స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి
స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
47 కోట్ల విలువ చేసే ఫారిన్ గంజాయి పట్టివేత..
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్ గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుండి ఢిల్లీకి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 47 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్మగ్లర్లు బాగా ప్రణాళికాబద్ధంగా 5 ట్రాలీ బ్యాగ్‌లలో లగేజ్ స్థానంలో గంజాయిని నింపారు. ఆ తర్వాత గంజాయితో కూడిన బ్యాగ్‌లను గ్రీన్ చానెల్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే స్క్రీనింగ్ సమయంలో కస్టమ్స్ అధికారులకు ఇది అనుమానం కలిగించింది.
నేడు కుంభమేళాకు ప్రధాని మోడీ.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శిస్తు్న్నారు. ప్రపంచ దేశాల నుంచి సైతం భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు(ఫిబ్రవరి 5) కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రయాగ్ రాజ్ కు చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రార్థనలు చేస్తారని పీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు కుంభమేళాకు ప్రధాని మోడీ.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శిస్తు్న్నారు. ప్రపంచ దేశాల నుంచి సైతం భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు(ఫిబ్రవరి 5) కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రయాగ్ రాజ్ కు చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రార్థనలు చేస్తారని పీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో వరుసగా విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రకరకాల కారణాల వల్ల మరణించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన చాలామంది ప్రముఖ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.
గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన విడుదల చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది పేర్కొన్నాడు. దీంతో, అతడి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్‌ను హస్తగతం చేసుకుంటుందని తెలిపాడు. గాజాను అమెరికా సొంతం చేసుకున్న తర్వాత అభివృద్ధి చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు.
నేడు బీసీ కులగణనపై పవన్ పాయింట్ ప్రెజెంటేషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. అయితే.. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే.. ఈరోజు సమగ్ర కులగణన సర్వేపైన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొననున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం
హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ కారుకు ప్రమాదం..
భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచ కప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాహుల్ ద్రవిడ్ ప్రయాణిస్తు్న్న కారును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రవిడ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదానికి కారణం.. ద్రవిడ్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా లేదా ఆటో డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు. చిన్న ప్రమాదమే కావడంతో ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలను స్వీకరించాడు. అతని శిక్షణలో జట్టు 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది.
నిజామాబాద్‌లో బర్డ్ ఫ్లూ కలకలం..
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్‌లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం , మంగళవారం రోజుల్లోనే దాదాపు 5 వేల కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీంతో రవికి రూ.7 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తాను భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నట్లు బాధను వ్యక్తం చేశాడు. కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమవుతోందేమో అనే అనుమానంతో, అధికారులను సమాచారం అందజేశారు.