చెట్టును ఢీకొట్టిన పెళ్లి బస్సు.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్‌రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వారు వెల్లడించారు. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన మోటార్‌బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమిక విచారణలో సూచించినట్లు మాడా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కపూర్ త్రిపాఠి తెలిపారు. వధువుతో పాటు వరుడి తరపు సభ్యులతో వెళ్తున్న బస్సు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని ధారి గ్రామం వద్ద రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. వివాహం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మాణిక్ కేస్ బియార్ (45), ఉమర్ కేస్ బింద్ (35), భాయ్ లాల్ బియార్ (50) అనే ముగ్గురు వ్యక్తులు – ముందు వరుసలో కూర్చున్న వారు అక్కడికక్కడే మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
జేసీ లా కాలేజీలో విద్యార్ధినులపై కీచక పర్వం
కామాంధులు రోజు రోజుక రెచ్చిపోతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా.. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం మదమెక్కి వ్యవహరిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెల తీర్చుకోవడానికి వారిని వాడుకుంటున్నారు. అలాంటి ఓ కామాంధుడి గుట్ట రట్టు చేశారు విద్యార్థినులు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజీలో విద్యార్థునులపై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ చేస్తూ.. వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్న జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్‌కు విద్యార్థినులను వేధిస్తున్నాడు.
నందమూరి అభిమానుల అభిలాష!
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం! అందుకు కారణం- తారకరత్న పలుమార్లు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొనడం, తద్వారా ఫ్యాన్స్ లో ఎంతోమంది పరిచయం కలగడం, కనిపించిన ప్రతీవారితోనూ ఆప్యాయంగా మాట్లాడడం – అని తెలుస్తోంది. తారకరత్న కన్నుమూశాక, దర్శకుడు అనిల్ రావిపూడి తాను బాలకృష్ణతో తెరకెక్కించబోయే చిత్రంలో తారకరత్న కోసం ఓ పాత్రను క్రియేట్ చేశానని, అందుకు బాలకృష్ణ కూడా ఎంతో సంతోషించారని చెప్పారు. అలాగే ప్రభాస్ తో తాము నిర్మిస్తోన్నభారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’లో కూడా తారకరత్నకు ఓ కీలక పాత్ర ఇవ్వాలని భావించామని నిర్మాత అశ్వనీదత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానుల్లో ఓ ఆలోచన కలిగింది.
టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు , తాళ్ల వెంకటేశ్ యాదవ్, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్ నిజాముద్దీన్ తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా… ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీకి ఉన్న ఓటమి భయాన్ని తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ను తక్షణమే వెనక్కి తీసుకొని, పట్టభద్రులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇదిలా ఉంటే.. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
చంద్రబాబు భార్య కోసం బయట, కొడుకు కోసం లోపల ఏడుస్తాడు..
పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు… నేను, వంశీ రమ్మని చెప్పామా అంటూ నాని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్ ఎన్టీఆర్ కన్నా వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. పోలీస్ వ్యవస్థపై అభాండాలు వేస్తూ కులాలు, మతాలు అంట గడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకులపై దాడి జరిగిందని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని.. గన్నవరంలో అరెస్ట్ అయిన బీసీ నేతల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ వివేకా హత్య కేసులో 40 కోట్ల డీల్ జరిగింది అని చెప్పాడని.. సీబీఐ కూడా నలభై కోట్ల డీల్ జరిగిందని చెప్పిందన్న నాని.. వివేకా హత్య కేసులో నలభై కోట్ల డీల్ జరిగినట్లు లోకేష్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. సీబీఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది చంద్రబాబేనని అన్నారు. సీబీఐ వాళ్ళు చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేరన్నారు.
ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు ప్రయత్నం : మంత్రి తానేటి వనిత
గన్నవరంలో జరిగిన దాడులో గాయాలపాలైన సీఐని హోంశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి దాడులను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు డ్యూటీ చేయడం వల్లనే అందరూ హ్యపీగా ఉంటున్నారని, 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అనపర్తిలోని ఉద్దేశపూర్వకంగా సభకు అనుమతులు లేకున్న పోలీసులను ఇబ్బందులు పెట్టడానికి మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. పోలీసులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె వెల్లడించారు. లోకేష్ సైతం ఉద్దేశపూర్వకంగానే టేబుల్ పై నుంచొని మరీ సభలు నిర్వహిస్తున్నాడని తానేటి వనిత విమర్శించారు. పట్టాభి కోర్టులో తనపై ధర్డ్ డిగ్రీ జరిగిందంటూ ఆరోపణలు చేశారని. అబద్దాలకు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటాడో అలాగా ఉన్నాడు పట్టాభి అని తానేటి వనిత సెటైర్లు వేశారు. గెదే చెలో మెస్తే దూడ ఎక్కడా మేస్తుందో అదే విధంగా టీడీపీ నేతలు వ్యవహారిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.