కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి:
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదివారం కావడంతో సరదాగా కాలువలోకి స్నానానికి వెళ్లారు చిన్నారులు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి అజయ్, పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వీరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తమ చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఎయిర్ పోర్టులో పాముల కలకలం:
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు పట్టుబడటం కలకలం సృష్టించాయి. ఎప్పుడూ ఎయిర్ పోర్టులో బంగారం, డ్రగ్స్, తుపాకులు పట్టుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఏకంగా పాములు పట్టుబడటం భయాందోళన కలిగించాయి. ఇద్దరు మహిళలు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమానం రాగానే కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీలు నిర్వహించగా.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళల వద్ద విషపూరిత పాములను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని ఆరా తీస్తున్నారు. బ్యాంకాక్ నుంచి పాములు తీసుకుని వస్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేసిన ఎందుకు గుర్తించలేదు? అనే అనుమానం వ్యక్తం మవుతుంది.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇది 27వ సారి కావడం గమనార్హం. ఇవాళ సీఎం రేవంత్ ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయగాథలపై ఆయన హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కుల గణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశాలపై నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసభ్యులు నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
లరేగిన అల్లర్లు, ఇంటర్నెట్ బంద్:
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న పిటిషను మేరకు స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న పెద్ద గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు మసీదు ముందు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వి, వెహికిల్స్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారు.
సీఎం ఎవరు.. నేడు కీలక భేటీ:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేసినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు రేపటి (మంగళవారం)తో ముగియనుంది. కాబట్టి ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి అయింది.
ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం:
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లోని ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అంబర్‌నాథ్, కళ్యాణ్, ఉల్హాస్‌నగర్, బద్లాపూర్‌ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు తీవ్రంగా ఉండడంతో పెద్దెత్తున భారీగా పొగ కమ్మేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. థానే జిల్లాలోని అంబర్‌నాథ్ లోని ఆనంద్ నగర్ ఎంఐడీసీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రసినో ఫార్మా అనే కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
ఇవాళైనా రాంగోపాల్ వర్మ వెళ్తాడా?:
ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరుకావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు వర్మ. ఈనెల 19న విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరాడు. రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన మరోసారి నోటీసులు ఇచ్చారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్. వర్మ వాట్సాప్ కి నోటీసులు పారు సీఐ శ్రీకాంత్. ఇక ఈరోజు ఆయన వస్తారని భావించి ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా హాజరు కావచ్చని పోలీసులు పేర్కొన్నారు.
రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది:
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్లో దూసుకెళ్తోంది. గతేడాది యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఓ హీరోతో రిలేషన్లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా ‘కిస్సిక్’ సాంగ్‌ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప వైల్డ్ ఫైర్ వేడుకలో రిలీజ్ చేయగా ఆ వేదికపై రష్మిక తన పెళ్లి గురించి మాట్లాడింది. “నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప” అని రష్మిక చెప్పగా యాంకర్లు రష్మికను పెళ్లి విషయమై కూడా ప్రశ్నించారు. ‘ఇండస్ట్రీ చెందిన వ్యక్తిని చేసుకుంటారా? లేదా బయట వ్యక్తినా అని అడగగా “దీనికి సమాధానం అందరికీ తెలుసంటూ” రష్మిక చిరు నవ్వులు చిందించింది.
అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే:
ఐపీఎల్ 2024 మెగా వేలం తొలి రోజు 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 10 ఫ్రాంఛైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ఏకంగా రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి. 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇందులో సీనియర్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు కూడా ఉండడం విశేషం. ఈ ఇద్దరిని కనీస ధరకు కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. దేవదత్ పడిక్కల్, యశ్ ధుల్, కార్తీక్ త్యాగీ, పియూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్ లాంటి భారత ప్లేయర్స్ కూడా ఉన్నారు.
మహ్మద్ షమీ (భారత్) – రూ.10 కోట్లు
హర్షల్ పటేల్ (భారత్) – రూ.8 కోట్లు
ఇషాన్ కిషన్ (భారత్) – రూ.11.25 కోట్లు
రాహుల్ చాహర్ (భారత్) – రూ.03.20 కోట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – రూ.2.40 కోట్లు
అథర్వ తైడే (భారత్) – రూ.30 లక్షలు
అభినవ్ మనోహర్ (భారత్) – రూ.3.2 కోట్లు
సిమర్జిత్ సింగ్ (భారత్)- రూ.1.5 కోట్లు