Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే.. రాహుల్‌ ప్రధాని కావాలి..

రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడోలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరని అన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళును మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయం చేస్తోంది బీజేపీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడి కట్టండి.. దేవుడి గుడి కూడా రాజకీయానికి వాడుకోవాలని బీజేపీ చేస్తోందని అన్నారు. ఎమోషన్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపి అన్నారు.

30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశా.. అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ..!

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించారు.. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉంటూ.. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానన్న ఆయన.. స్థానికుడైన తనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అన్నారు.. టిక్కెట్ కోసంఅడిగే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. హిందూపురం పోటీ చేయాలన్న ఆ ఆలోచనను.. నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. అయితే, నేను పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానం ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే, పొత్తులు కుదరకపోయినా.. మీరు బీజేపీ అభ్యర్థిగా.. ఒంటరిగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. మా అభిప్రాయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాం.. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు విష్ణువర్ధన్‌రెడ్డి.

నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నా.. నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా..!

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజక వర్గంలోని కొండపేటలోని చార్‌ కమాన్ మస్జీద్ కి సంబందించి, అసంపూర్తిగా ఉన్న కాంప్లెక్స్‌ ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, బీసీ రాజారెడ్డి గార్ల సహకారంతో 3 లక్షల రూపాయల సొంత నిధులతో 3 గదుల కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. కొందరు కావాలనే నాపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. నా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.

35 ఏళ్లుగా కుప్పానికే ఏమీచేయని వ్యక్తి.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?

35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పం కు తీసుకురావడం ఎంతో సంతోషం.. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించల్సిన సందర్భం.. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు చేశారు.. నేను ఇది వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను.. మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అన్నారు.

డబ్బు కోసం పవన్ ఆ పని కూడా చేయనున్నాడట.. ?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. దాన్ని ఎవరు పాటించినా పాటించకపోయినా.. సెలబ్రిటీలు మాత్రం కచ్చితంగా పాటిస్తారు. అసలే ఇండస్ట్రీ.. ఎవరిని లేపుతుందో.. ఎవరిని ముంచుతుందో చెప్పలేం. అందుకే నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఒక సినిమా హిట్ అవ్వడం ఆలస్యం.. వెంటనే ప్రొడక్స్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ లుగా మారి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక్క యాడ్ కు కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న స్టార్ సెలబ్రిటీలు అందరూ యాడ్స్ చేస్తున్నవారే. మొన్నటివరకు బాలకృష్ణ ఒక్కడే యాడ్ చేయలేదని చెప్పుకొచ్చేవారు.. కానీ, ఈ మధ్య బాలయ్య సైతం యాడ్స్ చేస్తూ సంపాదిస్తున్నాడు.

రానున్న ఎన్నికల్లో మోడీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం

బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్, ఎర్రగడ్డ మీదుగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అమీట్ పేట్ లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్ నగర్‌కు రావడం జరిగిందన్నారు కిషన్‌ రెడ్డి. ఎవరూ ప్రధాని కావాలి? ఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని, మూడో సారి మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు అకాక్షింస్తున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు. మోడీ పాలనలో అనేక సంస్కరణలు జరిగాయని, రాష్ట్రంలో కూడా బేగంపేట రైల్వే స్టెషన్ పునరుద్దరణ పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారన్నారు.

రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయింది

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లు రోజుకు డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయిందని, లిక్కర్ డ్రామా లో బిజెపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. మోడీ, అమిత్ షా ల ముద్దు బిడ్డ కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పార్టీలపై నేతలపై దాడి చేస్తుంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. ప్రతిదీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నమని, బీజేపీతో జోడీ కట్టి బీఆర్‌ఎస్‌ అంతర్థానం అయ్యే పరిస్ఠితి వచ్చిందన్నారు దయాకర్‌ రావు. కవిత రూపంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీ బెదిరిస్తుందన్నారు. కవితకు నోటీసులు ఇస్తున్నారు కరెక్టేనని, ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ను కేసు నుంచి తప్పించారన్నారు. మా అలయెన్స్ ను విచ్ఛిన్నం చేసే కుట్ర బిజెపి చేస్తోందన్నారు. కవితకు నోటీసు ఇచ్చారని, అయితే కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ బలపడేందుకు కుట్ర చేస్తున్నారని, కవిత అరెస్ట్ పేరుతో గతంలోనూ హైడ్రామా చేశారన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కు అనుకూలంగా ఉంటారు.

రమణ దీక్షితులుపై టీటీడీ వేటు..

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయించినట్లు చైర్మన్‌ భూమన తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తా

సముద్రంలో ఈత కొట్టే సమయం ఉంది మోడీకి కానీ.. మణిపూర్ వెళ్లే సమయం మాత్రం లేదని మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడి మీ అయ్య జాగిరా అంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని కూడా గుడిలోకి పోకుండా అడ్డుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఖమ్మం నుండి పోటీ చేస్తానని, అక్కడి సమస్యలపై కోట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన రైతులకు సాయం చేసిన అని ఆయన తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీసీ లకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు న్యాయం చేయాలన్నారు వీహెచ్‌. బీసీ కులగణన అన్నారు..బీసీలకు టికెట్ ఇవ్వారా..? బీసీలు ఓట్లు వేసి యంత్రాలమా..? అని ఆయన ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఏం కావాలి అని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది అని అందరు వచ్చి చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్..నేను తప్పా రాష్ట్రం అంతా తిరిగినమని, చాలా మందిని నేను నాయకుల ను తయారు చేసిన అని, పాపులారిటీ లో.. రేవంత్ తర్వాత నేనే అని ఆయన అన్నారు.

ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత

అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ వేదికగా అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్ కు వచ్చిన మంత్రికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎం.సీ. పర్గెయిన్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, అన్ని జిల్లాలకు చెందిన కన్జర్వేటర్లు, అటవీ అధికారులు హాజరయ్యారు.

పల్నాడులో కాక రేపుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలు నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి. స్థాన బదిలీలు, కొత్త కొత్త అభ్యర్థుల పేర్ల పరిశీలనతో జరుగుతున్న సర్వేల నేపథ్యంలో పల్నాడు టీడీపీ క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతో పాటు, నరసరావుపేట, గురజాల అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ సీనియర్ నాయకులు పేర్లను అభ్యర్థులుగా పెట్టబోతున్నాం అని సర్వేల ద్వారా పరిశీలిస్తుంది టీడీపీ.

 

Exit mobile version