ఒక్క సినిమా ఎనిమిది సార్లు వాయిదా…
దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. భోళా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా తెరకెక్కింది.
పాన్ ఇండియా రేంజులో రూపొందిన ఈ మూవీ గతేడాది జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. అనివార్య కారణాల వలన ఒకటి కాదు రెండు ఏకంగా ఇప్పటివరకూ ఏడు సార్లు మైదాన్ సినిమా వాయిదా పడింది. కొంతమంది సినీ అభిమానులైతే మైదాన్ సినిమాని మర్చిపోయి ఉంటారు కూడా. ఏడు సార్లు వాయిదా వేసిన తర్వాత ఈసారి మైదాన్ సినిమాని గ్యారెంటీగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ‘జూన్ 23’ని కొత్త రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ప్రమోషన్స్ చెయ్యకుండా మేకర్స్ సైలెంట్ గా ఉండడంతో మైదాన్ సినిమా ఎనిమిదో సారి కూడా వాయిదా పడింది అనే మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే మైదాన్ సినిమా థియేటర్ బిజినెస్ కి చాలా నష్టం వస్తుంది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా హైప్ రావడం అయితే కష్టమే.
భూపాలపల్లిలో వింత ఘటన.. ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఉదయం చెలరేగడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో ఇంటి మంటలు చెలరేగాయి దీంతో ఇంటిలో వున్న వారు నిప్పును ఆర్పేశారు. ఏదైన షార్ట్ షర్య్కూట్ అయి ఉంటుందని లైట్ తీసుకున్న కుటుంబ సభ్యులకు మరోరోజు కూడా అంతకుముందు రోజు ఎక్కడైతే మంటలు చలరేగాయో మళ్లీ అక్కడే మంటలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. నాలుగు రోజులుగా మంటలు చెలరేగుతుండంతో ఇక కుటుంబ సభ్యుల్లో భయం మొదలైంది. భయంతో బిక్కు బిక్కు మంటూ ఇంట్లో గడుపుతున్నారు.
నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. మరి ట్రోఫీ ఎవరిదో..?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఇవాళ ఆడుతున్నాయి. మార్చి తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్-16 బిజీలో గడిపిన ఇరు దేశాల క్రికెటర్లు ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఐసీసీ రెండేండ్లకోసారి నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నేటి నుంచి జరుగనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ మైదానం సిద్ధమైంది. మరి ఓవల్‌లో స్టేడియంలో ట్రోఫీ అందుకునేది ఎవరు..? అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
నేడు ములుగులో కేటీఆర్ పర్యటన.. 5 మోడల్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన
నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే 65 కోట్లతో నిర్మించతలపెట్టిన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం, 38.50 కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయ భవనం, 11.40 కోట్లతో మేడారంలో శాశ్వతంగా నిర్మించనున్న భవనాలు, 1.20 కోట్లతో ఆదర్శ బస్టాండుకు, .50 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం ములుగు 2.50 కోట్లతో నిర్మించిన ములుగు పోలీసు స్టేషన్ భవనంతో పాటు జిల్లాలో మొత్తం 12 కోట్లతో వివిధ ప్రాంతాలలో నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్ల భవనాలను ములుగు నుంచే ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రామప్ప చేరుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఇరిగేషన్ డేను పురస్కరించుకొని రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి నేరుగా ములుగు పంచాయతీ వద్దకు చేరుకొని .కోటితో నిర్మించిన శ్మశాన వాటిక, 2 కోట్లతో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లు, జిల్లా రవాణా కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. ఆ తర్వాత ములుగు సమీపంలోని సాధన పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ ప్రపంచంలో ఎంతమందికి కరెంట్, వంటగ్యాస్ లేదో తెలుసా..?
ప్రస్తుత ఈ ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ఎవరైనా ఉంటారా అని మీరు అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి. ఈ ప్రపంచంలోనే దాదాపు 230 కోట్ల మంది వంట చెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని ఈ ఐదు సంస్థలు వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి. ఎంతో టెక్నాలజీతో ప్రపంచం ముందుకు సాగుతుంటే మరి కొన్ని ప్రాంతాలు మాత్రం కనీసం కరెంట్, వంట గ్యాస్ కనెక్షన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెజ్లర్లను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం
రెజ్లర్లపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. అయితే ఈ సారి వారితో కేంద్ర క్రీడా శాఖల మంత్రి చర్చలు జరపనున్నారు. గత శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన అనంతరం రెజ్లర్లు తమ ఆందోళనను విరమించారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తాము తమ నిరసనలను విరమించలేదని.. తమ విధుల్లో చేరామని రెజ్లర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ పేర్కొన్నారు.