NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..

పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌లో విజయం సాధించి పారిస్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది. ఆమె తన మూడవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా ఈసారి తన అదృష్టం కూడా మారుస్తుందనే ఆశ ఉంది.

మహిళా ఆర్చర్ దీపికా కుమారి కూడా వ్యక్తిగత విభాగంలో సవాల్‌ను ప్రదర్శించనున్నారు. ప్రిక్వార్టర్స్‌లో ఆమె జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌తో తలపడనుంది. అదే సమయంలో మరో మహిళా ఆర్చర్ భజన్ కౌర్ కూడా ప్రిక్వార్టర్‌లో సవాల్‌ విసిరింది. ఈరోజు రాత్రి.. 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో బాక్సర్ నిశాంత్ దేవ్ మార్క్ వెర్డేతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో నిశాంత్ విజయం సాధిస్తే కాంస్య పతకం ఖాయం.

వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విషాదంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. వయనాడ్‌లో ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 100 మందికి పైగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వ ముసాయిదాలో 6 రాష్ట్రాలలో 59940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర ఈఎస్‌ఏ ఎంపిక చేయబడింది. ఇది పశ్చిమ కనుమల్లో దాదాపు 37 శాతం. 2022లో కూడా ఇదే విధమైన డ్రాఫ్ట్ విడుదలైంది. ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లోనే దీన్ని సిఫార్సు చేసింది. 13 ఏళ్ల తర్వాత ఆయన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ నివేదికలో 75 శాతం విస్తీర్ణాన్ని ఈఎస్‌ఏ పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయగా, దానిని 37 శాతానికి తగ్గించారు. ముసాయిదా గడువు ముగియడంతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

శాంతించిన గోదావరి.. నీటిమట్టం 33 అడుగులు

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 33 అడుగులుగా ఉంది. గంటకి ఒక పాయింట్ చొప్పున పది గంటలకు ఒక్క అడుగు గోదావరి నీటిమట్ట తగ్గుతుంది. ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల అదే విధంగా దిగువన వున్న శబరి దగ్గర కూడా వరద లేకపోవడం వల్ల గోదావరిలో నీరు వేగంగా పోలవరం వెళ్తుంది. పోలవరం నుంచి ధవళేశ్వరం. మీదుగా సముద్రం లో కలుస్తోంది.. గత నెల 21వ తారీకు నుంచి గోదావరి పెరగటం ప్రారంభించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదలు వస్తుంటాయి. అయితే ఆగస్టులోనే ఎక్కువగా గోదావరి వరదలు వస్తుంటాయి ..కానీ ఈసారి జూలై నెలలో వరదలు వచ్చాయి. గత నెల 23వ తేదీన 51.5 అడుగులకు వచ్చిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 44 అడుగుల దగ్గర ఉండి మళ్లీ పెరిగింది 53.9 అడుగులకి గోదావరి పెరిగింది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. 43 అడుగుల చేరుకుంటే మొదటి ప్రమాదం జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక కి ఇంకా 10 అడుగుల దూరంలో ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం ఉంది.

నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10-30 గంటలకు చింతక్ చేరుకుని రైతువేదికలో జిల్లా అధికారులతో దళిత బంధు కార్యక్రమం అమలు తీరును సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటలకు ముదిగొండ మండలం కమలాపురం నుంచి పమ్మి, జిల్లెలగూడ, అయ్యగారిపల్లి, అమ్మపేట, అయ్యగారిపల్లి నుంచి బాణాపురం తండా, ఎస్సీ కాలనీ నుంచి వెంకటాద్రి చెరువు వరకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4-30 గంటలకు పమ్మిలో విద్యుత్ ఉపకేంద్రాన్ని భట్టి ప్రారంభిస్తారు.

అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఆప్కాబ్‌ సమావేశం

మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు.

నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటన

నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటించనున్నారు. ఐకానిక్‌ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత రానుంది. అయితే.. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. విభాగాధిపతుల బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పు పట్టి, స్తంభాలు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్ఠతను అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్‌-డిస్ట్రక్టివ్, కోర్‌ కటింగ్‌ పరీక్షలు నిర్వహించాలని సీఆర్డీఏ (CRDA) అధికారులకు నిపుణులు సూచించారు.

