ఎయిర్ పోర్ట్ వెళ్ళే వారు అలర్ట్.. టికెట్ చూపిస్తేనే ఓఆర్ఆర్ పైకి అనుమతి
ఎయిర్ పోర్ట్ వెళ్ళే వారు టికెట్ చూపించి ఓఆర్ఆర్ లో వెళ్ళాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే వారు…నిబంధనలకు లోబడి చేసుకోవాలన్నారు. ప్రజలు సురక్షితంగా, కుటుంబ సభ్యుల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్లేస్ లలో సంబరాలు చేసుకునే వారు… చట్టానికి లోబడి చేసుకోవాలన్నారు. ఈ రాత్రి నుండి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు వుంటాయని క్లారిటీ ఇచ్చారు. ఫ్లైఓవర్ లు మూసివేస్తాము..ఓఆర్ఎస్ కూడా మూసి వేస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ వెళ్ళే వారు టికెట్ చూపించి ఓఆర్ఆర్ లో వెళ్ళాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తామన్నారు. బైక్ లపై ఫీట్ లు చేస్తూ..ప్రజలకు అసౌకర్యం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరిస్తామన్నారు.
శంషాబాద్ లో దారుణం.. బండరాళ్లతో మోదీ యువకుడి హత్య
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సీమియాగుడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్ళతో మోది హతమర్చారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద దొరికిన ఓ భ్యాగ్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకున్నారు. హత్యకు గురైన యువకుడు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గా గుర్తించారు. కొన్నాల క్రితం భార్య వదిలిపెట్టడంతో శంషాబాద్ ప్రాంతానికి వచ్చి అడ్డాకులిగా మారాడు. అయితే అప్పుడప్పుడు ఝాన్సీమియా కూడా వద్ద ఉన్న టెంట్ హౌస్ లో పనిచేసే పక్కనే ఉన్న ఓ గుడిలో తల దాచుకునేవాడు. అయితే రాత్రి ఘాన్సీమియా గుడా వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన హత్యకు గురై పడి ఉన్నాడు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల సాంగ్ రిలీజ్ చేసిన జీవి ప్రకాష్ కుమార్
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేస్ పూర్తిచేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీ గా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్.. హై అలర్ట్‌లో ముంబై!
ముంబై నగరంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలోని పలు చోట్ల బాంబులు పేలుతాయని ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టినా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతం ముంబై నగరం మొత్తం హై అలర్ట్‌లో ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్న ముంబై ప్రజలను ఈ వార్త వణికిస్తోంది.
వివరాల ప్రకారం… ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి శనివారం సాయంత్రం 6 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ ముంబైలోని పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పి.. కాల్ కట్ చేశాడు. దీంతో నగర పోలీసులు వేంటనే అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టారు. పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల వేళ ముంబై మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు.
జనవరి 22న ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి..
ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన కి బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమాంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశానికి ముఖ్యమైనటువంటి సంవత్సరం అన్నారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి ప్రధాని మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టను పెంచేలా అనేక చర్యలు చేపడుతూ..పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే.. ఆరు గ్యారెంటీ ల పరిస్థితి ఏంటి ?.. హరీష్ రావ్ ప్రశ్న..
పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తె ఆరు గ్యారెంటీ ల అమలు పరిస్థితి ఎంటి ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీ లలో మొత్తం 13 హామీలు ఉన్నాయని, ఇప్పటికీ 2 హామీలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ల అమలు కోసం మార్గదర్శకాలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరి మూడవ వారం లోపు అరు గ్యారెంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉన్నట్టు లేక పోతే ఎగవేసే ప్రయత్నంగా చూడల్సి ఉంటుందన్నారు. వడ్లకి బోనస్ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు గైడ్ లైన్స్ ఇస్తే యసంఘి లో అయిన రైతులకు లబ్ధి అవుతుందన్నారు. రైతు బంధు నిధుల విషయములో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదన్నారు. దాటవేత, ఎగవేత, కోతలకు కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి చేస్తామని, తొందర ఎందుకు అని కాంగ్రెస్ అంటుందని తెలిపారు.
థానేలో రేవ్ పార్టీ.. న్యూ ఇయర్ వేడుకల్లో 100 మంది అరెస్ట్..
న్యూ ఇయర్‌కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో యువత కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాలని ప్లాన్స్ చేసుకుంది. అయితే కొందరు మాత్రం డ్రగ్స్, రేవ్ పార్టీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర థానే నగరంలో రేవ్ పార్టీపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో ఏకంగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లు భావిస్తున్నారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. అసంతృప్తి చెందే ఎమ్మెల్యేలకు ఎంపీ హితబోధ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద భరత్ మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకు రాగా ఈ విధంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడూ ఒకటేనని.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలని, అందుకోసం ప్రజల మనసు గెలుచుకోవాలని పదేపదే చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రధాని రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్‌లో జీవితం ప్రారంభించిన ప్రధాని మోడీ రైల్వేల రూపురేఖలు మారుస్తున్నారని అన్నారు. మూడు వందేభారత్ ట్రైన్లు మన రాష్ర్టంలో సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగే 32 స్టాప్స్ ఏపీలోనే 14 ఉన్నాయన్నారు. పేదల కోసం నరేంద్ర మోడీ ఆలోచిస్తారన్నది మరోసారి రుజువైందన్నారు. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి, తక్కువ రుసుముతో అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంచారన్నారు. అమృత్ భారత్ అధునాతన సర్వీసులు ఇవ్వాలని ఉద్దేశంతో అమృత్ భారత్ ట్రైన్ సామాన్యులు, పేదలది అని ఎంపీ జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.
రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు
రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్‌లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన గ్రామాల ప్రజలు అభిప్రయాలు తీసుకోకుండా మంద బలం తో మున్సిలిపల్ లో కలిపారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విలీన గ్రామాల కలిపి వారు ఉపాధి కోల్పోయిన వారికి ఎం సమాధానం ఇస్తారని, విలీన గ్రామాల నుండి ఇద్దరు చనిపోయిన కూడా వారి కి కనీసం వారిని పరామర్శించలేదన్నారు. చనిపోయిన ఇద్దరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, గత ఎన్నికల్లో నేను హామీ ఇచ్చినా తర్వాత మున్సిపల్ లో తీర్మానం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన హైదరాబాద్
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. సిటీ లో భారీగా ఈవెంట్స్ , పార్టీ లు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించడానికి యువత రెడీ అయ్యింది. రాత్రి 1 గంటల వరకే వేడుకలు చేయాలనీ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. తాగి మద్యం వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు హైదరాబాద్ లో అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసుల సూచించారు. పార్టీల్లో డ్రగ్స్ మాట వినపడితే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
క్రికెట్ ఆడుతుంటే యువకుడికి గుండె పోటు, మృతి
ఇటీవల కాలంలో చిన్న పిల్లాడి నుంచి యువకుల వరకు పలువురు అకస్మాత్తు గుండెపోటుల వల్ల మరణిస్తున్నారు. 30 ఏళ్లకు దిగువన ఉండే యువకులు కూడా ఇలా ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించాడు. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో 22 ఏళ్ల ఇందల్ సింగ్ జాదవ్ బంజారా గుండెపోటుకు గురై మరణించాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
