విద్యార్థినిపై దాడి కలచివేసింది.. కడప ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారని ఆయన వెల్లడించారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే…. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమేనన్నారు. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించానన్నారు.
రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒక్క అజెండా ఉంది.. అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వాల్ల ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారు.. రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ పని తీరు ఉందన్నారు.
ప్రజలు ఆశివదించిన ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. హైడ్రా పేద వాళ్ళ జోలికి వెళ్ళడం లేదన్నారు. పేదవారి భుజం మీద తుపాకీ పెట్టీ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ముందు ల్యాండ్ గ్రాబర్స్, పెద్ద వారి నుండి వస్తె.. అప్పుడు పేదవాళ్లకు కొంత భరోసా కలుగుతుందన్నారు. పేద వాళ్లకు రక్షకులుగా కలరింగ్ ఇస్తున్నారు..కానీ పెద్ద వారిని రక్షించాలని ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు పలువురు నాయకులని తెలిపారు. బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ పడుతుందన్నారు. ప్రభుత్వం లక్ష్యం గురి తప్పుతుందన్నారు.
కూల్చివేతలపై తప్పుడు వార్తలు.. హైడ్రా కీలక ప్రకటన
హైదారబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. అనుమతులు ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సరస్సులు, చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న ఏ నిర్మాణాన్ని కూల్చివేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైడ్రా ఈ ఆదేశానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని ట్విటర్ వేదికగా వెల్లడించింది. హైదరాబాద్ లోని బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఆక్రమణలకు గురైన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రామా కూల్చివేతపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నక్రమంలో హైడ్రా వివరణ ఇచ్చింది.
మహిళకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప అన్ని తుస్సు మన్నాయి..
మహిళకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప అన్ని తుస్సు మన్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఆలయ్ బలయ్ ధూమ్ దాం లో హరీష్ రావు పాల్గొన్నారు. పథకాల పాలన పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు రైతులను ప్రజలను మహిళలను మోసం చేసిందన్నారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన వ్యాపించిన సమయంలో కూడా రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదన్నారు. కేసీఆర్ పాలనలో 11 సార్లు 72 వేల కోట్ల రూపాయలు రైతు బందు రైతులకు ఇచ్చినం అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల రూపాయలు బాకి ఉన్నదని మహిళకు గ్రామగ్రామాన వివరించాలన్నారు. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి, మన సీఎం చీటింగ్ సీఎం అని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలలో లైట్లు వేసేందుకు పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండన్నారు.
లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. బద్వేల్ ఘటనపై జగన్ ట్వీట్
బద్వేల్లో కాలేజీ విద్యార్థిని హత్యాచారం చేసిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ x వేదికగా స్పందించారు. ‘లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు..? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు.’ అని ట్వీట్ చేశారు.
రైతు భరోసా ఎగగొట్టడం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమే
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టడం రాష్ట్ర రైతంగాన్ని మోసం చేయడమే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పోయినట్లే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇచ్చిన ప్రకటన కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం లో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వానాకాలం పంట సీజన్ కు రైతులకు రైతుబంధు వస్తుందన్న ఆశ ఆడియశలు అయ్యాయన్నారు.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ..
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు 2025 మార్చితో ముగుస్తాయి. ఈ క్రమంలో.. ఈ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ప్రకటించింది టీడీపీ. రాజశేఖర్.. ఐ పోలవరం ఎంపీపీగా, జెడ్పిటీసీగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటు ఆశించారు రాజశేఖర్. అయితే.. కాకినాడ రూరల్ నుంచి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసింది. మరోవైపు.. కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ప్రకటించింది టీడీపీ. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఏపీకి మరో వాయుగుండం ముప్పు..
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతు భరోసా ఏదీ లేదు
ఇబ్రహీంపట్నoలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాళ్ల పాలనలో ఈ సారి దసరా దసరా లెక్క లేదు, బతుకమ్మ, వినాయక చవితి పండుగలు గతంలో మాదిరిగా జరగలేదన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నాడని, కేసీఆర్ ముష్టి రూ. 10 వేలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే రూ. 15 వేలు ఇస్తా అన్నాడన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చావు కబురు చల్లగా చెప్పిండని, నాట్లు కాదు కోతలు కూడా అయిపోతున్నాయి…రైతు భరోసా ఏదీ అంటే… ఈ ఖరీప్ సీజన్ కు పైసలు లేవు అన్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మేము ఖరీఫ్ రైతు భరోసా ఎగగొడుతున్నామని సిగ్గు లేకుండా చెప్పిండని కేటీఆర్ ధ్వజమెత్తారు. 15 వేలు ఎస్తా అన్న సిపాయి… ఇప్పుడు 10 వేలు కూడా వేసే పరిస్థితి లేక తప్పించుకుంటున్నాడని, బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి. మేము ఎలాగు రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. కానీ రైతు సంఘాలు ఎందుకు మూగబోయాయి.. కమ్యూనిస్టులు ఎక్కడ పోయారని ఆయన అన్నారు.