పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్, నలుగురు పౌరులు గాయపడ్డారు. 9 రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి.
Also Read: Telangana Elections 2023: ఏది కావాలి మనకు?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్
ధోనీ పేరు చెప్పి పాపను కిడ్నాప్ చేసిన నిందితులు:
జార్ఖండ్ రాజధాని రాంచీలో కిడ్నాప్‌కు సంబంధించిన ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో నటిస్తూ ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు కిరాతకులు. నేరగాళ్ల ఈ పద్ధతి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ధోనీ పేదలకు ఐదు వేల రూపాయలు, ఇళ్లు ఇస్తున్నాడని చెప్పి.. జగన్నాథ్‌పూర్‌కు చెందిన మధు దేవిని ట్రాప్ చేశారు. తల్లీకూతుళ్లను బైక్ ఎక్కించుకుని.. తల్లిని వదిలి ఏడాదిన్నర బాలికను తీసుకుని పారిపోయాడు.
మరో సినిమాను లైన్లో పెట్టిన రవితేజ:
మాస్ మహారాజ రవి తేజ ‘ టైగర్ నాగేశ్వరావు’ సినిమాతో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఓటింగ్‌లో దూసుకుపోతున్న హీరోలు:
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు. తాజా ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓట్లతో టాప్‌లో హీరో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో అమర్ దీప్ చౌదరి, మూడో స్థానంలో భోలే, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో స్థానంలో సందీప్, ఏడో స్థానంలో అశ్విని ఉన్నారు. చివరలో శోభాశెట్టి ఉంది. మరి ఈసారైనా ఆమెను ఎలిమినేట్ చేస్తారా? లేక మరొకరిని బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది..
