Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఈరోజు ముంబైలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 29, 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. అక్కడ రోడ్లు, రైల్వేలు, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీని తర్వాత సాయంత్రం 7 గంటలకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఐఎన్ఎస్ టవర్స్‌ను మోడీ ప్రారంభించనున్నారు.

గాజాలో మారణహోమం.. 70 మందికి పైగా పాలస్తీనియన్లు హత్య

గాజా నగరంలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఆ తర్వాత హమాస్ అధికారి ఇజ్రాయెల్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధమైన మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపించారు. తూర్పు గాజా నగరంలో వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బలగాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు మళ్లించాయని, వారు రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్-తౌబ్తా పేర్కొన్నారు. తల్ అల్-హవా ప్రాంతం నుండి రెస్క్యూ బృందాలు 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 50 మంది తప్పిపోయారని ఆయన వెల్లడించారు. కొంతమంది నిర్వాసితులైన ప్రజలు తెల్ల జెండాలతో ఇజ్రాయెల్ సైన్యం వైపు చూపిస్తూ, మేము పోరాట యోధులం కాదు, మేము బతికేందుకు వలసవచ్చాము అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు ఈ ప్రజలను దారుణంగా చంపేశాయని అల్-తవాబ్తా చెప్పారు.

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రిజిస్టర్ ని బంధించిన విద్యార్థులు..
కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావణం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు బంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో పై పెచ్చులు ఊడి,బాలికలు నిద్రిస్తున్న బెడ్ పై పడటంతో విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటo ఆడుతున్నారని వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్థరాత్రి ధర్నాకు దిగారు. హాస్టల్ నందు సరైన సదుపాయాలు లేవంటూ, పాములు, కుక్కలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన గుడ్లు పెడుతున్నారని, ఎన్నిసార్లు సంబంధించి అధికారులకు చెప్పిన ఇలాంటి స్పందన లేదని విద్యార్థినులు మండిపడ్డారు.


గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల.. కానీ..

ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్‌పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్‌ ఫైల్స్‌పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్‌‌లో జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.‌ ఈ జీపీఎస్‌ కు సంబంధించి జూన్‌ 12న జీవో 54ను విడుదల చేయగా.. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్‌ను శుక్రవారం గెజిట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్‌లో జీపీఎస్‌ గతేడాది అక్టోబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం.

హవాయి ద్వీపం సమీపంలో కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్

టూర్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. పాలి తీరానికి పావు మైలు (0.4 కిలోమీటర్లు) దూరంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోవడాన్ని గురువారం కలలౌ ట్రైల్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు చూసి అగ్నిమాపక దళానికి కాల్ చేసినట్లు కాయై అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాబిన్సన్ R44 హెలికాప్టర్ అలీ కాయై ఎయిర్ టూర్స్, చార్టర్స్‌లో భాగమని అధికారులు తెలిపారు. ఇది విమానం లేదా హెలికాప్టర్ ద్వారా ప్రైవేట్ పర్యటనలను అందిస్తుంది.

ఆరోగ్య శ్రీ ఇకపై ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు’
ఏపీలో ఆరోగ్య శ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న ‘నందమూరి తారక రామారావు వైద్య సేవ’ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మార్చింది. ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది.

నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా

రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం వాదోపవాదనలు, ఆరోపణలతో డైలీ సీరియల్ లా సాగుతోంది. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, డ్రగ్స్ కేసులో ఇరికించి, ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రేలేషన్ లో ఉంటూ, నన్ను దూరం పెట్టాడని, నాకు మిరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య.

కాగా లావణ్య కాల్ చేసి బెదిరిస్తోంది, మా అన్నయ్యకు అసభ్యకరమైన మెసేజ్ లు కాల్స్ చేస్తుందని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు నమోదు చేసింది హీరోయిన్ మాల్వి మల్హోత్రా. మరోవైపు లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది, ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. డబ్బుకోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్.

ఇవాళ సాయంత్రం ముంబైకి సీఎం చంద్రబాబు

నేడు ముంబైకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు ముఖేష్‌ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొననున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నిశ్చితార్థాల అనంతరం ప్రజలతో మమేకమై వారి అభ్యర్థనలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయానికి సీఎం వెళతారు. పల్లా శ్రీనివాసరావు ఇటీవల ప్రభుత్వాన్ని సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన తర్వాత ఈ చర్య వచ్చింది. సాయంత్రం 4:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ముంబైలో రాత్రి బస చేసిన ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

అమెరికా తదుపరి అధ్యక్షురాలిగా కమలా హారిస్..బిడెన్ ఏమన్నారంటే ?

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దేశాన్ని నడిపించే అర్హతను కలిగి ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం అన్నారు. బిడెన్ మాట్లాడుతూ.. మొదటి నుండి ఆమె అధ్యక్షురాలిగా అర్హత కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నేను ఆమెను ఎన్నుకున్నాను. ఈ ప్రకటనకు గల కారణాల గురించి అడిగినప్పుడు.. మొదటిది, ఆమె మహిళా స్వేచ్ఛ సమస్యను నిర్వహించే విధానం.. రెండవది, దాదాపు ఏదైనా సమస్యను పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యం ఆమెకు ఉందని చెప్పారు. హారిస్ (59) 2020 సంవత్సరంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి మహిళ, మొదటి నల్లజాతి అమెరికన్, మొదటి దక్షిణాసియా అమెరికన్.

 

Exit mobile version