Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..!

రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. నేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు జ్యోతి రావు ఫులే గారిని గుర్తు చేశారా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిని కూడా తీర్థ యాత్ర చేసినట్టుగా ఉంది కేటీఆర్ మాట్లాడినతిరు అలాంటి మాటలు మాట్లాడాడని హెచ్చరించారు.

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. వార్షిక బడ్జెట్ కి ఆమోదం..

టీటీడీ పాలకమండలి నిర్ణయాలను చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5141 కోట్ల రూపాయల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ 15 వేల రూపాయలు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 వేల నుంచి 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపింది.

కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడు.. కేటీఆర్ కు కోమటిరెడ్డి సెటైర్

కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడని ఎమ్మెల్యే కేటీఆర్ కు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. యాదాద్రి జిల్లా పర్యటించిన ఆయన కేటీఆర్ మాటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటికి సరిపోవడని అంటావా? అంటూ మండిపడ్డారు. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండపెట్టాడని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మూడవరోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు.. మీరెప్పుడైనా మాట్లాడారా? ప్రశ్నించారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే, మిమ్మల్ని తొక్కితే 50 వేల ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు అది గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు. జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి.. అంచలంచలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. కొండమాడుగు లో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!

కేఎల్‌పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.

పార్లర్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్..

బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మోసం చేసి మూడు కోట్ల వసూళ్లు చేసి ఉడాయించారు కిలాడి దంపతులు. దీంతో ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా కలిసి.. నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో కోసం యూ ట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునే విధింగా యాడ్స్ చేసి, ఎక్కువ డబ్బు వస్తుందని వారిని నమ్మించారు. ఆ యాడ్స్ చూసిన బాధితులు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ వారికి కాంటాక్ట్ అయ్యారు. వారి వలలో పడ్డ వారిని మిస్ అవకుండా రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ డబ్బుల వల వేశారు. దీంతో ఆ వలలో చిక్కుకున్న కస్టమర్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు.

రేవంత్ దగ్గరికి వెళ్ళి ఏ మొఖం పెట్టుకుని అడగాలి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఒక వేల గెలిచి ఉంటే సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి సంగారెడ్డిలో అభివృద్ధి కోసం నాకు ఇన్ని కోట్లు కావాలని నేరుగా అడిగేవాడిని అని.. కానీ ఇప్పుడు ఏ మొఖం పెట్టి అడుగుతాను ఆలోచన చేయండని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఉదేశించి చెప్పిన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్, ప్రింట్ & ఎలక్టనిక్ మీడియాలో రావడం జరిగిందన్నారు. ఐతే అవి నేను చెప్పిన్నట్లు చెప్పను అలాగని చెప్పలేదు అని చెప్పనన్నారు. ఎందుకంటే వార్తలు వచ్చాయి అది ఐపోయిందన్నారు. నాకు ఓటు వేసిన డెబ్భైవేల మందికి నేను జవాబు దారిగానే ఉంటానని తెలిపారు. జగ్గారెడ్డి చెప్పింది నాకు ఓటు వేయని 80 వేల మంది ఆలోచన చేయాలనీ మాత్రమే చెప్తున్నా అన్నారు. ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా,3 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు, రెండు సార్లు ఓడిపోయినా అన్నారు. ఐన ఈ 70 వేల మంది నాకు ప్రతి ఎన్నికలో ఓట్లు వేస్తూనే వచ్చారని తెలిపారు. నాకు ఓట్లు వేసిన ఈ 70వేల మందికి నేను ఓడిపోయినా ఎప్పుడు జవాబు దారిగానే ఉంటా అని తెలిపారు.

రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం

రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆసరా ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. నాలుగో విడత ఆసరా చెక్కులను అందజేశారు. అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాసులు, కమిషనర్ రవీంద్ర, డీఎల్డీఓ సాయికుమార్, కౌన్సిలర్లు దొడ్డ భాగ్యలక్ష్మి, హర్షిత, కోఆప్షన్ మెంబర్‌ వనజాక్షి, నాయకులు శ్రీనివాసులు, ఉత్తమ్, కాటమయ్య, బాషా, మెప్మా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. ఈ రాజ్యసభ స్థానాలకు చెందిన 50 మంది సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా, ఆరుగురు ఏప్రిల్ 3న పదవీ విరమణ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.

వివరణ ఇవ్వడానికి స్పీకర్ను 4 వారాల సమయం కోరాం..

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా విచారణలో ఉండాలని తాను స్పీకర్ ని కోరినట్లు తెలిపారు.

స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మంత్రి ఆకస్మిక తనిఖీ

సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ ను కలియ తిరిగి ఫైళ్ళను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అగిడి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారి పై కఠిన చర్యలుంటాయని మంత్రి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.

‘రా కదలిరా’ సభలో గందరగోళం.. కిందపడబోయిన చంద్రబాబు

‘రా కదలిరా’ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో స్టేజీపై నుండి పడబోయిన చంద్రబాబును సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులో ‘రా కదలిరా’ సభ నిర్వహించారు. అయితే రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడంపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్టేజిపై నుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే ప్రక్కనే ఉన్న అతని సెక్యూరిటీ సిబ్బంది కిందపడకుండ పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో.. జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

రాహుల్‌ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర

రాహుల్‌ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు బీజేపీ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఫిల్మ్ థియేటర్ లలో రిలీజ్ కు రెడీ కాలేదని, హోటల్ లకు, వర్చువల్ మీటింగ్ లకే పరిమితం అయిందన్నారు. కూటమి ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభ పెట్టలేదన్నారు మురళీధర్‌ రావు. అంతేకాకుండా.. ఏ అంశం లోనూ వారు ఏకాభిప్రాయం కి రాలేదని, రాహుల్ పశ్చిమ బెంగాల్ లోకి ఎంటర్ అయ్యే నాటికి మమత బెనర్జీ పొత్తు లేదని స్పష్టం చేసిందన్నారు. ఆమె కాంగ్రెస్ నేతలకు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూటమి ఫెయిల్ అయింది… కూటమి లేదని, రాహుల్ గాంధీ నాయకత్వం లో కూటమి సాధ్యం కాదన్నారు మురళీధర్‌ రావు. జనవరి ఒకటి వరకు సీట్ల షేరింగ్ ప్రకటిస్తామని చెప్పారు .. ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version