NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వేణు స్వామి క్రేజ్ మాములుగాలేదు.. కన్నడ హీరోయిన్ తో పూజలు..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు కన్నడ హీరోయిన్ రీసెంట్ డేస్ లో చాలా ఫెమస్ అయ్యింది ఆ చిన్నది. ఆమె ప్రభుదేవాతో డాన్స్ చేసి పేరు తెచ్చుకున్న కన్నడ యంగ్ హీరోయిన్ నిశ్విక నాయుడు..

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు..

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని నామినేట్ చేశాయి. దీంతో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం ఎదురైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ, మాజీ స్పీకర్ ఓం బిర్లను ప్రతిపాదించగా, ఇండియా కూటమి తరుపున కేరళకి చెందిన కాంగ్రెస్ ఎంపీ కే.సురేష్ పోటీ పడుతున్నారు.

తొలిసారిగా 1952లో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మౌలాంకర్ స్పీకర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ విజయం సాధించారు. ఈ రెండింటి తరువాత ఇప్పడే తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు అనివార్యమమైంది. సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పోస్టును అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈ సారి ప్రతిపక్షాలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ఇరు పక్షాలు ఎన్నికలకు వెళ్లాయి.

తన మరదలుపై కన్నేసాడని మిత్రులతో కలిసి యువకుడి దారుణ హత్య..

తన మరదలును ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని పొట్టన పెట్టుకున్నాడు. ప్రేమించొద్దని చెప్పి మాటలతో చెప్తే సరిపోయేది ఉండేది. వినకపోతే.. పోలీసుల చేతనైనా చెప్పించాల్సింది. కానీ.. అనవసరంగా ఓ యువకుడిని దారుణంగా హతమార్చాడు. సినిమా తరహాలో తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఓ అమ్మాయి ప్రేమ వలన నిండు ప్రాణం బలైంది. రోజు సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా.. హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఓ యువకుడిని దారుణంగా చంపేశారు.


ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..

కెనడాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది. గత మూడు దశాబ్ధాలుగా లిబరల్ పార్టీకి ఈ స్థానంలో ఓటమి ఎదురైంది. ఉప ఎన్నికల్లో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత ఇప్పుడే తొలిసారి ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన లెస్టీ చర్చి పరాజయం పాలయ్యారు. న్యూ డెమెక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచాడు. చర్చ్‌పై పాల్ 590 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన..

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. మంగళవారం హంద్రీనీవా కాలువ పరిశీలించారు.. అనంతరం.. ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పంలో ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తాం.. అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కుప్పం అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తాం.. అంతేకాకుండా.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పచ్చదనానికి కేరాఫ్ గా కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు.

లోక్‌సభలో ఓవైసీ ‘పాలస్తీనా’ నినాదం.. అనర్హత వేటు వేయొచ్చా.?

లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి ఫిర్యాలు అందాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అతడిపై అనర్హత వేటు వేయాలని కోరారు. పరాయి దేశానికి విధేయత చూపించినందుకు ఓవైసీని అనర్హుడి ప్రకటించవచ్చని సూచించారు.

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టనున్నారు. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే నిర్వహించనున్నారు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని తెలిపింది.

జూడాలు మీ సమ్మె ఎవరి ప్రయోజనం కోసం?

వైద్యుడు కనిపించే దేవుడు.. సేవా భావం కలిగినవారే ఈ వృత్తి లోకి వస్తారు. నిస్సహాయులకు.. నిరుపేదలకు నేరుగా సాయం అందించే ఏకైక అవకాశం ఈ వృత్తిలోనే ఉంటుంది. ఈ వృత్తి మరే వృత్తికి సాటిరాదు. వైద్య శాఖకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ సమస్య వచ్చినా అన్నిటినీ పక్కన పెట్టి ముందుగా స్పందిస్తోంది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే వైద్య విద్య సంచాల కుడి (DME) పరిధిలో పనిచేసే సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఏడాది మొత్తానికి సరిపడా రూ. 406 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అనుమతి వేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు.. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.