ఏపీలో కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలయింది. జూన్ 4న ఫలితాలు వెల్లువడగా ఓట్ల లెక్కింపు కోసం పక్క ప్రణళికతో ఈవీఎంలు భద్రపరచాలని కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరాలను అనుమతించొద్దని ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఆదేశాలు జేరి చేసారు. కౌంటింగ్ సమయంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు జరగకుండా చూడాలి అని పోలీస్ వారికీ విజ్ఞాప్తి చేసారు.
నేడు ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి లంచ్మోషన్ పిటిషన్పై విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ( గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీస్ అధికారులు తనను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిల్ లో పేర్కొన్నారు. కాగా, మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ లో ప్రస్తావించారు. అయితే, ఈ కేసును విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నేటి మధ్నాహ్నం ఈ కేసులో వాదనలు జరగనున్నాయి. అయితే, కాగా, మాచర్లలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో బెయిల్ ను మంజూరు చేయగా.. ఈ కేసులో విచారణ అధికారులను మారుస్తుందా లేదా అనుది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..
పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. అలాగే, కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మరోసారి జిల్లాలో అల్లర్లు జరిగితే పోలీసులు అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు.. మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది.. మంచి జిల్లాగా మారడానికి మనకు అవకాశం ఉంది అని ఎస్పీ మాల్లిక గార్గ్ వెల్లడించారు.
నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..
నేడు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తోందని ఆపార్టీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. కాగా.. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తుల పై చర్యలు తీసుకోవడం లేదని నేతలు విమర్శించారు. బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు.
హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు.. అదుపులో ఆ.. నలుగురు..!
హైదరాబాద్ నాంపల్లి లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ రూ.లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. దీనిపై ఏసీబీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఒక వ్యక్తి పత్రం ఆమోదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయ అధికారులను సంప్రదించాడు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంగీకరించిన వ్యక్తి తొలుత రూ.1.5 లక్షలు పందెం కాశారు. మరో రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలో తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈలోగా బాధితురాలు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు నిఘా పెట్టారు.
డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, గ్యాస్ సిలిండర్.. రేపటి నుంచి మారనున్న రూల్స్
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ రోజున అనేక నియమాలలో మార్పులు ఉంటాయి. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎల్‌పిజి సిలిండర్ ధరలు, ఆధార్ అప్‌డేట్, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన మార్పులు జూన్‌లో కనిపిస్తాయి. ఆర్‌బిఐ విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం.. జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో ఆదివారం, రెండవ.. నాల్గవ శనివారాలు ఉన్నాయి. ఇది కాకుండా, జూన్‌లో ఇతర సెలవులు రాజా సంక్రాంతి, ఈద్-ఉల్-అజా ఉన్నాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. జూన్ 1, 2024 నుండి, మీరు ఆర్టీవోకి బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో డ్రైవింగ్ పరీక్షను నిర్వహించగలరు. ఈ కేంద్రాలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి.. సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి అధికారం కలిగి ఉంటాయి. అదే సమయంలో, అతివేగానికి జరిమానా రూ. 1,000 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. అయితే, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే అతను రూ.25,000 భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, వాహన యజమాని రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. మైనర్ 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్‌కు అనర్హుడవుతాడు.
బెంగుళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ .. నేడు కోర్టులో హాజరు
జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి వచ్చిన తర్వాత ప్రజ్వల్‌ను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసి విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. అంతకుముందు బుధవారం స్థానిక కోర్టు ఆయన ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు , హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్‌డిఎ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ తన నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసిన మరుసటి రోజు ఏప్రిల్ 27న విదేశాలకు వెళ్లారు. అరెస్టు చేసిన 24 గంటల్లో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతుందని, ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి రాకపోతే పాస్‌పోర్టును రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేసి, తనపై కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు మే 31న అంటే ఈ రోజు హాజరవుతానని హామీ ఇచ్చారు. ప్రజ్వల్ లుఫ్తాన్సా మ్యూనిచ్-బెంగళూరు విమానంలో బిజినెస్ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నాడు.
పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన కేసులో దోషిగా తేలిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్ దోషిగా తేలిపోయారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్ కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే, ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్న ట్రంప్ కు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సంబంధిత కేసు కోసం మాన్హాటన్లోని కోర్టుకు మాజీ అధ్యక్షుడు వెళ్లాడు. జడ్జి మాటలు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపణలు చేశారు. కోర్టులో కూడా రిగ్గింగ్ జరిగింది.. కానీ నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో? చూద్దాం. సోషల్ ఈడియలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌లెంట్ అని, సెకండ్ హాఫ్ బాగుందని, విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందని ఒకరు ట్వీట్ చేశారు. సెకండ్ హాఫ్ స్లోగా ఉందని.. క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు కాస్త సినిమాకు హెల్ప్ అయ్యాయని… మొత్తం మీద చూడదగిన చిత్రం అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఓటీటీ కూడా కాదు బొమ్మ లెవెల్ సినిమా.. మూస సినిమా తీసి దొబ్బాడు అని మరొకరు పేర్కొన్నారు. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించారు అని అంటున్నారు.
