NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్కూల్స్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చించనున్నారు సీఎం జగన్‌. ఇదిలా ఉంటే.. నిన్న సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయ్యింది. ఇందులో పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో 3,920 రిజర్వ్‌పోలీసు ఉద్యోగాలు సహా కొత్త మెడికల్‌ కాలేజీలు, వివిధ విద్యాసంస్థలు, ఇతర శాఖల్లో పోస్టుల వంటి ఉన్నాయి.

తీవ్రరూపం దాల్చుతున్న బిపర్‌జోయ్ తుపాన్.. ఐఎండీ వార్నింగ్..!

అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ ఇవాళ (గురువారం) వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావంతో కేరళలో రేపటి నుంచి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అత్యంత తీవ్రమైన తుపాన్ మరింత బలపడి రానున్న మూడు రోజుల్లో ఉత్తర దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొనింది.

భారతదేశం, ఒమన్, ఇరాన్, పాకిస్తాన్‌తో సహా అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది మాత్రం ఇంకా అంచనా వేయలేదు. జూన్ 12వ తేదీ వరకు ఈ తుపాన్ తీవ్రత మరింత పెరుగుతోంది అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు బలపడుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?

పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ సమయంలో పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం రేటు 38 శాతానికి పైగా చేరుకుంది. పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, అది విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోలేకపోతుంది దాంతో పాటు తన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోలేకపోయింది. దీని కోసం పాక్ కొన్ని చర్యలు తీసుకోబోతుంది. దానివల్ల ఆ దేశానికి సంపాదన రాదు.. కాకపోతే దేశంలో పొదుపు చేయగలుగుతుంది.

ఆకలి, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ప్రజలు తమ పరిస్థితిని మెరుగుపరిచే ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆశతో ఉన్నారు. కానీ, ప్రస్తుతం పక్క దేశ రాజకీయ నాయకుల మదిలో ఇంకేదో జరుగుతోంది. పాకిస్థాన్ బ్లాక్‌అవుట్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని కింద పాకిస్థాన్ మార్కెట్లన్నీ రాత్రి 8 గంటల తర్వాత మూసివేయబడతాయి.

డ్రంకె అండ్ డ్రైవ్‌ను తప్పించుకునే ప్రయత్నంలో.. బస్సును ఢీ కొట్టి మృతి..

తెలంగాణాలో ఈ మధ్య వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఈ ప్రమాధాలలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. నిన్న ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది.. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయ్యారు.. ఇక ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.. తాజాగా కరీంనగర్ లో ఘోరం జరిగింది.. పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో యువకుడు బస్సును ఢీ కొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన ఘటన స్థానికంగా కలచి వేసింది..

వివరాల్లోకి వెళితే.. తెలంగాణక రీంనగర్‌లో పోలీసుల డ్రంకెనడ్రైవ్‌ తనిఖీనిలు నిర్వహించారు.. ఈ క్రమంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.. దాంతో వెనకాల వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీ కొట్టాడు.. స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయాడు.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎలువాక శ్రీనివాస్‌(33) కరీంనగర్‌లో వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరి బద్దం ఎల్లారెడ్డి చౌరస్తా సమీపంలో పోలీసులు డ్రంకెనడ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని గమనించాడు. వెంటనే తన బైక్‌ను వెనక్కి మళ్లించాడు..

నా టార్గెట్ విరాట్ కోహ్లీ.. పాక్ యువ బౌలర్ హాట్ కామెంట్స్..

పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు. దాదాపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ కింగ్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో నసీమ్ షా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి ( డకౌట్) అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

భారత్‌తో ఆడేటప్పుడు నా ప్రాణాలను పణంగా పెడతానని.. ఈసారి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే మా అందరి లక్ష్యం అంటూ ప్రకటించాడు. ముఖ్యంగా సున్నాకి ఔట్ చేయాలన్నది నా కల అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీని డకౌట్ అవుట్ చేయడం అంటే.. ఎంతో గర్వించదగ్గ విషయం. అందువల్ల రాబోయే రోజుల్లో కింగ్ కోహ్లీని డకౌట్ చేస్తానని నసీమ్ షా వెల్లడించాడు.

నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్‌.. జడ్చర్లలో 560 డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రారంభం

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మూసాపేట మండలంలోని వేముల, మహబూబ్ నగర్, జడ్చర్లలో మూడు చోట్ల కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్‌తో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొంటారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలో ఏర్పాట్లను పరిశీలించారు.

రేపు, ఎల్లుండి చేప మందు పంపిణీ.. మరో వారం రోజులు ఉండే ఛాన్స్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 34 కౌంటర్లు, 32 క్యూలు సిద్ధం చేసి.. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. శుక్రవారం 9 ఉదయం 8 గంటల నుంచి చేప మందు పంపిణీ ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తెలో బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం తయారీలో అనేక దశలు ఉన్నాయి. ముందుగా దూద్ బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, బావి పూజలు నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులందరూ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇంటి బావిలోని నీళ్లతో ఈ చేప ప్రసాదాన్ని తయారుచేయడం ఆనవాయితీగా వస్తోంది. బత్తిని కులస్తులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్ నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది.