NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు..

దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రల సమరంలో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక, ఒక యువకుడు మరణించాడు. మృతుడు ఆస్పరికి చెందిన బాల గణేష్ గా పోలీసులు గుర్తించారు. కర్నూలులోని దేవరగట్టులో జరిగిన ఈ ఉత్సవాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఇనుపరింగుల కర్రలతో కర్రల సమరానికి దిగారు. అయితే, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న టైంలో కొంతమంది కాగడాల దివిటీలను గాలిలోకి ఎగివేశారు.. దీంతో గొడవ స్టార్ట్ అయింది.

అయితే, దేవరగట్టు కర్రల సమరాన్ని చూసేందుకు స్థానికులు కొంతమంది ఓ చెట్టు ఎక్కి నిల్చున్నారు. అయితే, ప్రమాదవశాత్తు ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది. అది అక్కడే ఉన్న గణేష్ అనే యువకుడు మీద పడడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు గాయల పాలయ్యారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులందరినీ ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం అంబులెన్స్ లో తరలించారు.

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

మహిళలకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధర మళ్లీ పెరిగింది.. నిన్నటీ ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..పండుగల సీజన్ నేపథ్యంలో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో దీపావళి ఉండడం, పెళ్లిళ్ల సీజన్‌ కూడా ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఈరోజు మార్కెట్ లో ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56550 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు పెరిగి 61690 గా ఉంది. అలాగే వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 78000 గా ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..

*. ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది.

*, ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

*. ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,910గా ఉంది.

*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్ఢ్‌ ధర రూ. 61,690గా ఉంది.

*. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,690గా ఉంది..

కెనడా ప్రధాని ట్రూడోపై విమర్శలు.. నా సపోర్ట్ భారత్ కే: కన్జర్వేటివ్ పార్టీ చీఫ్

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఆరోపణలతో భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం చేసుకోలేకపోయారు అని ఆయన అన్నారు.

తాను కెనడా ప్రధాని అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరిస్తానని కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ పియర్ పోయిలీవ్రే చెప్పారు. భారత ప్రభుత్వంతో వృత్తిపరమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.. రెండు దేశాల మధ్య విబేధాలు ఉన్నా ఫర్వాలేదు కానీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రొఫెషనల్ గా ఉండాలి.. నేను కెనడా ప్రధాని అయితే భారత్‌తో సంబంధాలను పునరుద్ధరిస్తాను అంటూ పోయిలీవ్రే పేర్కొన్నారు. భారతదేశం నుండి 41 మంది కెనడియన్ దౌత్యవేత్తలను రీకాల్ చేయడం గురించి అడిగినప్పుడు, అతను ట్రూడో అసమర్థుడు మరియు వృత్తిపరంగా లేడని ఆరోపించారు. నేడు, కెనడాకు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలతో విభేదాలు ఉన్నాయి. కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారనే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పియర్ పోయిలీవ్రే అన్నారు.

నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఉదయం చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న మృతి ఇరువురు కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

చావాలా.. బతకాలా నేనేం చేయాలి.. విచిత్ర అనుభవాన్ని చెప్పిన కేటీఆర్‌

రాజకీయాలు దూరం నుండి చూడటం మంచిది. కానీ అందులోకి ప్రవేశించిన తర్వాతే అసలు సినిమా మొదలవుతుందని మంత్రి కేటీఆర్ అంటున్నారు. రాజకీయాల్లోకి రావడం తేలికేనని కేటీఆర్ అన్నారు. ఒక్కసారి వస్తే కష్టాలు వేరు. క్రీడల్లో రాణించాలన్నా, సినిమాల్లో నటించాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ప్రతిభ, నైపుణ్యం అవసరమని, అయితే రాజకీయాల్లోకి రావాలంటే ఇవేమీ అవసరం లేదని కేటీఆర్ అన్నారు. డబ్బుంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్న భావన మన దేశంలో ఉందన్నారు. కానీ రాజకీయాల్లో రకరకాల పంచాయితీలు చేయాల్సి వస్తోందని కేటీఆర్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీలకు పంచాయితీ… సర్పంచ్, ఎంపీటీసీలకు పంచాయితీ ఉంటుంది. ఎవరి పాత్ర ఏంటో సరిగా తెలీదు. దీన్ని వల్ల వాళ్లలో వాళ్లకు తగాదాలొస్తున్నాయి. వారిని కలవడానికి రోజులో సగం సమయం పడుతుంది. చట్టాలు చేయడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించాలన్నారు. అయితే ఇంటి ముందు మోరీ బాగా లేకున్నా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తున్నారు. సర్పంచ్ పనులు, ఎంపీటీసీ పనులు, కౌన్సిలర్ పనులు ఎమ్మెల్యే చేయాల్సి ఉంటుంది. ఫోన్లు, వాట్సాప్ వచ్చాక జీవితం మరింత అన్యాయంగా మారింది’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2009లో తొలిసారిగా సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాను.. అంతకు ముందు ఆరు నెలల పాటు సిరిసిల్ల పట్టణంలో తెల్లవారుజామున 4.30 – 5 గంటలకు విరివిగా తిరిగేవాడు.. ఒకరోజు హైదరాబాద్‌కు వచ్చి పడుకున్నా.. ఫోన్‌ వచ్చింది.

రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్..

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది. కంగనాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రావణ, కుంభకరణ్, మేఘనాథుల దిష్టిబొమ్మలను కంగనా దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎర్రటి చీర కట్టుకుని చాలా అందంగా కనిపించారు.

అయితే, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించింది. రాంలీలా మైదానంలో రావణ దహనంతో పాటు శ్రీరాముడి మహిమను కంగనా కొనియాడింది. ‘శ్రీరాముడు ఉంటే మనం ఉన్నాం.. ఆయనలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు.. మళ్లీ రారు అని చెప్పింది. ఆ తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రావణుడిని దహనం చేశారు. బాణసంచా కాల్చడం నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. రామ్ లీలా మైదానం అంతటా శబ్ధం వినిపించే విధంగా ఎనిమిది ట్రాక్‌ల డిజిటల్‌ డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా బాణాసంచా శబ్దాన్ని రికార్డు చేశారు.

ఢిల్లీలో లాక్ డౌన్ దిశగా అడుగులు.. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు

ఢిల్లీలో పండుగల సీజన్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరింది. ఢిల్లీలో సగటు ఎయిర్‌ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతుంది. అయితే, దీపావళి పండగకి ముందే ఈ పరిస్థితికి వచ్చింది. ఇక, దీపావళి పండుగ తరువాత పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా నమోదు అయింది. ఎస్‌ఏఎఫ్‌ఏఆర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇవాళ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోందని తెలిపింది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని నిపుణులు వెల్లడించారు.