NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

8.5కిలోల బరువు తగ్గిన సీఎం కేజ్రీవాల్.. ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు 8.5 కిలోలు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఐదుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్ 50కి దిగువన పడిపోయింది. సిఎం ఆరోగ్యం ఇంతగా క్షీణించడం కూడా తీవ్ర అనారోగ్యానికి సంకేతమని ఆయన అన్నారు. షుగర్ లెవెల్ ఆకస్మికంగా పడిపోవడం వల్ల కోమాలోకి కూడా వెళ్లవచ్చు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రికి ఒకరోజు ముందు అంటే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరుణంలో సంజయ్ సింగ్ తరపున ఈ వాదన వినిపించింది. అయితే ఆయన బయటకు రాలేకపోయారు. ఎందుకంటే సంబంధిత కేసులో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

వింబుల్డన్‌ కొత్త రాణిగా బార్బోరా క్రెజికోవా!

చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా తొలిసారి వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్‌ పావోలిపై విజయం సాధించింది. దాంతో వింబుల్డన్‌ కొత్త రాణిగా క్రెజికోవా అవతరించింది. విజయం అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన క్రెజికోవా.. కుటుంబ సభ్యులు, కోచ్‌లతో తన సంతోషాన్ని పంచుకుంది.

తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బార్బోరా క్రెజికోవా దూకుడు ప్రదర్శించింది. రెండుసార్లు జాస్మిన్‌ పావోలి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి.. 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో సెట్‌ను 6-2తో సొంతం చేసుకుంది. పావోలిని రెండో సెట్‌లో పుంజుకుంది. డ్రాప్, క్రాస్‌కోర్టు షాట్లతో అలరించింది. అద్భుత ఆటతో 2-6తో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరు గట్టిగా పోరాడారు. ఓ దశలో స్కోరు 3-3తో సమమైంది. ఈ సమయంలో అనవసర తప్పిదాలు చేసిన పావోలి.. మూల్యం చెల్లించుకుంది. 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్రెజికోవా విజేతగా నిలిచింది.

మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…

మాస్ రాజా ర‌వితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్ట‌ర్ బ‌చ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్ట‌ర్ బ‌చ్చన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించడం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో టాప్ లో ట్రేండింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మాస్ రాజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉంటూనే పలు కథలు వింటుంటున్నాడని తెలుస్తోంది. ఆ దశలోనే యంగ్ డైరెక్ట‌ర్ బాబీ చెప్పిన పాయింట్ రవితేజకు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని అన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో గతంలో ‘పవర్’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు రవితేజ. తన సినీ కెరీర్ 75వ సినిమాగా బాబీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది . ప్రస్తుతం బాబీ నందమూరి బాలయ్యతో “వీరమాస్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

పెన్సిల్వేనియా ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు

పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిగ్గరగా తుపాకీ కాల్పులు వినిపించిన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని వేదికపై నుంచి దింపారు. ట్రంప్‌ను సెక్యూరిటీ ఏజెంట్లు చుట్టుముట్టిన వేదిక నుండి బయటకు తీసుకువెళుతున్నప్పుడు.. ఆయన కుడి చెవి చుట్టూ రక్తం కనిపించింది. అయితే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై ముందస్తు దాడులు అమెరికా పౌరుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అర్ధరాత్రి బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్స్ కోల్పోయి మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. భారత్ విజయంలో తెలుగు తేజం అంబటి రాయుడు (50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (30; 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు.

డబ్ల్యూసీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (41; 36 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌. కర్మన్ అక్మల్ (24), సోహైబ్ మక్సూద్ (21), సోహైల్ తన్వీర్ (18), మిస్బా-ఉల్-హక్ (18) పరుగులు చేశారు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్స్ పడగొట్టాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీసారు. ఇర్ఫాన్ మూడు ఓవర్లలో 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్‌ బలగాలు..

గ్రూప్‌-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతొ రాష్ట్రంలోని నిరుద్యోలు అందరూ శనివారం అర్థరాత్రి నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చౌరస్తాలోని రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే రాస్తా రోకో చేపట్టారు.

హైదరాబాద్ లో వారాహి ఆలయం.. విశిష్టత తెలుసా..?

వారాహి నవరాత్రోత్సవాల్లో నేడు చివరి రోజు. వారాహి అమ్మవారి ఆలయాలు ఉండటం చాలా అరుదు. అయితే.. హైదరాబాద్ మొత్తంలో ఒక్కటే వారాహి అమ్మవార దేవాలయం ఉంది. అది కూడా కొత్తపేటలో ఉంది. ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు.. శరభేశ్వరుడు, ప్రత్యంగిర దేవి కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే.. కాశీలో రాత్రుల్లు వారాహి అమ్మవారు తిరుగుతుందని ప్రతీతి. భూ సమస్యలు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో పాటు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారు వారాహి అమ్మవారిని దర్శించుకుంటారని అక్కడి వారి నమ్మకం. అయితే.. కాశీలో వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని వారాహి అమ్మవారి దేవాలయం గురించి చెప్పుకుంటే.. కొత్తపేటలోని రామకృష్ణపరంలో రోడ్ నెం.1లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎలాంటి డోనేషన్లు స్వీకరించరు. దర్శనం పూర్తిగా ఉచితం. ఈ ఆలయంలో వారాహి అమ్మవారికి పుసుపు కొమ్ములతో దండను వేస్తే.. ప్రత్యంగిర అమ్మవారికి ఎండు మిరపకాయలతో దండను వేస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.

రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ‘కాటమయ్య రక్ష’ కిట్లను ప్రారంభం..

ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను నేడు అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం లష్కర్‌‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం సుమారు 60 మంది గీత కార్మికులకు సీఎం చేతుల మీదుగా వీటి పంపిణీ చేయనున్నారు గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

నేడు రికార్డు సంఖ్యలో అమర్ నాథ్ యాత్రికులు బాబా బర్ఫానీని దర్శించుకునే అవకాశం

బాబా బర్ఫానీ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంటున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది. కాగా, శనివారం బాబా ఆస్థానానికి 14200 మంది భక్తులు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు భోలే ముందు నమస్కరించారు. బేస్ క్యాంపు భగవతి నగర్ జమ్మూ నుంచి 183 చిన్న, పెద్ద వాహనాల్లో 4669 మంది భక్తులు కాశ్మీర్‌కు బయలుదేరారు.