దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న పెద్దమ్మ తల్లి:
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఈరోజు శ్రీ దుర్గాదేవిగా ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు. దశమి రోజే ఆయుధ పూజ కూడా ఉంటుంది. దశమి రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు అందిస్తారు.
తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ కూతురు:
తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ మినహా.. మిగతా పార్టీలు ఏవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె వెన్నెల కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వార్తలపై వెన్నెల స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. తాను కంటోన్మెంట్ లోనే పుట్టి పెరిగానని చెప్పిన వెన్నెల.. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
షాక్ ఇస్తున్న ఉల్లి ధరలు:
సామాన్యులకు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటం సామాన్య జనానికి భారంగా మారుతోంది. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధరలు రూ.45 నుంచి రూ.50 రూపాయలు పలుకుతున్నాయి. విశాఖపట్నంలో కిలో ఉల్లిని రూ.50కి విక్రయిస్తుండగా, రైతుబజార్‌లో కిలో ఉల్లి ధర రూ.40గా ఉంది.
Also Read: IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ఢీ.. ఐదవ విజయం ఎవరిదో?
తమిళనాడులో వర్షానికి నీట మునిగిన రోడ్లు:
ప్రస్తుతం భారతదేశం అంతట శీతాకాలం మొదలవుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని చాలా తీర ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కేరళలో కొన్ని చోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. వాతావరణంలో ఈ మార్పు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్ 27 వరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఛాయ్ అమ్ముతున్న రజినీకాంత్?:
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల పోలికలతో అటు, ఇటుగా దగ్గర పోలికలు ఉన్న వాళ్లు ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. దాదాపు వాళ్ళ లుక్స్ చూస్తే.. అచ్చు మన సెలెబ్రిటీలలాగే కనపడి ఆశ్యర్యపరుస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
భారత్, న్యూజిలాండ్ ఢీ:
వన్డే ప్రపంచకప్ 2023లో నేడు మెగా సమరం జరగనుంది. మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాదు.. ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇరు జట్లు సమవుజ్జీల్లా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఐదవ విజయం ఎవరిదో?.. తొలి ఓటమిని రుచి చూసేదెవరు? అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో మధ్యాహ్నం 2 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