అల్ జజీరా జర్నలిస్టుని చంపిన ఇజ్రాయిల్.. హమాస్‌కి సాయం చేస్తున్నాడని ఆరోపణ..

ఇజ్రాయిల్ వరసగా తన శత్రువల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రతలో ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. తామే చేశామని చెప్పుకోకున్నా, ఇరాన్‌తో పాటు హమాస్ ఇది ఇజ్రాయిల్ పనే అని ఆరోపిస్తున్నాయి. మరోవైపు లెబనాన్ బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఎయిర్ స్ట్రైక్స్‌లో హతం చేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. అక్టోబర్ 07 నాటి దాడికి ప్రధాన సూత్రధారి అయిన మహ్మద్ డెయిఫ్‌ని కూడా చంపేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రముఖ వార్త సంస్థ అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్ ఘౌల్‌ని వైమానికి దాడిలో చంపినట్లు ఇజ్రాయిల్ గురువారం ధ్రువీకరించింది. తమ పాత్రికేయుడిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందని అల్ జజీరా ఆరోపించినప్పటికీ, ఇవి నిరాధార ఆరోపణలని ఇజ్రాయిల్ కొట్టిపారేసింది. ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07న జరిగిన దాడిలో జర్నలిస్ట్ ఇస్మాయిల్ సహకరించినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ఎలైట్ నుఖ్బా యూనిట్‌లో అల్-ఘౌల్ సభ్యుడు అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ కార్యకలాపాలను ఎలా రికార్డ్ చేయాలో మిలిటెంట్లకు సూచించాడని చెప్పింది. ఇజ్రాయిల్ దళాలపై దాడులు రికార్డ్ చేయడం, ప్రచారం చేయడంలో అతను పాల్గొన్నట్లు పేర్కొంది. ఇతడి చర్యలు హమాస్ కార్యకలాపాల్లో ముఖ్యభాగం అని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది.

భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రాత్మక విజయం.. క్వార్టర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్

లక్ష్య సేన్ బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా లక్ష్య సేన్ నిలిచాడు. లక్ష్య 19-21, 21-15, 21-12తో తైవాన్‌కు చెందిన చు టిన్ చెన్‌పై విజయం సాధించాడు. భారత బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం సాధించాడు. క్వార్టర్-ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చు టిన్ చెన్‌పై మూడు గేమ్‌ల ఉత్కంఠభరితమైన గెలుపు పొందాడు. సేన్ ఇంతకు ముందు ఏ భారతీయ పురుష షట్లర్ చేరుకోని మైలురాయిని చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష షట్లర్‌గా లక్ష్య ఇప్పుడు నిలిచాడు. ఇప్పుడు అతను పతకానికి కేవలం ఒక గెలుపు దూరంలో ఉన్నాడు. లక్ష్య కంటే ముందు కిదాంబి శ్రీకాంత్ (2016), పారుపల్లి కశ్యప్ (2012) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పారిస్‌ నుంచి బ్యాడ్మింటన్‌ పతకంపై భారత్‌కు సేన్‌ మాత్రమే ఆశ ఉంది.

ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా.. మిడిల్‌ఈస్ట్‌కి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్..

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటం, హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతల్ని పెంచింది. ఇరాన్ గడ్డపై హనియే హత్యచేయబడటంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. అయితే, హనియే హత్యపై ఇప్పటికీ ఇజ్రాయిల్ సైలెంట్‌గానే ఉంది. ఇరాన్‌తో పాటు హమాస్ మాత్రం ఇది ఇజ్రాయిల్ చేసిన హత్యే అని ఆరోపిస్తున్నాయి. దీనికి ఇజ్రాయిల్‌పై తప్పక ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన సైన్యాన్ని ఇజ్రాయిల్‌పై దాడికి ఆదేశించినట్లు వార్తలు వెలువతున్నాయి.