NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ

అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్‌.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు నారా లోకేష్… శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్ లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి, పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషిచేస్తున్నట్లు తెలిపారు.

అధికారం పోయేసరికి కేటీఆర్, హరీష్ రావుకు మెంటల్ ఎక్కింది

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండిపాలెం బ్యాచ్ అయ్యింది అని విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావులకు పిచ్చిపట్టినట్లుంది.. అధికారం పోయేసరికి కేటీఆర్, హరీశ్ కి మెంటల్ ఎక్కిందని మండిపడ్డారు. ఇంకా నాలుగు ఏండ్లు ఎప్పుడు అయిపోతుందాని ఎదురు చూస్తున్నారు.. కాంగ్రెస్ నీ సీఎంనీ ఎప్పుడు బద్నాం చేద్దామాని చూస్తున్నారు.. మేము అనని మాటలు అంటే కోపం రాదా.. బెవకూఫ్ చేతలు చేయొద్దు అని చెప్తున్నా.. నాకు కోపం వచ్చి కేటీఆర్, హరీష్, కేసీఆర్ నీ తిట్టనా అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ పాగల్ గాండ్లు అయ్యారా? అని ప్రశ్నించారు. అమెరికాలో ఉండి కేటీఆర్ ఫోటోలు పెట్టీ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు.. కేటీఆర్ ఇది పద్దతి కాదు అని జగ్గారెడ్డి అన్నారు.

హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది..

ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్, ముషీరాబాద్ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ విషయంలో హైలేవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేసి నగరాన్ని రక్షించాలని సీఎం రేవంత్ ను కోరుతున్నాను.. దురదృష్టవశాత్తు గత కొన్నిరోజులుగా క్రాంటాక్టర్లకు బిల్లులు రావడం లేదు.. మంజూరు అయిన పనులకు టెండర్లను పిలిస్తే క్రాంటాక్లర్లు ముందుకు రావడం లేదు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.. చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ ఉంది.. ఇంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు

పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం.. పార్టీలో అవసరమైన మార్పులు చేర్పులు జగన్ దృష్టికి తీసుకుని వెళ్తాం.. పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని తెలిపారు.

దుండిగల్లో అసైన్డ్ భూముల ఆందోళన.. అధికారులపై ఎంపీ ఈటల ఫైర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 453, 454 లలో ఉన్న లవాణి పట్టా 450 ఎకరాల భూమిలో కొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్స్ నిర్మించారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. తెలియడంతో అక్కడికి వెళ్ళిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులకు అండగా నిలిచారు.

తెలుగుదేశం ఓ రాజకీయ వర్సిటీ.. నేటితరం నేతల మూలాలు టీడీపీలోనే..

తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం.. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి అన్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది.. కానీ, పార్టీ శాశ్వతంగా ఉంటుందన్నారు.. తెలుగుదేశం పార్టీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనది.. తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందన్నారు.. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీఠ వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం.. యువతను ప్రోత్సహిస్తూ, పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ ఇది.. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద భీమా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం.. ఈ వినూత్న ఆలోచనకు లోకేష్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారని తెలిపారు.

క్రమశిక్షణగల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదు

తెలంగాణలో పోలీసుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బెటాలియన్‌ పోలీసులు సీఎం రేవంత్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే స్పెషల్ పోలీసుల ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్‌ రెడ్డి స్పందించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో ఆందోళన చేసినవారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. మళ్లీ ఆందోళనలకు దిగడంపై పోలీస్‌శాఖ సీరియస్ అయ్యింది. పోలీస్‌ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని డీజీపీ తెలిపారు.

మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తాం

హైటెక్స్‌లో NEREDCO ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో.. జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాము.. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే అని ఆయన అన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని, కాలుష్య డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు 39 ఎస్టీపీలు మంజూరు చేశామని ఆయన అన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

పరిగిలో 6 ఫేక్‌ క్లినిక్‌లను సీజ్‌ చేసిన అధికారులు

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నకిలీ క్లినిక్‌లలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ఆరు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్, పల్లవి క్లినిక్ ల సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యా అర్హత లేకుండా ఎంబిబిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్.ఎం.ఎల్ యాక్ట్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి FIR తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఒక్కో క్లినిక్ లో 8 నుంచి 10 బెడ్లు వేసి క్లినిక్లు నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. 3

స్టార్ హీరోతో పెళ్లిపై ప్రియాంక మోహన్ క్లారిటీ

కొద్ది రోజుల క్రితం జయం రవి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. అయితే ఈ విడాకుల వ్యవహారం అనేక చర్చలకు తావిస్తోంది. ఇది ఇలా ఉండగానే జయం రవితో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ పక్కన నిలబడి ఉండగా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అతి ఉత్సాహంతో వారిద్దరికీ వివాహం అంటూ కూడా వార్తలు వండి వడ్డించారు. అయితే నిజానికి వీరిద్దరూ కలిసి బ్రదర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఒక సినిమా ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ ఫోటో చూసి తాము వివాహం చేసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆమె వెల్లడించింది.