NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

తిరుమలలో నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు:
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక, చక్రతాళ్వార్‌కీ అర్చకులు పుష్కరిణిలో శ్రీవారికి అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త:
తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాగు జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు:
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఎఎఐ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు.

పసిడి ప్రియులకు శుభవార్త:
దసరా పండగ రోజు బంగారం ప్రియులకు శుభవార్త. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ. 61,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు.

జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు:
పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులనులు ప్రభాస్ సొంతం. జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని ఓ పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడికి పూజలు చేసినట్లు కొందరు అభిమానులు చేసారు. ప్రభాస్ కటౌట్స్ పెట్టి దానికి పూల దండలు వేసి, బర్త్ డే డెకరేషన్స్ చేసి.. పులిహార, కేసరి, గారెలు లాంటివి దేవుడికి పెట్టినట్టు నైవేద్యం పెట్టి మరీ గ్రాండ్ గా వేడుకలు చేసుకున్నారు.

Also Read: Mohammed Shami: ప్రపంచకప్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’.. మహమ్మద్ షమీ అరుదైన రికార్డు!

మహమ్మద్ షమీ అరుదైన రికార్డు:
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడిన షమీ.. 36 వికెట్స్ పడగొట్టాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో 12 ఇన్నింగ్స్‌ల తర్వాత షమీ సాధించిన రికార్డులను మరే బౌలర్‌ కూడా సాధించలేదు.

ధోనీ, కోహ్లీలకు సాధ్యం కాలేదు:
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన సెమీస్‌కు మరింత చేరువైంది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దాంతో గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా చెక్ పెట్టింది. అంతేకాదు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.