NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్.

మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను షేర్ చేశారు. పోలీసు దుర్వినియోగానికి ఇదో చక్కటి ఉదాహరణ అని అన్నారు. ఇది అత్యంత అవమానకరమని కూడా ఆయన అభివర్ణించారు. ఇంతకు ముందు కూడా, ఫిబ్రవరిలో గైక్వాడ్ పులిని చంపినట్లు 1987లో చెప్పి ఇబ్బందుల్లో పడింది. మెడలో దంతాన్ని కూడా వేసుకున్నట్లు చెప్పారు.

సీఎం రేవంత్‌ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్‌ కు జగ్గారెడ్డి సూచన

సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటన చేస్తే.. వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని మండిపడ్డారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే.. మాకెందుకు అధికారం ఇస్తారు ప్రజలు అని తెలిపారు. సీఎం రేవంత్… కేసీఆర్ నీ అసెంబ్లీ కి రండి.. మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారు.. అయినా రాలేదన్నారు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పెడితే… ప్రతిపక్ష నాయకుడు వస్తారు.. సీఎంలు సరిగా రారన్నారు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్… ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలి అని ప్రతిపక్ష నాయకుడు అడగాలి.. కానీ సీఎం అసెంబ్లీ పెట్టీ ప్రతిపక్ష నాయకుడి నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..

బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కి ఎందుకు మినహాయింపు… చెరువులో కట్టామని ఆయన ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొత్త తరం రావాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. MIM పార్టీ పీడ విరగడ కావాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలన్నారు.

ఎద్దును కాపాడే ప్రయత్నంలో ఘోరం.. బస్సు అదుపు తప్పి బోల్తా..

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. ఎద్దును కాపాడే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. షాజహాన్‌ పూర్‌ జిల్లా సీతాపూర్‌ నుంచి హరిద్వార్‌ కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు జాతీయ రహదారిపై ఎద్దును కాపాడే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. వారందరికి చికిత్స జరుగుతోంది. దీని గురించి సమాచారం ఇస్తూ పోలీస్ ఏరియా ఆఫీసర్ సౌమ్య పాండే మాట్లాడుతూ.., సీతాపూర్ నుండి ఒక బస్సు ప్రయాణికులతో హరిద్వార్‌కు వెళుతోందని తెలిపారు. గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఠాణా రామచంద్ర మిషన్ ప్రాంతంలోని హైవేపైకి బస్సు చేరుకోగా ఒక్కసారిగా ఎద్దు బస్సు ఎదురుగా వచ్చింది.

పాకిస్తాన్‌తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్‌మెంట్..

జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ వారంలో భారత్‌పై ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

‘‘ ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించినంత వరకు, ఆర్టికల్ 370 పూర్తయింది. కాబట్టి, మేము పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాల గురించి ఆలోచించగలము అనేది సమస్య’’ అని ఈ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో భారత్ వ్యవహరించే తీరులో నిష్క్రియంగా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పదలుచుకున్నది ఏమిటంట, మనం నిష్క్రియంగా లేము, ఎదైనా సంఘటన ప్రతికూల లేదా సానుకూల దిశలో ఉన్నా కూడా మేము స్పందిస్తాము’’ అని అన్నారు.

గుజరాత్ సమీపంలో తీవ్ర అల్పపీడనం.. 6 గంటల్లో తుఫాన్‌‌గా మారే ఛాన్స్

ఆరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాన్ ఏర్పడబోతుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం మరియు ఈశాన్య ఆరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని.. అది కాస్తా 6 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని.. రెండు రోజుల్లో తీరం దాటనుందని వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రాలను ఐఎండీ అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లు, రోడ్లు ఏకమైపోయాయి. అలాగే నదుల్లోంచి మొసళ్లు జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. సముద్రంలో భారీగా అలలు వస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించారు. ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను..

తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు. తనపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారడం లేదని చాలా సార్లు చెప్పానని.. అయినా ఇలా చేస్తున్నారు.. బాధేస్తుందన్నారు. 2019లో ఓటమి పాలయినా జగన్ తను మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే మనిషిని తాను కాదన్నారు.

గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవడమే కాదు

గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్‌. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు షేర్ తేడా కేవలం 4 శాతం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పెట్టిన ఎఫర్ట్ పెట్టాలని, అన్ని లోకల్ బాడీ ఎన్నికల ప్రాధాన్యత గుర్తించాలన్నారు. కేసీఆర్ చీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టింది… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో చీ కొట్టించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణా ప్రజల విశ్వాసం కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారని, తాత్కాలికంగా విజయం సాధించవచ్చన్నారు ఈటల రాజేందర్‌.

గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన.. కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి

కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో… నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.